PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender3c659c3f-3726-43ce-ad1e-82ce7a040da6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender3c659c3f-3726-43ce-ad1e-82ce7a040da6-415x250-IndiaHerald.jpgఈట‌ల రాజేంద‌ర్ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. మ‌రోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆయ‌న‌కు ఆహ్వానాలు అందుతున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఈట‌ల త‌న అనుచ‌రులతో మూడు రోజులుగా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లో స‌రియైన నిర్ణ‌యం తీసుకుంటాన‌ని ఈట‌ల తెలిపారు. ప‌నిలో ప‌నిగా కేసీఆర్‌పై మాట‌ల దాడిని కొన‌సాగిస్తున్నారు. అయితే ప్ర‌భుత్వప‌రంగా తీసుకోబోయే నిర్ణ‌యాలు ఈట‌ల‌కు ముందే స‌మాచారం వెళ్తున్న‌ట్లు కేసీఆర్ గుర్తించార‌ట‌etela rajender;view;kcr;bharatiya janata party;congress;local language;dookudu;party;huzurabadకేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటుకేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటుetela rajender;view;kcr;bharatiya janata party;congress;local language;dookudu;party;huzurabadThu, 06 May 2021 08:45:56 GMTసీఎం కేసీఆర్ ఓ అంశంపై దృష్టి పెట్టాడంటే దాని అంతుతేల్చే వ‌ర‌కు వ‌ద‌ల‌డు. ఆ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా కేసీఆర్‌తో 20ఏళ్లు క‌లిసి ప‌నిచేసిన ఈట‌ల రాజేంద‌ర్‌కు మ‌రీ తెలుసు. అయినా ఈట‌ల కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అంటున్నాడు. మేమే పార్టీ ఓన‌ర్లం అంటూ ఇప్ప‌టికే కేసీఆర్ ఆగ్ర‌హానికి గురైన ఈట‌ల‌.. ఇప్పుడు ఢీఅంటే ఢీ అనేలా వ్యాఖ్య‌లు చేస్తుండ‌టం కేసీఆర్‌కు మ‌రింత ఆగ్ర‌హాన్ని తెప్పిస్తుంద‌ట‌. దీంతో ఈట‌ల‌పై ముప్పేటదాడి చేసేందుకు వ్యూహం సిద్ధంచేశార‌ట‌. దీనిలో భాగంగా ఈట‌ల అనుచ‌రులు ఎవ‌రెవ‌రు.. ? వారు రాజ‌కీయ నేత‌లా, అధికారులా? అంటూ ఆరా తీస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈట‌ల‌కు అనుకూలంగా ఉన్న‌వారంద‌రితో కూడిన ఓ లిస్ట్ కేసీఆర్ చేతికి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

ఈట‌ల రాజేంద‌ర్ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. మ‌రోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆయ‌న‌కు ఆహ్వానాలు అందుతున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఈట‌ల త‌న అనుచ‌రులతో మూడు రోజులుగా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లో స‌రియైన నిర్ణ‌యం తీసుకుంటాన‌ని ఈట‌ల తెలిపారు. ప‌నిలో ప‌నిగా కేసీఆర్‌పై మాట‌ల దాడిని కొన‌సాగిస్తున్నారు. అయితే ప్ర‌భుత్వప‌రంగా తీసుకోబోయే నిర్ణ‌యాలు ఈట‌ల‌కు ముందే స‌మాచారం వెళ్తున్న‌ట్లు కేసీఆర్ గుర్తించార‌ట‌. దీంతో ఈట‌ల రాజ‌కీయ అనుచ‌రుల‌తో పాటు, అధికారుల లిస్ట్ ను త‌యారు చేశార‌ట‌. ఈ క్ర‌మంలో హుజురాబాద్ ఏసీపీగా ఉన్న ఎస్‌. శ్రీ‌నివాస్‌రావును డీజీపీకి రిపోర్టు చేయాల‌ని బుధ‌వారం ఆదేశాలు జారీ అయ్యాయి. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈట‌ల మ‌ద్ద‌తుతో వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు పొందిన వారెవ‌రు అనే విష‌యాల‌పై ఆరాతీస్తూ.. వారిపైనా బ‌దిలీవేటు వేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.

రాజ‌కీయ‌ప‌రంగా ఈట‌లకు అనుచరులుగా ముద్ర‌ప‌డి వారిని ఒక్కొక్క‌రిని పార్టీ నుంచి ప‌క్క‌కు త‌ప్పించేందుకు కేసీఆర్ దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌నిని ఓ సీనియ‌ర్ నేతకు అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం. దీంతో స‌ద‌రు సీనియ‌ర్ నేత ఈట‌ల అనుచ‌రులుగా ఉంటూ పార్టీలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న‌వారిని గుర్తించి.. వారిపై ఎలాంటి ఆరోప‌ణ‌లు ఉన్నాయి, గ‌తంలో ఏఏ కేసులు ఉన్నాయి, స్థానికంగా కార్య‌క‌ర్త‌ల బ‌ల‌మెంత అనే విష‌యాల‌పై ఆరాతీస్తున్నార‌ట‌. అవ‌కాశం చిక్కితే ఏదోఒక నెపంతో ప‌క్క‌కు త‌ప్పించేలా స‌ద‌రు సీనియ‌ర్ నేత ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి ఈట‌ల రాజేంద‌ర్ దూకుడుకు అడ్డుక‌ట్ట వేసేందుకు సీఎం కేసీఆర్ ముప్పేట‌దాడి వ్యూహాన్ని తెర‌పైకి తెచ్చిన‌ట్లు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ టీకా జీవితకాలం యాంటీబాడీలు.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్?

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ మీడియా లేకపోతే చంద్రబాబు ఏమైపోయేవాడో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>