PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/covid-vaccine-vaccination-vaccine-third-dose873db142-90eb-4f4b-8025-0696a3300d3b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/covid-vaccine-vaccination-vaccine-third-dose873db142-90eb-4f4b-8025-0696a3300d3b-415x250-IndiaHerald.jpgభారత్ లాంటి దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత నెమ్మదిగా సాగుతుందో అందరికీ తెలిసిందే. ఓ దశలో ఇతర దేశాలకు సైతం భారత్ వ్యాక్సిన్ ని ఉదారంగా ఇచ్చింది. ఇప్పుడు దేశ ప్రజలకు సకాలంలో సరఫరా చేయలేక కేంద్రం చేతులెత్తేస్తోంది. 18 సంవత్సరాల పైబడినవారికి మే 1 నుంచి వ్యాక్సిన్ ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయం అమలులోకి వచ్చే సరికి చతికిలపడింది. కొన్ని రాష్ట్రాల్లో నామమాత్రంగా తొలిరోజు టీకా వేసి సరిపెట్టారు. 45 ఏళ్లు పైబడినవారికి తొలి ప్రయారిటీ ఇస్తామని ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దశలో భారత్ covid vaccine, vaccination, vaccine third dose;amala akkineni;christmas;india;andhra pradesh;telangana;school;population;central governmentఆ దేశంలో వ్యాక్సిన్ మూడో డోసు కూడా రెడీ..ఆ దేశంలో వ్యాక్సిన్ మూడో డోసు కూడా రెడీ..covid vaccine, vaccination, vaccine third dose;amala akkineni;christmas;india;andhra pradesh;telangana;school;population;central governmentFri, 07 May 2021 08:00:00 GMTభారత్ లాంటి దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత నెమ్మదిగా సాగుతుందో అందరికీ తెలిసిందే. ఓ దశలో ఇతర దేశాలకు సైతం భారత్ వ్యాక్సిన్ ని ఉదారంగా ఇచ్చింది. ఇప్పుడు దేశ ప్రజలకు సకాలంలో సరఫరా చేయలేక కేంద్రం చేతులెత్తేస్తోంది. 18 సంవత్సరాల పైబడినవారికి మే 1 నుంచి వ్యాక్సిన్ ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయం అమలులోకి వచ్చే సరికి చతికిలపడింది. కొన్ని రాష్ట్రాల్లో నామమాత్రంగా తొలిరోజు టీకా వేసి సరిపెట్టారు. 45 ఏళ్లు పైబడినవారికి తొలి ప్రయారిటీ ఇస్తామని ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దశలో భారత్ లో వ్యాక్సినేషన్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.

అయితే ప్రపంచ దేశాలు, మరీ ముఖ్యంగా బ్రిటన్ వంటి దేశాలు వ్యాక్సినేషన్ విషయంలో చాలా ముందు చూపుతో ఉన్నాయి. 6.7 కోట్ల జనాభా కలిగిన బ్రిటన్ లో ఇప్పటికే మూడున్నర కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. స్కూల్ పిల్లలకి కూడా అక్కడ త్వరలో వ్యాక్సిన్ వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే క్రిస్మస్ నాటికల్లా దేశవ్యాప్తంగా మూడో డోసు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది బ్రిటన్ ప్రభుత్వం.

బ్రిటన్ లో ప్రస్తుతం మూడు రకాల టీకాలను వినియోగిస్తున్నారు. వీటితోపాటు మరో ఐదు కంపెనీలతో కూడా ఆ దేశ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముందు చూపుతో టీకాలను పెద్ద సంఖ్యలో ఆర్డర్ ఇచ్చింది. మొత్తం ఎనిమిది సంస్థల నుంచి 51కోట్ల డోసులను సమకూర్చుకునేందుకు బ్రిటన్‌ ఈపాటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒక్క ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ నుంచే 6కోట్ల డోసులను ఆర్డర్‌ చేసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్ విషయంలో బ్రిటన్ బాగా ముందు చూపుతో ఉన్నట్టు తెలుస్తోంది. ఓ దశలో ప్రపంచంలోనే అత్యథిక కేసులు నమోదవుతున్న దేశంగా రికార్డుల కెక్కిన బ్రిటన్, సెకండ్ వేవ్ నియంత్రణలో విజయం సాధించింది. అందరికీ టీకాలు అందించి, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే దిశగా అడుగులు వేస్తోంది.

కొవిడ్ వైరస్ కొత్త వేరియంట్లను కూడా సమర్థంగా ఎదుర్కునేందుకు బ్రిటన్ కి టీకా సరఫరా చేస్తున్న కంపెనీలు ప్రయోగాలు మొదలు పెట్టాయి. కొత్త వేరియంట్లకోసం అభివృద్ధి చేసిన టీకా అందుబాటులోకి వస్తే.. మూడో డోసుగా దాన్ని వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ సరికొత్త టీకా అందుబాటులోకి రాకపోతే.. ఇప్పటి వరకూ రెండు డోసుల్లో ఇచ్చిన టీకానే మూడో డోసు కూడా ఇచ్చేందుకు నిర్ణయించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపి కోవిడ్ వాట్సాప్ : 8297 104 104

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో అసలేం జరుగుతోంది ?

భార‌త వీధుల్లో శవాల గుట్ట‌లు..?

మెగాస్టార్ ఎప్పటికీ పోషించని పాత్ర అదే.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>