MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthihasan-b74ef227-ccd7-4121-b77d-3db70f6ae007-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthihasan-b74ef227-ccd7-4121-b77d-3db70f6ae007-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో శృతిహాసన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో ‘క్రాక్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన శృతీ. ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది.తరువాత ‘వకీల్ సాబ్’ మూవీలో పవన్ సరసన కూడా నటించి మరో హిట్ ను సొంతం చేసుకుంది.sruthihasan;pawan;prabhas;balakrishna;shruti haasan;boyapati srinu;gopichand malineni;cinema;nandamuri balakrishna;blockbuster hit;heroine;traffic police;nandamuri taraka rama rao;leader;krack;chitramబాలయ్యకు జోడీగా స్టార్ హీరోయిన్..!బాలయ్యకు జోడీగా స్టార్ హీరోయిన్..!sruthihasan;pawan;prabhas;balakrishna;shruti haasan;boyapati srinu;gopichand malineni;cinema;nandamuri balakrishna;blockbuster hit;heroine;traffic police;nandamuri taraka rama rao;leader;krack;chitramFri, 07 May 2021 09:00:00 GMTచిత్ర పరిశ్రమలో శృతిహాసన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో ‘క్రాక్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన శృతీ. ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది.తరువాత ‘వకీల్ సాబ్’ మూవీలో పవన్ సరసన కూడా నటించి మరో హిట్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాలో ఈమె కనిపించింది కాసేపే అయినా.. తన నటనతో ఆకట్టుకుంది. అయితే గత కొద్దిరోజులుగా శృతీ హాసన్ బాలయ్యకు జోడీగా నటించనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ‘అఖండ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్ బ్రహ్మాండమైన రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ‘క్రాక్’ సినిమాతో గోపిచంద్ మలినేని ఇటీవలే సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో ఆయనకు బాలయ్యను డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది. అందుకే గోపిచంద్ పకడ్బందీగా సినిమా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాను యాధార్థ ఘటనల ఆధారంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారు. వారిలో ఒకరు శ్రుతిహాసన్ అనే టాక్ వినిపిస్తోంది. గోపిచంద్ మలినేనికి శ్రుతిహాసన్ లక్కీ హీరోయిన్. ఆమెతో చేసిన ‘బలుపు, క్రాక్’ రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఆ సెంటిమెంట్ మూలానే ఆయన బాలయ్యకు జోడీగా శ్రుతిహాసన్ ను తీసుకొస్తున్నారట. రెండవ కథానాయకిగా ఎవరు నటిస్తున్నారో చూడాలి. ‘అఖండ’ పూర్తయ్యాక, కరోనా సిట్యుయేషన్ అదుపులోకి వచ్చాక ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ప్రభాస్.. ‘సలార్’ మూవీలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

థర్డ్ వేవ్ కు సిద్ధంకండి: సుప్రీం

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో అసలేం జరుగుతోంది ?

భార‌త వీధుల్లో శవాల గుట్ట‌లు..?

మెగాస్టార్ ఎప్పటికీ పోషించని పాత్ర అదే.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>