MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vaishnav-tej8ee1b84e-0374-4bc3-b4ef-299ee332bc4d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vaishnav-tej8ee1b84e-0374-4bc3-b4ef-299ee332bc4d-415x250-IndiaHerald.jpgవైష్ణవ్ తేజ్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తన తొలి సినిమాతోనే చిత్ర సీమలో సంచలనాలు సృష్టించాడు. పేరుకి మెగా బ్యాక్ గ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చినా తన సొంత ప్రతిభతోనే ఇంతటి ఆదరణ పొందాడు. తన తొలి సినిమా ఉప్పెన‌తో ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించారు. ఉప్పెన తన తొలి సినిమా అయినప్పటికీ వైష్ణవ్..vaishnav tej;rakul preet singh;sethu;vijay;vijay sethupathi;cinema;husband;joseph vijay;vaishnav tej;reddyవైష్ణవ్ సెకండ్ మూవీ రిలీజ్.. ఎక్కడంటే..?వైష్ణవ్ సెకండ్ మూవీ రిలీజ్.. ఎక్కడంటే..?vaishnav tej;rakul preet singh;sethu;vijay;vijay sethupathi;cinema;husband;joseph vijay;vaishnav tej;reddyThu, 06 May 2021 19:04:53 GMTవైష్ణవ్ తేజ్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తన తొలి సినిమాతోనే చిత్ర సీమలో సంచలనాలు సృష్టించాడు. పేరుకి మెగా బ్యాక్ గ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చినా తన సొంత ప్రతిభతోనే ఇంతటి ఆదరణ పొందాడు. తన తొలి సినిమా ఉప్పెన‌తో ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించారు. ఉప్పెన తన తొలి సినిమా అయినప్పటికీ వైష్ణవ్ తన సహజమైన నటనతో అందరినీ కట్టిపడేశాడు. ప్రస్తుతం వైష్ణవ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. తన తొలి సినిమా విడుదల కాకముందే తన రెండో సినిమాను కూడా ప్రారంభించాడు. వైష్ణవ్ తన రెండో సినిమాను క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కించాడు.

ఈ చిత్రం విడుదలకు కోసం తెలుగు సినీ ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదు. ప్రస్తుతానికి ‘కొండపొలం’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం వేచి చూస్తున్న ప్రేక్షకులకు ఓ తీపికబురు అందిందనే చెప్పాలి. ఈ సినిమా రిలీజ్‌ గురించి ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో ఓ పుకారు షికార్లు చేస్తోంది. సినిమా విడుదల విషయంలో చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చిందట..

అయితే ఈ సినిమాను కాస్త ఆలస్యం అయినా థియేటర్ల‌లోనే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావించారు. కానీ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా అన్ని సినిమాలు వాయిదా పడుతున్నాయి. మళ్లీ లాక్‌డౌన్ వచ్చే ఛాయలు కనిపిస్తుండటంతో దర్శకనిర్మాతలు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినమాలో వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ పుస్తకం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఒక విడుదలే తరువాయి అన్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో చిత్ర యూనిట్ సినిమా విడుదల విషయంలో ఆలోచనల్లో పడింది. మరి ఈ సినిమా రిలీజ్ ఎందులో అవుతుంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కష్టకాలంలో ఆదర్శంగా మారుతున్న ఈ యువకులు...

మెగాస్టార్ ఎప్పటికీ పోషించని పాత్ర అదే.... ?

కరెంట్ టాపిక్స్ ఓకే... కంటెంట్ కూడా కావాలి బాబూ... ?

ఎన్టీయార్ నే డైరెక్ట్ చేసిన బాలయ్య ... ?

కరోనా రోగుల ఆహారపు నియమాలు.. !

కరోనా కాటుకు మరో క్రికెటర్ బలి..!!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>