MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-3918479b-6407-4127-b925-40d0b5c6ec31-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-3918479b-6407-4127-b925-40d0b5c6ec31-415x250-IndiaHerald.jpgఆమెకు బోలెడు అంత అందం ఉంది. అదే ఇపుడు ఆయుధం అవుతోంది. అభినయం విషయంలో ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో మార్కులైతే పెద్దగా పడలేదు. అయితేనేమి. గ్లామర్ టన్నుల కొద్దీ ఉంది. అందుకే రేసులో దూసుకుపోవాలని చూస్తోంది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ స్వీట్ హీరోయిన్ నిధి అగర్వాల్. nidhi;beauty;pawan;mahesh;naga chaitanya;nidhhi agerwal;abinaya;ashok;kalyan;krish;naga;nageshwara rao akkineni;nidhi;pawan kalyan;shankar;srinivas;trivikram srinivas;tollywood;cinema;telugu;rajani kanth;naga aswin;ismart shankar;hero;heroine;chaitanya 1;savyasachi;adhursస్టార్ హీరోయిన్ రేసులో స్వీట్ బ్యూటీ... ?స్టార్ హీరోయిన్ రేసులో స్వీట్ బ్యూటీ... ?nidhi;beauty;pawan;mahesh;naga chaitanya;nidhhi agerwal;abinaya;ashok;kalyan;krish;naga;nageshwara rao akkineni;nidhi;pawan kalyan;shankar;srinivas;trivikram srinivas;tollywood;cinema;telugu;rajani kanth;naga aswin;ismart shankar;hero;heroine;chaitanya 1;savyasachi;adhursFri, 07 May 2021 19:00:00 GMTఆమెకు బోలెడు అంత అందం ఉంది. అదే ఇపుడు ఆయుధం అవుతోంది. అభినయం విషయంలో ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో మార్కులైతే పెద్దగా పడలేదు. అయితేనేమి. గ్లామర్ టన్నుల కొద్దీ ఉంది. అందుకే రేసులో దూసుకుపోవాలని చూస్తోంది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ స్వీట్ హీరోయిన్ నిధి అగర్వాల్.

ఈ అమ్మడు తెలుగులో చేసిన మొదటి సినిమా సవ్యసాచి. అక్కినేని కాంపౌండ్ హీరో నాగ చైతన్య పక్కన జతగా నటించిన నిధికి ఈ మూవీ చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఈ మూవీ ఫ్లాప్ కావడంతో అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. అలా చిన్న సినిమాలు ఒకటీ అరా చేసుకుంటూ పోతున్న ఆమెకు బంపర్ హిట్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లోని ఇస్మార్ట్ శంకర్ మూవీతో వచ్చింది.

దీంతో అమ్మడు సూపర్ హిట్టే అనుకున్నారంతా. కానీ ఆ మూవీ తరువాత రెండేళ్ళు వెయిట్ చేసిన సరైన సినిమా మాత్రం రాలేదు. ఈలోగా మహేష్ మేనల్లుడు గల్ల అశోక్ డెబ్యూ మూవీలో హీరోయిన్ గా ఎంపిక అయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ చేతుల్లో ఉండగానే నిధి మరో రెండు బంపర్ ఆఫర్లను పట్టేసిందని ప్రచారం అయితే సాగుతోంది. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్  డైరెక్షన్ లో వస్తున్న‌ హరిహర వీరమల్లు మూవీలో నిధిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని టాక్. దాంతో నిధి జాతకం అదుర్స్ అని అంతా అంటున్నారు.

ఈ న్యూస్ ఇలా ఉండగానే ఇపుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయబోయే కొత్త మూవీలో నిధిని ఒక హీరోయిన్ గా తీసుకుంటారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అదే నిజం అయితే నిధి నక్కను తొక్కినట్లే అంటున్నారు. అటు పవన్, ఇటు మహేష్ ఈ రెండూ కూడా అద్భుతమైన ఆఫర్లే. ఈ సినిమాల మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి కాబట్టి ఇవి హిట్ అయితే నిధి టాలీవుడ్ లో నంబర్ వన్ రేసులోకి వచ్చేయడం ఖాయమని అంటున్నారు. మరి చూడాలి నిధి లక్ ఎలా ఉందో.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుడ్డి వాళ్ళను చేస్తున్న కొత్త ఫంగస్.. కరోనాను గెలిచినా..!

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>