MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sunil371efe51-4cd0-4fde-9f92-ef5afe1ab5e2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sunil371efe51-4cd0-4fde-9f92-ef5afe1ab5e2-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో రీమేక్ ట్రెండ్ బాగా పుంజుకుంది. ఇతర భాషలలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా తమిళ, మళయాళ తెలుగు సినిమాలు రీమేక్ బాట పట్టగా ఇప్పుడు మరో తమిళ సినిమాను కూడా రీమేక్ చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.. యోగి బాబు ప్రధాన పాత్రలో వచ్చిన మండేలా అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారని అయితే ఆ రీమేక్ లో బండ్ల గణేష్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఇదే రీమేక్ సినిమాకి సంబంధించి మtollywood;anil music;anil sunkara;bandla ganesh;sunil;yogi;cinema;telugu;tamil;sunkara ramabrahmam;remake;comedy;hero;heroine;ak entertainmentsబండ్ల కాదు.. లైన్ లోకి సునీల్!బండ్ల కాదు.. లైన్ లోకి సునీల్!tollywood;anil music;anil sunkara;bandla ganesh;sunil;yogi;cinema;telugu;tamil;sunkara ramabrahmam;remake;comedy;hero;heroine;ak entertainmentsThu, 06 May 2021 07:11:00 GMTఈ మధ్యకాలంలో రీమేక్ ట్రెండ్ బాగా పుంజుకుంది. ఇతర భాషలలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా తమిళ, మళయాళ తెలుగు సినిమాలు రీమేక్ బాట పట్టగా ఇప్పుడు మరో తమిళ సినిమాను కూడా రీమేక్ చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.. యోగి బాబు ప్రధాన పాత్రలో వచ్చిన మండేలా అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారని అయితే ఆ రీమేక్ లో బండ్ల గణేష్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఇదే రీమేక్ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. 


యోగి బాబు పాత్రలో బండ్ల గణేష్ కాదని సునీల్ నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. నాయిబ్రాహ్మణుల సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా సాగింది. కామెడీతో సాగుతూనే పొలిటికల్ సెటైరిక్ మూవీగా ఉండింది. ఈ మధ్యకాలంలో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన సినిమాల్లో మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలో నటించినందుకు గాను యోగి బాబు నటనకి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.. ఇది ఈ సినిమా హక్కులు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కింద అనిల్ సుంకర కొన్నారు.


 ఆయన సునీల్ అయితే ఈ పాత్రకు సరిగ్గా న్యాయం చేయగలరని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సునీల్ ను సంప్రదించగా సునీల్ తన సమ్మతి కూడా తెలియజేశాడు అని తెలుస్తోంది. ఈ సినిమాను సమర్థవంతంగా తెలుగులో రీమేక్ చేయగల దర్శకుడి కోసం అనిల్ సుంకర వెతుకుతున్నారని ఒకసారి దర్శకుడు ఫైనల్ అయితే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సునీల్ ప్రస్తుతానికి సలోని హీరోయిన్ గా మర్యాద కృష్ణయ్య అనే సినిమా చేస్తున్నాడు. అలాగే హీరో పాత్రలకు పరిమితం కాకుండా మంచి సినిమా అనుకుంటే చిన్న చిన్న పాత్రలో వచ్చినా చేసుకుంటూ వెళుతున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వాట్సాప్ పెళ్లి.. అందరి నోటా ఇదే లొల్లి?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ మీడియా లేకపోతే చంద్రబాబు ఏమైపోయేవాడో ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీని వాయించేస్తున్న ప్రాంతీయపార్టీలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>