PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bharat-7713973e-45b5-47db-a33c-37c123638d4d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bharat-7713973e-45b5-47db-a33c-37c123638d4d-415x250-IndiaHerald.jpgభారత దేశం వరస్ట్ ఎగ్జాంపుల్ అవుతోంది. ఇతర దేశాలకు గుణపాఠం అవుతోంది. ప్రపంచంలో రెండవ అతి పెద్ద జనాభా కలిగిన దేశం ఒక మహమ్మారి బారిన పడి విలవిలలాడుతోంది. ప్రపంచంలో ఉన్న దేశాలు అన్నీ కలసినా భారత్ కి సాయం చేసే పరిస్థితి ఉండదు. bharat;india;american samoa;white house;population;doctor;international;house;paruguభారత్ లో చేయి దాటేస్తోంది... ?భారత్ లో చేయి దాటేస్తోంది... ?bharat;india;american samoa;white house;population;doctor;international;house;paruguFri, 07 May 2021 21:00:00 GMTభారత దేశం వరస్ట్ ఎగ్జాంపుల్ అవుతోంది. ఇతర దేశాలకు గుణపాఠం అవుతోంది. ప్రపంచంలో రెండవ అతి పెద్ద జనాభా కలిగిన దేశం ఒక మహమ్మారి బారిన పడి విలవిలలాడుతోంది. ప్రపంచంలో ఉన్న దేశాలు అన్నీ కలసినా భారత్ కి సాయం చేసే పరిస్థితి ఉండదు.

భారత్ ఏనుగు లాంటిది. అది పడిపోయిందా లేపడం ఒకరి వల్ల జరిగేది కాదు. భారత్ తనంతట తానే లేవాలి. ఇపుడు కరోనా మహమ్మారి రెండవ దశ భారత్ ని అల్లల్లాడిస్తోంది. దాంతో భారత్ కకావికలం అవుతోంది. ఆ వయసూ ఈ వయసూ అని లేకుండా అందరినీ గట్టిగా టార్గెట్ చేస్తోంది. కరోనా విలయానికి ఇంత పెద్ద దేశమూ కూడా  విషాదభరితం అవుతోంది.

దీనికి పాలకులు, ప్రజలు కూడా కలసి తప్పు చేశారు అనే చెప్పాలి. కరోనా ముప్పు లేదని, అది భారత్ లో ఎప్పటికీ రాదనే భావించి ఏమరుపాటుగా ఉండడమే కొంప ముంచినట్లు అవుతోంది. ఇదిలా ఉంటే భారత్ లో లక్ష కేసులు వస్తేనే అమ్మో అనుకున్న వారికి ఇపుడు అయిదు లక్షల దిశగా పరుగులు పెడుతున్న సీన్ మతులే పోగొడుతోంది. ఇతర దేశాలు అయితే ఈ ప్రపంచ రికార్డుని ఊపిరి బిగబట్టి మరీ చూస్తున్నాయి.

వరసపెట్టి నాలుగు లక్షల పై చిలుకు కేసులు నాలుగు వేల దకా కరోనా మరణాలను చూసిన అమెరికా వైట్ హౌస్   ప్రధాన వైద్య సలహాదారు, అంతర్జాతీయ అంటు వ్యాధుల నిపుణుడు అయిన డాక్టర్ ఆంతోనీ ఫౌజీ అయితే పరిస్థితి పూర్తిగా భారత్ లో చేయి దాటేస్తోంది అనే అంటున్నారు. భారత్ ఇపుడు కనుక లాక్ డౌన్ చర్యలు చేపట్టకపోతే మాత్రం అతి పెద్ద మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. అంతే కాదు ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలుతుందని, మరే ఇతర భయాలు కూడా ఈ సమయంలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని కూడా ఆయన అంటున్నారు. తక్షణం లాక్ డౌన్ విధించి కరోనా మహమ్మారి బలమైన  గొలుసును తెంచాలని ఆయన సూచిస్తున్నారు. ఇదే మాట దేశంలోని ప్రముఖులు, నిపుణులు  కూడా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే భారత్ పరిస్థితి మీద అంతర్జాతీయ సమాజం ఆందోళన పడుతోంది. మరి మన పాలకులు కఠిన నిర్ణయాలు తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ వేయించుకున్న స్టార్ హీరోయిన్.. ఆమెతో పాటు అతడు కూడా..

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>