PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus7a587f74-e3e4-43de-8d6a-f939759a3650-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus7a587f74-e3e4-43de-8d6a-f939759a3650-415x250-IndiaHerald.jpgకోవిడ్-19 యాంటీబాడీ డ్రగ్ అయిన "కాక్‌టైల్" కు భారతదేశంలో అత్యవసర వినియోగ అధికారం లభించింది. అనగా ఎమర్జెన్సీ కేసులలో కాక్‌టైల్ యాంటీబాడీ డ్రగ్ వినియోగించవచ్చు. ఐతే తాము అభివృద్ధి చేసిన యాంటీబాడీ డ్రగ్ "కాక్‌టైల్" యొక్క ఎమర్జెన్సీ వినియోగానికి 'సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్' (CDSCO) ఆమోదం ఇచ్చిందని బుధవారం రోజు దిగ్గజ ఫార్మా కంపెనీ రోచె (ROG.S) ప్రకటించింది. "భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో హెల్త్ కేర్ పై పడుతున్న ఒత్తిడిని తగ్గించడానికి రోచె చేయాల్సcoronavirus;health;india;american samoa;donald trump;director;drugs;v;coronavirusకరోనా చికిత్సకు కొత్త డ్రగ్..!!కరోనా చికిత్సకు కొత్త డ్రగ్..!!coronavirus;health;india;american samoa;donald trump;director;drugs;v;coronavirusThu, 06 May 2021 13:00:00 GMTడ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్' (CDSCO) ఆమోదం ఇచ్చిందని బుధవారం రోజు దిగ్గజ ఫార్మా కంపెనీ రోచె (ROG.S) ప్రకటించింది.


"భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో హెల్త్ కేర్ పై పడుతున్న ఒత్తిడిని తగ్గించడానికి రోచె చేయాల్సిందల్లా చేస్తోంది. మేము అభివృద్ధి చేసిన కాసిరివిమాబ్ (casirivimab), ఇమేడేవిమాబ్ (imdevimab) వంటి యాంటీబాడీ కాక్‌టైల్స్ కోవిడ్ వ్యాధిని నిర్మూలించడం లో కీలక పాత్ర పోషిస్తాయి. తీవ్ర ముప్పు ఉన్న కరోనా రోగులు ఈ డ్రగ్ వాడితే.. వారు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం వ్యాక్సిన్ తో పాటు కాక్‌టైల్ యాంటీబాడీ డ్రగ్స్ తో కరోనా తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చు. దీనివల్ల ఆసుపత్రులకు వెళ్లే రోగుల సంఖ్య కూడా తగ్గుతుంది," అని రోచె ఫార్మా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వి. సింప్సన్ ఇమ్మాన్యుయేల్ చెప్పారు.



ఐతే ఈ డ్రగ్ అత్యవసర వినియోగానికి సంబంధించి అమెరికా పొందుపరిచిన డేటా సమీక్షించిన తరువాతనే ఇండియాలో ఎమర్జెన్సీ యూస్ గా వినియోగించుకోవచ్చని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదించింది. కొత్త మెడికల్ ప్రొడక్ట్స్ మానవులకు ఉపయోగించవచ్చా లేదా అనే విషయానికి తేల్చే యూరోపియన్ యూనియన్‌లోని ఒక కమిటీ అభిప్రాయం కూడా సేకరించారు.



కోవిడ్-19 యాంటీబాడీ డ్రగ్ "కాక్‌టైల్" అనేవి లాబరేటరీలో తయారుచేసిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని.. ఇవి శరీరంలోకి వెళ్లి తెల్లరక్తకణాల వలె పనిచేస్తూ వైరస్ ని అంతమోదిస్తాయి. (casirivimab), (imdevimab) వంటి యాంటీబాడీస్ కరోనా వైరస్ ని నిర్మూలించడానికి ప్రత్యేకంగా తయారు చేశామని ఫార్మా కంపెనీ చెబుతోంది. శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశించినప్పుడు.. అది కణాలతో అటాచ్ కాకుండా ఉండేలా ఈ యాంటీ బాడీస్ నిర్మూలిస్తాయి.



మానవుల శరీర కణాలలోకి కరోనా వైరస్ చోచ్చుకుపోకపోతే.. తీవ్ర అనారోగ్యం పాలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులు కూడా ఈ యాంటీ బాడీస్ తీసుకోవచ్చు. ఫలితంగా శరీరంలో కొత్త వైరసులు పుట్టవు. అలాగే పాత వైరస్ లు నాశనం అవుతాయి. చాలా రోజుల క్రితమే ఈ డ్రగ్స్ కి అమెరికా దేశంలో అత్యవసరం అధికారం లభించింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే డ్రగ్ తీసుకొని కరోనాను జయించారు. రెమ్‌డెసివిర్, కరోనా టీకాల కొరత ఏర్పడిన ఈ నేపథ్యంలో కొత్త డ్రగ్ వినియోగం లోకి రావడంతో కాస్త ఊరట లభించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అది మన రౌడీ హీరో అంటే..?

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!

బాలయ్య నంబర్ వన్ ఎందుకు కాలేకపోయాడు.... ?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>