PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bombay-fevercfb46e5f-ffd5-4d9a-9723-aebd76fc2fc6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bombay-fevercfb46e5f-ffd5-4d9a-9723-aebd76fc2fc6-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా ఇప్పటి వరకూ ఇండియాలో రెండున్నర లక్షల మంది చనిపోయారు. అయితే.. ఇలాంటి విపత్తులు గతంలోనూ వచ్చాయి. గతంలోనూ లక్షల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయారు. ఆ వివరాలు చూద్దామా.. 1905లో భూకంపం విరుచుకుపడడంతో 20,000 మంది చనిపోయారు. 1907లో అంటువ్యాధులు దండెత్తాయి. దేశ వ్యాప్తంగా 13,00,000 చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా సంక్రమించిన స్పానిష్ ఫ్లూలో భాగంగా 1918-1920 మధ్య కాలంలో భారతదేశంలో ప్రాణాంతకమైన ఫ్లూ మహమ్మారి ప్రబలి అసాధారణ రీతిలో ప్రజలను బలిగొంది. ఈ మహమ్మారి కారణంగా దేశ జనాభాలో సుమారు 5 శాతం మంbombay-fever;chiranjeevi;mumbai;india;west bengal - kolkata;research and analysis wingకరోనాను మించిన కరోడా రోగాలివే.. ఎంతమంది చనిపోయారో తెలుసా?కరోనాను మించిన కరోడా రోగాలివే.. ఎంతమంది చనిపోయారో తెలుసా?bombay-fever;chiranjeevi;mumbai;india;west bengal - kolkata;research and analysis wingThu, 06 May 2021 06:08:43 GMTకరోనా కారణంగా ఇప్పటి వరకూ ఇండియాలో రెండున్నర లక్షల మంది చనిపోయారు. అయితే.. ఇలాంటి విపత్తులు గతంలోనూ వచ్చాయి. గతంలోనూ లక్షల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయారు. ఆ వివరాలు చూద్దామా.. 1905లో భూకంపం విరుచుకుపడడంతో 20,000 మంది చనిపోయారు. 1907లో అంటువ్యాధులు దండెత్తాయి. దేశ వ్యాప్తంగా 13,00,000 చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా సంక్రమించిన  స్పానిష్  ఫ్లూలో భాగంగా 1918-1920 మధ్య కాలంలో భారతదేశంలో  ప్రాణాంతకమైన ఫ్లూ మహమ్మారి ప్రబలి అసాధారణ రీతిలో ప్రజలను బలిగొంది. ఈ మహమ్మారి కారణంగా దేశ జనాభాలో సుమారు 5 శాతం మంది తుడిచిపెట్టుకుపోయారు. భారతదేశంలో ఈ అంటువ్యాధిని బాంబే ఇన్‌ఫ్లూయెంజా లేదా బొంబాయి ఫీవర్‌గా పిలిచేవారు. ఈ మహమ్మారి భారతదేశంలో సుమారు 1.4 నుంచి 1.7 కోట్ల వరకు ప్రాణాలను పొట్టనపెట్టుకొన్నదని అంచనా.  ప్రపంచంలోని మరే దేశంలోనూ ఇంత భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోలేదని భావిస్తారు.

1924లో అంటువ్యాధుల కారణంగా 3,00,000 మంది జనం రాలిపోయారు. 1926 మరోసారి అంటువ్యాధులు దండెత్తడంతో  4,23,000 మంది చనిపోయారు. 1935లో తుపాను ముంచుకొచ్చి 60,000 మంది చనిపోయారు. అదే సంవత్సరం వచ్చిన భూకంపానికి 56,000 మంది మృతిచెందారు. 1942-43లో తుపానుకు 40,000 మంది బలయ్యారు. ఇదే సంవత్సరం దారుణమైన కరవు కారణంగా 15,00,000 మంది రాలిపోయారు. అప్పటి మూడేళ్లుగా ప్రపంచ యుద్ధం జరుగుతుండడంతో బ్రిటిష్ సర్కారు కరవు మీద కనీసం దృష్టి పెట్టలేదు. ఎవరిచావుకు వాళ్లను వదిలేసింది. ఊరూరా జమిందార్లు, మోతుబరుల వంటివారే అంబలి కేంద్రాలు ఏర్పాటుచేసేవారు. డొక్కల కరవు అనేవారు దీనిని.

ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతున్న కాలంలో బెంగాల్ ప్రావిన్స్‌లో  వాటిల్లిన తీవ్రమైన కరవు లక్షలమందిని బలి తీసుకుంది. ఆకలి చావులు, పోషకాల లోపం, చుట్టుముట్టిన రోగాల వల్ల 6 కోట్ల బెంగాల్ జనాభాలో, దాదాపుగా 30 లక్షల మంది మరణించారు. వారిలో దాదాపు సగం మంది ఆహారం లభించక వచ్చిన జబ్బుల వల్ల మరణించారు. కరవు కాలంలో ప్రజలు తమవద్ద ఉన్న కాసిని పైసల్ని కూడా ఆహార ధాన్యాలకే ఖర్చుచేయడంతో, చేతివృత్తులు, చిరువ్యాపారాల వారికి ఉపాధి లేకుండాపోయింది. దాంతో వారు పూర్తిగా కరువు పాలబడ్డారు. కరువు సామాజిక, ఆర్థిక విధ్వంసానికి కూడా కారణమైంది, లక్షలాది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ మీడియా లేకపోతే చంద్రబాబు ఏమైపోయేవాడో ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీని వాయించేస్తున్న ప్రాంతీయపార్టీలు

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>