MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna9d6cb455-7553-4e22-bfc0-d4b0f1be46fd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna9d6cb455-7553-4e22-bfc0-d4b0f1be46fd-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ఈ పేరు తెలియని వారుండరు. బాలయ్య ఫైట్స్, డైలాగ్‌లకు అభిమానులు కాదు భక్తులున్నారనడంలో అతిశయోక్తి ఏమీలేదు. తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బిగ్ స్క్రీన్‌పై బాలయ్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే బాలయ్య సినిమా రిలీజ్ అంటే థియేటర్ల దగ్గర అభిమానులు హోరెత్తుతారు. ఎలాగైన బాలయ్య సినిమాను ఫస్ట్‌ డే ఫస్ట్ షో చూడాలని తాపత్రయ..balakrishna;ravi;balakrishna;boyapati srinu;ravi teja;tara;cinema;nandamuri balakrishna;director;nandamuri taraka rama rao;raccha;chitramబాలయ్య కూడా వెనక్కితగ్గుతాడా..?బాలయ్య కూడా వెనక్కితగ్గుతాడా..?balakrishna;ravi;balakrishna;boyapati srinu;ravi teja;tara;cinema;nandamuri balakrishna;director;nandamuri taraka rama rao;raccha;chitramThu, 06 May 2021 10:30:00 GMTనందమూరి బాలకృష్ణ ఈ పేరు తెలియని వారుండరు. బాలయ్య ఫైట్స్, డైలాగ్‌లకు అభిమానులు కాదు భక్తులున్నారనడంలో అతిశయోక్తి ఏమీలేదు. తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బిగ్ స్క్రీన్‌పై బాలయ్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే బాలయ్య సినిమా రిలీజ్ అంటే థియేటర్ల దగ్గర అభిమానులు హోరెత్తుతారు. ఎలాగైన బాలయ్య సినిమాను ఫస్ట్‌ డే ఫస్ట్ షో చూడాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్నారు.

సినిమా ప్రారంభం నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడన్న వార్త ప్రేక్షుల్లో ఆసక్తిని మరింత అధికం చేసింది. ఇక బాలయ్య చేయనున్న రెండు పాత్రల్లో ఒకటి అఘోరా అని తెలియడంతో అభిమానులకు పూనకాలు వచ్చినంత పనైంది. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురుచూడసాగారు. అదే సమయంలో  ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.  ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని సినిమాలు చిత్రీకరణను నిలిపివేశాయి. అంతేకాకుండా సినిమా విడుదల చేయడం కూడా అంత మంచిది కాదని భావించిన దర్శకనిర్మాతలు తమ సినిమాలను వాయిదా వేశారు. ఇటీవల రవితేజ కూడా తన సినిమా ఖిలాడి విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈ విషయంలో బాలయ్య తన అఖండ సినిమా విడుదల గురించి ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. మరి బాలయ్య మనసులో ఏముందో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.

ఇదిలా ఉంటే అఖండ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తోనే సినిమా దాదాపు పూర్తవుతుందని టాక్. అంతేకాకుండా అఖండ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే బాలయ్య తన తదుపరి చిత్రంలో బిజీ కానున్నాడని టాక్.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటలను కేబినెట్‌లోకి తీసుకోవాల్సిందే.. తప్పదట..!!

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!

బాలయ్య నంబర్ వన్ ఎందుకు కాలేకపోయాడు.... ?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>