PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-and-etela-a5114bcb-f8a2-4a47-b5a6-fc72e8913710-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-and-etela-a5114bcb-f8a2-4a47-b5a6-fc72e8913710-415x250-IndiaHerald.jpgఈట‌ల రాజేంద్ర‌పై కేసీఆర్ ప్ర‌యోగించిన అస్త్రం కాస్త‌.. కేబినెట్‌లోని ప‌లువురు మంత్రులు, ప‌లువురు తెరాస ఎమ్మెల్యేల‌కు తిప్ప‌లు తెచ్చిపెడుతుంద‌ట‌. భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈట‌ల రాజేంద‌ర్‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన కేసీఆర్‌పై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌ల దాడిని కొన‌సాగిస్తున్నాయి. కేబినెట్‌లో మంత్రి మ‌ల్లారెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్, ప్ర‌శాంత్ రెడ్డి, ప‌లువురు తెరాస ఎమ్మెల్యేల‌పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈట‌ల‌పై వేగంగా నిర్ణ‌యాలు తీసుకున్న కేసీఆర్.. వీరిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఎందుకు పKCR and etela;kcr;kumaar;revanth;telangana rashtra samithi trs;revanth reddy;backward classes;cabinet;minister;reddy;malla reddy;party;mantraకేసీఆర్ లెక్క త‌ప్పిందా? ఆ నేత‌ల‌కు తిప్ప‌లు త‌ప్ప‌వా..కేసీఆర్ లెక్క త‌ప్పిందా? ఆ నేత‌ల‌కు తిప్ప‌లు త‌ప్ప‌వా..KCR and etela;kcr;kumaar;revanth;telangana rashtra samithi trs;revanth reddy;backward classes;cabinet;minister;reddy;malla reddy;party;mantraFri, 07 May 2021 16:57:10 GMTరాజ‌కీయ చాణుక్యుడిగా పేరున్న సీఎం కేసీఆర్ అంచ‌నాలు త‌ప్పాయా.. ఆయ‌న వేసిన ప్లాన్ బెడిసికొట్టిందా..?  ప్ర‌త్య‌ర్థుల కంటే త‌న మ‌నుషుల‌కే ఎక్కువ ఇబ్బందులు తెచ్చిపెడుతుందా.. అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. ఈట‌ల రాజేంద‌ర్‌పై వ‌చ్చిన అసైన్డ్ భూముల క‌బ్జా ఆరోప‌ణ‌ల‌పై సీఎం కేసీఆర్ సీరియ‌స్‌గా స్పందించారు. ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ క‌మిటీ వేయ‌డంతో పాటు విచార‌ణ జ‌రుగుతున్న క్ర‌మంలోనే ఈట‌ల‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. సీఎం కేసీఆర్ నిర్ణ‌యం రాష్ట్ర రాజ‌కీయాల్లో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది. అంతేకాక ఈట‌ల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసేందుకు సైతం కేసీఆర్ సిద్ధ‌ప‌డిన‌ట్లు స‌మాచారం.

ఈట‌ల రాజేంద్ర‌పై కేసీఆర్ ప్ర‌యోగించిన అస్త్రం కాస్త‌.. కేబినెట్‌లోని ప‌లువురు మంత్రులు, ప‌లువురు తెరాస ఎమ్మెల్యేల‌కు తిప్ప‌లు తెచ్చిపెడుతుంద‌ట‌. భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈట‌ల రాజేంద‌ర్‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన కేసీఆర్‌పై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌ల దాడిని కొన‌సాగిస్తున్నాయి. కేబినెట్‌లో మంత్రి మ‌ల్లారెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్, ప్ర‌శాంత్ రెడ్డి, ప‌లువురు తెరాస ఎమ్మెల్యేల‌పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈట‌ల‌పై వేగంగా నిర్ణ‌యాలు తీసుకున్న కేసీఆర్.. వీరిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఎందుకు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు బీసీ సంఘాల ఆధ్వ‌ర్యంలో భూములు క‌బ్జాల‌కు పాల్ప‌డిన మంత్రుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేస్తున్నారు.

ప్ర‌ధానంగా దేవ‌ర‌యాంజ‌ల్ భూముల అంశాన్ని అధికార పార్టీ అధికారిక ప‌త్రిక‌లో ప్ర‌చురించిన స‌ర్వే నెంబ‌ర్లు, భూ క‌థ‌నాల‌ను సాక్షిగా చూపిస్తూ వాటిపై విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెంచాయి ప్ర‌తిప‌క్షాలు. ఏకంగా నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ పేరుతో రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో దేవ‌ర‌యాంజ‌ల్ భూముల్లో ప‌రిశీల‌న చేశాడు. అయితే ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా బ‌య‌ట‌పెట్టిన స‌ర్వే నెంబ‌ర్లు మంత్రి వ‌ర్గానికి త‌ల‌నొప్పిగా మారుతున్నాయి. ఆ స‌ర్వే నెంబ‌ర్‌ల‌లో మంత్రులు కేటీఆర్‌, మ‌ల్లారెడ్డి అనుచ‌రులు, బంధువులు భూములు ఉన్న‌ట్లు ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను బ‌య‌ట‌ప‌డ్డాయి. అంతేకాకుండా తెరాస నేత‌లు నూత‌నంగా నిర్మాణాలు చేస్తున్న నిర్మాణాలుసైతం వెలుగులోకి వ‌చ్చాయి. మ‌రోవైపు ఈ వ్య‌వ‌హారం అధికారుల‌కు కూడా త‌ల‌నొప్పిగా మారింద‌ట‌. దేవ‌ర‌యాంజ‌ల్ భూముల‌పై విచార‌ణ‌కు న‌లుగురు ఐఏఎస్ అధికారుల‌తో బృందాన్ని సీఎం కేసీఆర్ విచార‌ణకు ఆదేశించారు. దేవ‌ర యాంజ‌ల్ భూములు క‌బ్జాకు గురైన‌ట్లు ప్రాథ‌మికంగా గుర్తించారు. కానీ ఎక్క‌డ .. ఎవ‌రెవ‌రు అనే వివ‌రాల‌ను బ‌య‌ట పెట్టే సాహ‌సం చేయ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొత్తానికి సీఎం కేసీఆర్ లెక్క‌త‌ప్పి మంత్రులకు త‌ల‌నొప్పి తెచ్చిపెడుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"డ్రాగన్" కంట్రీకి గుణపాఠం చెప్పిన యూరోపియన్ యూనియన్ ?

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>