PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/stalin0954164a-6cde-4fc9-b4dd-6aa07f847a40-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/stalin0954164a-6cde-4fc9-b4dd-6aa07f847a40-415x250-IndiaHerald.jpgతమిళనాడు కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్ గురించి చెప్పాలంటే చాలానే ఉంటుంది. ఆయనది సుదీర్ఘమైన రాజకీయ జీవితం. నాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని యువజన నాయకుడిగా ఎదిరించిన చరిత్ర స్టాలిన్ కి ఉంది. దాదాపుగా అర్ధ శతాబ్దం పైగా తమిళ రాజకీయాల్లో ఉంటున్న సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన. stalin;jayalalitha;jeevitha rajaseskhar;udhayanidhi stalin;naveen patnaik;jammu and kashmir - srinagar/jammu;akhilesh yadav;m. karunanidhi;tamil;chief minister;history;tamilnadu;stalin;fatherతమిళనాట ఆ రికార్డు స్టాలిన్ దే ... ?తమిళనాట ఆ రికార్డు స్టాలిన్ దే ... ?stalin;jayalalitha;jeevitha rajaseskhar;udhayanidhi stalin;naveen patnaik;jammu and kashmir - srinagar/jammu;akhilesh yadav;m. karunanidhi;tamil;chief minister;history;tamilnadu;stalin;fatherFri, 07 May 2021 10:00:00 GMTతమిళనాడు కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్ గురించి చెప్పాలంటే చాలానే ఉంటుంది. ఆయనది సుదీర్ఘమైన రాజకీయ జీవితం. నాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని యువజన నాయకుడిగా ఎదిరించిన చరిత్ర స్టాలిన్ కి ఉంది. దాదాపుగా అర్ధ శతాబ్దం పైగా తమిళ రాజకీయాల్లో ఉంటున్న సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన.

ఆయనకు అన్ని అర్హతలూ ఉన్నా ముఖ్యమంత్రి పీఠం దక్కే విషయంలో మాత్రం చాలా లేట్ అయిందనే చెప్పాలి. తండ్రి కరుణానిధి అడుగుజాడలలో రాజకీయం నేర్చిన స్టాలిన్ ఆయనకు అసలైన వారసుడు. కరుణానిధి కూడా స్టాలిన్ ని ముఖ్యమంత్రిగా చూడాలని భావించేవారు. 2016 ఎన్నికల్లో  డీఎంకే గెలుస్తుంది అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రెండవసారి కూడా జయలలిత నాయకత్వాన అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. దాదాపుగా తొంబైకి పైగా సీట్లను సాధించినా కూడా డీఎంకే అధికారం చేజిక్కుకోలేకపోయింది. నాడు కనుక గెలిచి ఉంటే ఇంతకు అయిదేళ్లకు  ముందే స్టాలిన్ తమిళ సీఎం అయ్యేవారు.

మొత్తానికి రాజమార్గం గుండానే స్టాలిన్ తమిళ సీఎం అయ్యాడు. ఆయన ఇన్నేళ కృషికి ఇది తగిన బహుమానం అని అంటున్నారు. ఇక తమిళనాడులో కామరాజ్ నాడార్, రాజాజీ, భక్తవత్సలం, ఎమ్జీయార్, జయలలిత, కరుణానిధి వంటి వారు ముఖ్యమంత్రులుగా చేశారు. అయితే వీరి ఎవరికీ లేని రికార్డు స్టాలిన్ కి ఉంది. ఆయన అచ్చమైన వారసుడు. ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావడం తమిళ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్.  ఆ విధంగా స్టాలిన్ అక్కడ పొలిటికల్ గా పెద్ద  సంచలనమే క్రియేట్ చేశాడు అని చెప్పాలి.

భారత దేశాన చూసుకుంటే ఏపీలో వైఎస్ జగన్మోహనరెడ్డి, కర్నాటకలో కుమారస్వామి,  యూపీలో అఖిలేష్ యాదవ్ ఒడిషాలో నవీన్ పట్నాయక్, కాశ్మీర్ లో ఓమర్ అబ్దుల్లా తండ్రుల వారసులుగా సీఎం పీఠాన్ని అధిరోహించారు. కానీ తమిళనాడులో మాత్రం మొదటిసారి  ఈ విధంగా సీఎం కొడుకు సీఎం కావడం అన్నది స్టాలిన్ తోనే స్టార్ట్ అయింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో అసలేం జరుగుతోంది ?

భార‌త వీధుల్లో శవాల గుట్ట‌లు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>