MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/athreya-acharya-athreya-manasu-kavi-2a1935ec-f3c8-4bab-bfb7-671b28f226b1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/athreya-acharya-athreya-manasu-kavi-2a1935ec-f3c8-4bab-bfb7-671b28f226b1-415x250-IndiaHerald.jpgమనసు కవి ఆచార్య ఆత్రేయ గురించి బాహ్య ప్రపంచానికి తెలిసిన విషయాలకంటే, తెలియని విషయాలే ఎక్కువ. అలాంటి వాటిని ఓ సందర్భంలో ఆయన సతీమణి పద్మావతి వెల్లడించడం విశేషం. ఆత్రేయ జీవితంలో ముగ్గురు పద్మలున్నారనే విషయాన్ని కూడా ఆయన సతీమణి పద్మే చెప్పారు. స్కూల్ ఫైనల్ చదివే రోజుల్లో ‘బాణ’మనే అమ్మాయిని ఆత్రేయ ప్రేమించారట. బాణమనేది ఆమె ముద్దు పేరని, ఆమె అసలు పేరు కూడా పద్మావతేనని చెబుతారు ఆత్రేయ సతీమణి. athreya, acharya athreya, manasu kavi,;atreya;jeevitha rajaseskhar;kanchi;tara;nellore;nalamada padmavathi reddy;school;interview;service;kanchipuram;jonnalagadda padmavathyఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లుఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లుathreya, acharya athreya, manasu kavi,;atreya;jeevitha rajaseskhar;kanchi;tara;nellore;nalamada padmavathi reddy;school;interview;service;kanchipuram;jonnalagadda padmavathyFri, 07 May 2021 11:00:00 GMTమనసు కవి ఆచార్య ఆత్రేయ గురించి బాహ్య ప్రపంచానికి తెలిసిన విషయాలకంటే, తెలియని విషయాలే ఎక్కువ. అలాంటి వాటిని ఓ సందర్భంలో ఆయన సతీమణి పద్మావతి వెల్లడించడం విశేషం. ఆత్రేయ జీవితంలో ముగ్గురు పద్మలున్నారనే విషయాన్ని కూడా ఆయన సతీమణి పద్మే చెప్పారు. స్కూల్ ఫైనల్ చదివే రోజుల్లో ‘బాణ’మనే అమ్మాయిని ఆత్రేయ ప్రేమించారట. బాణమనేది ఆమె ముద్దు పేరని, ఆమె అసలు పేరు కూడా పద్మావతేనని చెబుతారు ఆత్రేయ సతీమణి.

"ఆయన జీవితంలో ముగ్గురు పద్మలున్నారు. ప్రేమించిన పద్మ సగోత్రం కారణంగా మా మావగారు అభ్యంతరం చెప్పడం వల్ల దూరమైంది. పెళ్లాడిన పద్మను నేను. నేను కూడా కారణాంతరాల వల్ల ఎక్కువ కాలం ఆయనకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. మూడో పద్మ నెల్లూరులో టైఫాయిడ్ జ్వరం వల్ల అసుపత్రిలో చేరినప్పుడు ఆయనకు సేవ చేసిన నర్సు. వృత్తి ధర్మమైన విధి నిర్వహణగా కాక, వ్యక్తిగతంగా తనను అభిమానించి, సేవ చేసి బతికించిందని ఆత్రేయ ఆమెను చాలా మెచ్చుకొనేవారు. ఆ తర్వాత ఆమెకు కంచి బదిలీ అయితే, అప్పుడప్పుడూ అక్కడికి వెళ్లి చూసి వస్తుండేవారు. ఆ పద్మ అకాల మరణానికి ఆయన ఎంతో బాధపడ్డారు." అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆత్రేయ సతీమణి పద్మ.

1940లో ఆత్రేయతో పద్మావతికి వివాహం జరిగింది. వారిది దగ్గరి బంధుత్వమే. అయితే 1954లో ఆయన సతీమణి పద్మను మద్రాసు తీసుకెళ్లి కాపురం పెట్టారు. ఆళ్వారుపేటలోని చిన్న ఇంట్లో ఉండేవారు. ఆయన రోజూ ఇంటికొచ్చేవారు కాదని, ఇంటి యజమానులకు సకాలంలో బాడుగ కూడా చెల్లించేవారు కాదని చెబుతారు పద్మావతి. 1956లో ఆత్రేయ అత్తమ్మకు కాళ్లు చచ్చుపడిన కారణంగా, ఆయన సతీమణి పద్మావతి మంగళంపాడుకి తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత భార్యా భర్తలిద్దరూ కలసి ఉన్న సందర్భాలు తక్కువే.

వివాహ బంధం సరిగా సాగకపోవడంతో.. నల్ల కమల అనే మహిళను ఆత్రేయ చేరదీశారని చెబుతారు. కమల సంతానమే అసలు ఆత్రేయ కూతుళ్లుగా చెలామణి అయ్యారట. ఆమె 1978లో చనిపోగా.. ఆ తర్వాత ఆ కుటుంబ భారాన్నంతా ఆత్రేయే మోశారట. ఆయన సంపాదన అంతా వారికే ఖర్చు చేసేవారని, సొంత ఇల్లు, ఆస్తిపాస్తులు అన్నీ వారికోసమే త్యాగం చేశారని అంటారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా కట్టడికై వైసీపీ ఎంపీ కోటి విరాళం..!!

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో అసలేం జరుగుతోంది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>