PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yogib264daed-b85d-4c82-8c7b-b76a3867208c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yogib264daed-b85d-4c82-8c7b-b76a3867208c-415x250-IndiaHerald.jpgయోగి ఆదిత్యనాథ్.. ఉత్తర ప్రదేశ్ సీఎం.. ఓ సన్యాసి ముఖ్యమంత్రి కావడం బహుశా ఆయనతోనే మొదలు కావచ్చు. యోగి సీఎం అయ్యినదగ్గర నుంచి ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. మొదట్లో ఆయన నిర్ణయాలకు అందరి నుంచి ప్రశంసలు దక్కాయి. కానీ.. ఆ తర్వాత కాలంలో ఆయన పనితీరు విమర్శల పాలవుతోంది. అందులోనూ కరోనా కట్టడి విషయంలో సీఎం యోగి అంత చురుకుగా పని చేయలేదని.. కరోనాను నిర్లక్ష్యం చేశారని విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు యూపీలో రాజకీయ ముఖ చిత్రం మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు యూపీ స్థానిక సంస్థల ఎyogi;yogi;bharatiya janata party;uttar pradesh;yogi adityanath;akhilesh yadav;congress;chief minister;sanyasam;local language;partyయూపీలో యోగికి షాక్.. ఆ ఎన్నికల్లో అఖిలేష్ దూకుడు...!యూపీలో యోగికి షాక్.. ఆ ఎన్నికల్లో అఖిలేష్ దూకుడు...!yogi;yogi;bharatiya janata party;uttar pradesh;yogi adityanath;akhilesh yadav;congress;chief minister;sanyasam;local language;partyFri, 07 May 2021 09:00:00 GMTయోగి ఆదిత్యనాథ్.. ఉత్తర ప్రదేశ్ సీఎం.. ఓ సన్యాసి ముఖ్యమంత్రి కావడం బహుశా ఆయనతోనే మొదలు కావచ్చు. యోగి సీఎం అయ్యినదగ్గర నుంచి ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. మొదట్లో ఆయన నిర్ణయాలకు అందరి నుంచి ప్రశంసలు దక్కాయి. కానీ.. ఆ తర్వాత కాలంలో ఆయన పనితీరు విమర్శల పాలవుతోంది. అందులోనూ కరోనా కట్టడి విషయంలో సీఎం యోగి అంత చురుకుగా పని చేయలేదని.. కరోనాను నిర్లక్ష్యం చేశారని విమర్శలు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో ఇప్పుడు యూపీలో రాజకీయ ముఖ చిత్రం మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు యూపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అద్దం పడుతున్నాయి. తాజాగా జరిగిన స్థానిక సంస్థల్లో అఖిలేష్ యాదవ్ సమాజ్ వాద్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. అధికార బీజేపీకి దీటుగా విజయాలు నమోదు చేసింది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పక్షానికి చాలా అనుకూల పరిస్థితులు ఉంటాయి. విపక్షాలు సాధారణంగా వెనుకపడుతుంటాయి.

మొన్నటికి మొన్న ఏపీలో పరిస్థితి చూశాం కదా. కానీ.. యూపీలో సీన్ తేడాగా ఉంది. ఇక ఫలితాల గణంకాలు చూస్తే.. మొత్తం స్థానాల్లో బీజేపీ 25 శాతం వరకూ సీట్లు గెలుచుకుంది. మొత్తం 765 చోట్ల విజయం సాధించింది. అటు సమాజ్‌ వాద్ పార్టీ సైతం అధికార పార్టీ స్థాయిలోనే సత్తా చాటింది. దాదాపు 750 స్థానాల్లో గెలుపొంది తన బలమేంటో నిరూపించుకుంది. మరో పార్టీ బీఎస్సీ కూడా 350 సీట్లు సాధించింది. ఈ పార్టీ 11.5 శాతం స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 74 సీట్లు గెలుచుకుంది.

మొత్తం సీట్లలో అధికారంలో ఉన్న యోగి కేవలం 25 శాతం మాత్రమే గెలుచుకోవడం ప్రమాదకర సంకేతాలు ఇస్తోందంటున్నారు విశ్లేషకులు. ఈ లెక్కల ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ చేతులు కలిపితే.. బీజేపీ పని ఖతం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాయ్స్ స్టెప్ ఛాలెంజ్ - డబ్బు గెలుచుకోండి !

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఈటల విషయంలో మరింత వ్యూహాత్మకముగా అడుగులేస్తున్న కేసీఆర్ ?

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>