MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/athreya-athreya-satha-jayanthi-athreya-birth-anniversary-thodi-kodallu-sri-sri30bdfb53-9066-4c79-98f0-db8b2373d765-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/athreya-athreya-satha-jayanthi-athreya-birth-anniversary-thodi-kodallu-sri-sri30bdfb53-9066-4c79-98f0-db8b2373d765-415x250-IndiaHerald.jpgకొన్ని పాటలను రచయితలు.. అప్పటికప్పుడు సంగీతానికి అనుగుణంగా రాసిస్తుంటారు. కొన్ని పాటలు మాత్రం వారిని నీడలా వెంటాడిన సన్నివేశాలు, సందర్భాలనుంచి పుట్టుకొని వస్తాయి. ఆచార్య ఆత్రేయ రాసిన పాటల్లో "కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి దాన.." అనే పాట ఆయన్ను చాలా కాలం వెంటాడిన సందర్భం నుంచి పుట్టుకొచ్చిందే. ఆత్రేయ పుట్టి పెరిగిన నెల్లూరు జిల్లాలో ఆ పాటకు సంబంధించిన నేపథ్యం ఉంది. ఆ రోజుల్లో నెల్లూరులోని కస్తూర్బా బాలికల పాఠశాలకు వచ్చే ఆడపిల్లల దర్జాను వర్ణిస్తూ ఆత్రేయ ఆ పాటను మనసు మదిలో లిఖించుకున్నారు. ఆathreya, athreya satha jayanthi, athreya birth anniversary, thodi kodallu, sri sri;atreya;ghantasala;manu;nithya new;cinema;nellore;school;gold;car;masterనెల్లూరు అమ్మాయిల దర్జాకు చిహ్నమే.. ఆత్రేయ రాసిన ఆపాట..నెల్లూరు అమ్మాయిల దర్జాకు చిహ్నమే.. ఆత్రేయ రాసిన ఆపాట..athreya, athreya satha jayanthi, athreya birth anniversary, thodi kodallu, sri sri;atreya;ghantasala;manu;nithya new;cinema;nellore;school;gold;car;masterFri, 07 May 2021 12:00:00 GMTకొన్ని పాటలను రచయితలు.. అప్పటికప్పుడు సంగీతానికి అనుగుణంగా రాసిస్తుంటారు. కొన్ని పాటలు మాత్రం వారిని నీడలా వెంటాడిన సన్నివేశాలు, సందర్భాలనుంచి పుట్టుకొని వస్తాయి. ఆచార్య ఆత్రేయ రాసిన పాటల్లో "కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి దాన.." అనే పాట ఆయన్ను చాలా కాలం వెంటాడిన సందర్భం నుంచి పుట్టుకొచ్చిందే. ఆత్రేయ పుట్టి పెరిగిన నెల్లూరు జిల్లాలో ఆ పాటకు సంబంధించిన నేపథ్యం ఉంది. ఆ రోజుల్లో నెల్లూరులోని కస్తూర్బా బాలికల పాఠశాలకు వచ్చే ఆడపిల్లల దర్జాను వర్ణిస్తూ ఆత్రేయ ఆ పాటను మనసు మదిలో లిఖించుకున్నారు. ఆ తర్వాత తోడికోడళ్లు సినిమాకోసం దాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

ఆరోజుల్లో నెల్లూరులో కస్తూర్బా బాలికల పాఠశాల పేరెన్నికగన్నది. బాలికలకోసం ప్రత్యేకంగా స్థాపించిన ఈ పాఠశాలకు ఎక్కువగా శ్రీమంతుల బిడ్డలు వచ్చేవారు. కలిగిన కుటుంబాలనుంచి వచ్చే ఆడపిల్లలు జట్కాల మీద, కార్లలో స్కూల్ కి వచ్చేవారట. ఆరోజుల్లోనే కార్లలో అమ్మాయిలు స్కూల్ కి వచ్చి వెళ్లడం విశేషంగా చెప్పుకునేవారు. ఆత్రేయ నెల్లూరు నగరంలో ఓ పత్రికలో ఉప సంపాదకుడిగా పనిచేసే రోజుల్లో ఆయన నిత్యం ఈ వ్యవహారాన్ని గమనిస్తుండేవారు. నాటకాలు రాస్తూ, నాటకాలు వేస్తూ, పత్రికకోసం పనిచేస్తూ.. పొట్ట పోషించుకునే ఆత్రేయ తన అవస్థ గుర్తు చేసుకుంటూ.. ఆ అమ్మాయిల దర్జాతో పోల్చుకుంటూ నవ్వుకునేవారట. అలా ఆ పాట పుట్టిందని అంటారు.

వాస్తవానికి ఈ పాటను సంసారం అనే సినిమాలో పెట్టాలనుకున్నారు. అయితే అది ఎందుకో సాధ్యం కాలేదు. ఆ తర్వాత వచ్చిన తోడికోడళ్లు సినిమాలో ఈ పాటను పెట్టారు. 1957లో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ పాట విన్న చాలామంది దాన్ని శ్రీశ్రీ సాహిత్యంగా పొరపడ్డారట. అప్పట్లో విప్లవ భావాలతో శ్రీశ్రీ పాటలు ఉండేవి. పేదల కష్టాలు, పెద్దల సుఖాలు.. ఈ పాటలో ప్రతిబింబిస్తాయి. దీంతో శ్రీశ్రీ భావుకతగా దీన్ని చాలామంది పొరబడ్డారు. మనసు కష్టాలని వర్ణించే ఆత్రేయ, ఆ పాటలో మనిషి కష్టాలను, మనుషుల మధ్య తారతమ్యాలను చక్కగా వివరించారు. ఈ గీతాన్ని ఘంటసాల గానం చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు. అలా నెల్లూరు అమ్మాయిల దర్జాకు చిహ్నంగా ఆ పాట పుట్టుకొచ్చింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>