CookingSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/india-herald-special-curry7eaddd29-5f71-4a84-a820-2d17799bdb8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/india-herald-special-curry7eaddd29-5f71-4a84-a820-2d17799bdb8b-415x250-IndiaHerald.jpgక్యారెట్ కూర అనగానే చాల మంది ఇష్టపడరు. ఎందుకంటే క్యారెట్ కూర తినడానికి కొంచెం తియ్యగా ఉండడం వలన చాలామంది ఈ కూరని తినడానికి ఇష్టపడరు. అయితే నిజానికి క్యారెట్ లో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. కనీసం వారానికి రెండు సార్లు అయినాగానీ క్యారెట్ తింటే అనారోగ్యాలు మన దరి చేరవు. ఒకసారి మేము చెప్పిన విధంగా కనుక మీరు క్యారెట్ పల్లీల ఫ్రై వండితే వద్దు అన్నా మీరే మళ్ళీ మళ్ళీ బాగుంది అని అంటారు. ఈ రెసిపీ చేయడానికి కూడా చాలా తక్కువ సమయం పడుతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు.మరి క్యారెట్ పల్లి ఫ్india herald -special curry;oil;cumin;aqua;gas stove;neem;coriander.;ishtamక్యారెట్ అండ్ పల్లీల ఫ్రై.. !క్యారెట్ అండ్ పల్లీల ఫ్రై.. !india herald -special curry;oil;cumin;aqua;gas stove;neem;coriander.;ishtamThu, 06 May 2021 12:00:00 GMT
కావాల్సిన పదార్ధాలు

1/2 kilo క్యారెట్ ముక్కలు

250 ml నీళ్ళు

పొడి కోసం

1/4 cup వేరు సెనగపప్పు

1/4 cup నువ్వులు

1/4 cup ఎండుకొబ్బరి పొడి

1 tbsp ధనియాలు

1 tbsp సెనగపప్పు

1 tsp జీలకర్ర

ఉప్పు

7 - 8 వెల్లూలి

1 tbsp కారం

వేపుడు కోసం

3 tbsp నూనె

1 tsp ఆవాలు

1 రెబ్బ కరివేపాకు

1/2 tsp పసుపు

2 tsps కొత్తిమీర

విధానం

ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక బాండీ పెట్టి అందులో కొంచెం నీళ్లు పోసి ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి మూతపెట్టి క్యారెట్ ముక్కలని పూర్తిగా ఉడికించుకోండి.అవి ఉడికాక ముక్కల్ని నీటి నుంచి సెపరేట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మరొక పాన్లో వేరుసెనగపప్పు, సెనగపప్పు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని వేపుకోండి,చివరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసి ఎర్రగా అయ్యేదాకా ఓ నిమిషం వేపుకుని దిమ్పెసుకుని చల్లార్చుకోండి. ఇవన్నీ చల్లారిన తరువాత వాటిని గ్రైండర్ లో వేసుకుని పొడిగా చేసుకుని తరువాత అందులో వెల్లూలి, కారం, ఉప్పు  వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మరొక పాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేపాలి. తరువాత అందులో ముందుగా ఉడకబెట్టుకున్న  క్యారెట్ ముక్కలు వేసుకోండి.కొంచెం పసుపు, ఉప్పు కూడా వేయాలి. క్యారెట్ ముక్కలు వేసి 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేం మీద వేపుకోండి.క్యారెట్ ముక్కలు ఉడికిన తరువాత ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఒక ½ కప్ పల్లి  పొడి వేసి బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఒక రెండు నిమిషాలు వేగాక  దింపే ముందు కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ గా ఉండే క్యారెట్ పల్లి ఫ్రై రెడీ అయినట్లే. పిల్లలు అయితే ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు సుమా.. !!







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ నంబర్ కు కాల్ చేస్తే భోజనం, మాస్క్ ఫ్రీ.. ఎక్కడంటే?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>