PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kamal-haasan-is-serious-about-party-vice-presidentdc7f4ab7-eee5-4550-a539-11b316bb7c9a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kamal-haasan-is-serious-about-party-vice-presidentdc7f4ab7-eee5-4550-a539-11b316bb7c9a-415x250-IndiaHerald.jpgతమిళనాడు ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా జరిగాయి. సినీ నటుడు కమల్ హాసన్‌కు చుక్కెదురైంది. ఈయన స్థాపించిన పార్టీ మక్కల్ నీది మయ్యమ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా పార్టీ అధ్యక్షుడే ఓటమిపాలు కావడంతో పార్టీ నేతల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది.kamal hasan;chiranjeevi;kamal hassan;mahendran;manu;rani;రాజీనామా;tamilnadu;prajarajyam party;partyపార్టీ ఉపాధ్యక్షుడిపై కమల్ హాసన్ సీరియస్..!పార్టీ ఉపాధ్యక్షుడిపై కమల్ హాసన్ సీరియస్..!kamal hasan;chiranjeevi;kamal hassan;mahendran;manu;rani;రాజీనామా;tamilnadu;prajarajyam party;partyFri, 07 May 2021 17:30:31 GMTతమిళనాడు ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా జరిగాయి. సినీ నటుడు కమల్ హాసన్‌కు చుక్కెదురైంది. ఈయన స్థాపించిన పార్టీ మక్కల్ నీది మయ్యమ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా పార్టీ అధ్యక్షుడే ఓటమిపాలు కావడంతో పార్టీ నేతల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం అయినట్లు అనిపిస్తోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు.. మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయాల్లో పరాభావం ఎదుర్కొని.. మళ్లీ సినిమాల్లో రాణిస్తున్నారనే విషయం తెలిసిందే.

తమిళనాడు ఎన్నికల్లో కమల్ హాసన్ దారుణ ఓటమిని చవి చూశారు. దీంతో ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎన్నికల ఫలితాలను చూస్తే తమిళీయులు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపినట్లు అనిపిస్తుంది. ప్రధానం అధికార పార్టీకే ఓటు వేసినట్లు అనిపిస్తుంది. ఎన్నికల ఓటమిపాలు కావడంతో మక్కల్ నీది మయ్యమ్  పార్టీ ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడే చేతులెత్తేయడంతో పార్టీలో గందరగోళం నెలకొంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని తేల్చి చెప్పినా.. ముఖ్యనేతలు పార్టీ మారుతున్నారు.

ఈ మేరకు పార్టీ నాయకులతో కమల్ హాసన్ సమీక్ష నిర్వహించారు. కానీ, వరుసగా పార్టీ నాయకులు రాజీనామా చేయడంతో పార్టీ మనుగడపై సందేహాలు నెలకొన్నాయి. దీంతో కమల్ హాసన్ అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందనే నేతనే పార్టీని వీడటం అందరిలో ఆశ్చర్యాన్ని పెంచింది. ఈ విషయంపై కమల్ హాసన్ ఘాటుగానే స్పందించారు. మహేంద్రన్ ద్రోహి అంటూ కామెంట్స్ చేశారు. దీంతో పార్టీలో తీవ్ర కలకలం నడుస్తోంది. పార్టీలో యూనిటి లేదని, విభజించి పాలించే పద్ధతిలో నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఈ ఎన్నికల్లో గెలవడానికి ఎంతో ప్రయత్నించామన్నారు. కానీ తానూ కూడా ఓటమిపాలు అవుతానని ఊహించలేదన్నారు. పార్టీలో గెలుపోటములు సహజమన్నారు. కాగా, కమల్ హాసన్ భవిష్యత్ కార్యచరణ ఎలా ఉండబోతుందో తెలుపలేదు. మళ్లీ సినిమాల్లో నటిస్తారా..? లేదా రాజకీయాల్లోనే రాణిస్తారనే తెలియాల్సి ఉంది. కాగా, తమిళనాడులో సినీ నటులు రాజకీయంగా రాణించలేరని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఈటల విషయంలో మరింత వ్యూహాత్మకముగా అడుగులేస్తున్న కేసీఆర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>