PoliticsSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/alluri-seetharamaraju-vardanthi-902222e8-2b3c-4080-bf73-1f23d31dfd73-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/alluri-seetharamaraju-vardanthi-902222e8-2b3c-4080-bf73-1f23d31dfd73-415x250-IndiaHerald.jpgభారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం.సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మిన ఈయన అందుకోసం తన రక్తాన్ని చిందించారు. తెల్ల దొరల దొరతనాన్ని మట్టు కలిపిన మహనీయుడు రామరాజు..రెండేళ్ల పాటు బ్రిటిషర్లకు కంటిమీద కనుకులేకుండా చేసిన సీతారామరాజు.. తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారు. 1924 మే 7న శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు.alluri seetharamaraju vardanthi;surya sivakumar;vidya;godavari river;alluri sitarama raju;district;east;east godavari;west godavari;police station;sanskrit;traffic police;seetharamaraju;father;lie;seetharama raju;shaktiవిప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి..విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి..alluri seetharamaraju vardanthi;surya sivakumar;vidya;godavari river;alluri sitarama raju;district;east;east godavari;west godavari;police station;sanskrit;traffic police;seetharamaraju;father;lie;seetharama raju;shaktiFri, 07 May 2021 12:46:27 GMTభారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం.సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మిన ఈయన అందుకోసం తన రక్తాన్ని చిందించారు. తెల్ల దొరల దొరతనాన్ని మట్టు కలిపిన మహనీయుడు రామరాజు..రెండేళ్ల పాటు బ్రిటిషర్లకు కంటిమీద కనుకులేకుండా చేసిన సీతారామరాజు.. తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారు. 1924 మే 7న శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు.


అల్లూరి సీతారామరాజు 1897 జులై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు. అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. రామరాజు తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్య నారాయణమ్మ. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి.. సంస్కృతం, జోతిష్య శాస్త్రం, జాతక శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారు. 1917లో విశాఖపట్నం జిల్లా క్రిష్ణదేవీపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు. మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి, బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని మన్యం ప్రజలను పురిగొల్పారు.


1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై తొలిసారి దాడి చేశారు. 23వ తేదీన క్రిష్ణదేవీపేట పోలీస్ స్టేషన్, 24న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌పై దాడిచేశారు. ఈ మూడు స్టేషన్ల పై దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకొని విప్లవం ప్రారంభించారు. ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాలను చూడలేని రాజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. 1924 మే 7న విశాఖపట్నం జిల్లా మంప గ్రామానికి సమీపాన రాజు స్వయంగా లొంగిపోయారు. సీతారామరాజుపై పగతో రగిలిపోతున్న బ్రిటిష్అధికారులు ఆయన్ని చింతచెట్టుకు కట్టి కాల్చిచంపారు.సీతారామరాజు ఆశించి కలలుగన్న స్వాతంత్య్రం ఆయన ఆత్మత్యాగం చేసిన 28 సంవత్సరాలకు ఆగస్టు 15, 1947న భారత ప్రజలకు లభించింది... ఇలాంటి మహనీయులను మరోసారి స్మరిద్దాం..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మిల్క్ బ్యూటీ దారి ఎటు..?

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఈటల విషయంలో మరింత వ్యూహాత్మకముగా అడుగులేస్తున్న కేసీఆర్ ?

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>