Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/namitha-talkiesc0c6e83f-8467-4233-a443-3a953f1c2d3f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/namitha-talkiesc0c6e83f-8467-4233-a443-3a953f1c2d3f-415x250-IndiaHerald.jpgఒకప్పుడు తెలుగు, తమిళ, మళయాళ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్‌‌గా వెలిగిన హీరోయిన్ నమిత. కానీ ఆ తర్వాత బాగా బద్దుగా తయారవడంతో హీరోయిన్ అవకాశాలు తగ్గాయి. సింహ వంటి కొన్ని సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో చాలాకాలంగా సైలెంట్‌గానే ఉంటోంది ఈ బొద్దుగుమ్మ. అయితే ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అది కూడా ఓటీటీలో. అయితే మిగతా హీరోయిన్లలా ఓటీటీ ఫ్లాట్‌ఫాంలలో ..namitha talkies;beauty;balakrishna;namitha;ravi varma;simhaa;cinema;tamil;heroine;softwareస్టైల్ మార్చిన బాలయ్య బ్యూటీ.. ఇండస్ట్రీలో తొలి హీరోయిన్‌గా..స్టైల్ మార్చిన బాలయ్య బ్యూటీ.. ఇండస్ట్రీలో తొలి హీరోయిన్‌గా..namitha talkies;beauty;balakrishna;namitha;ravi varma;simhaa;cinema;tamil;heroine;softwareThu, 06 May 2021 13:37:12 GMTఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు తెలుగు, తమిళ, మళయాళ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్‌‌గా వెలిగిన హీరోయిన్ నమిత. కానీ ఆ తర్వాత బాగా బద్దుగా తయారవడంతో హీరోయిన్ అవకాశాలు తగ్గాయి. సింహ వంటి కొన్ని సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో చాలాకాలంగా సైలెంట్‌గానే ఉంటోంది ఈ బొద్దుగుమ్మ. అయితే ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అది కూడా ఓటీటీలో. అయితే మిగతా హీరోయిన్లలా ఓటీటీ ఫ్లాట్‌ఫాంలలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కాదు. అలా చేస్తే వారికి, తనకు తేడా ఏముంటుందని అనుకుందో ఏమో ఈ అమ్మడు.. ఏకంగా ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫాంనే స్టార్ట్ చేసేసింది.

కరోనా దెబ్బకు గతేడాది థియేటర్లు మూతపడ్డాయి. ఎలాగోలా ఈ ఏడాది తెరిచి రెండు, మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయో లేదో మళ్లీ సెకండ్ వేవ్ పేరుతో మహమ్మారి మరింత దారుణంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రేక్షకులు కూడా థియేటర్లను వదిలిపెట్టి ఓటీటీల బాట పడుతున్నారు. ఇప్పటికే షూటింగులు పూర్తయిన పెద్ద సినిమాలు కూడా ఓటీటీల్లోనే రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక చిన్న సినిమాల పరిస్థితి సరేసరి. వాటికి ఓటీటీనే పెద్ద దిక్కుగా మారింది. దీంతో ఓటీటీ ఫ్లాట్‌ఫాంలకు మంచి డిమాండ్ పెరుగుతోంది.

దీనికి తోడు ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. ఇప్పట్లో థియేటర్లు తెచుకునేలా లేవు. అలాగే సినిమా షూటింగ్స్ నిలిచిపోయి మేకర్స్ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి తరుణంలో ప్రేక్షకులకు సామాన్య జనాలకు వినోదం పంచాలంటే కేవలం ఓటిటిలే దిక్కయ్యాయి. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోడానికి అనక ఓటీటీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కొత్తవి పుట్టకొస్తున్నాయి. అందులో భాగంగానే నమిత కూడా 'నమిత టాకీస్' పేరుతో ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

నమిత మాట్లాడుతూ.. 'మా ఓటీటీ ద్వారా చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు రిలీజ్ చేసుకునే అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది. కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న దర్శకులు, నటులకు మంచి ప్లాట్ ఫామ్‌గా అందించాలనే ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించినట్లు తెలిపింది. కాగా.. ఈ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు నమిత. కానీ త్వరలోనే ఫస్ట్ రిలీజ్ ప్రకటిస్తామని చెప్పింది. అయితే ఈ ఓటీటీని రవివర్మ అనే సాఫ్ట్ వేర్ ఫ్రెండ్ భాగస్వామ్యంతో రన్ చేయనున్నట్లు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే నమిత ఓటీటీని స్టార్ట్ చేయడంతో ఇండస్ట్రీలో ఓటీటీ ఫ్లాట్ ఫాం స్టార్ చేసిన తొలి హీరోయిన్‌గా క్రెడిట్ కొట్టేసింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటలను కేబినెట్‌లోకి తీసుకోవాల్సిందే.. తప్పదట..!!

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!

బాలయ్య నంబర్ వన్ ఎందుకు కాలేకపోయాడు.... ?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>