MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thiyetors-smasaana-vaatikalu-dca00cb3-b39d-40d2-b0f3-724a80c2d797-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thiyetors-smasaana-vaatikalu-dca00cb3-b39d-40d2-b0f3-724a80c2d797-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ప్రజలందరినీ ముప్పతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి మొన్నటివరకు ఇతర దేశాల్లో విలయ తాండవం చేయగా, ఇప్పుడు ఇండియా ను మరింతగా దెబ్బ కొడుతోంది. రోజురోజుకు మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒకవైపు పాజిటివ్ కేసులు లక్షల్లో తేలగా, మరోవైపు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి ఇండియాలో రోజురోజుకు మరణాల సంఖ్య ఎక్కువవుతోంది.. ఇంతలా రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతుందని ఎవరూ ఊహించలేదు.. గత వారం నుంచి మూడు వేలకు పైగా కరోనా మరణాలు నమోదవడంతో అంTHIYETORS SMASAANA VAATIKALU;india;cinema;cinema theater;bengaluru 1అప్పట్లో థియేటర్లు.. ఇప్పట్లో స్మశానాలు..అప్పట్లో థియేటర్లు.. ఇప్పట్లో స్మశానాలు..THIYETORS SMASAANA VAATIKALU;india;cinema;cinema theater;bengaluru 1Thu, 06 May 2021 12:00:00 GMT
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ప్రజలందరినీ ముప్పతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి మొన్నటివరకు ఇతర దేశాల్లో విలయ తాండవం చేయగా, ఇప్పుడు ఇండియా ను మరింతగా దెబ్బ కొడుతోంది. రోజురోజుకు మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒకవైపు పాజిటివ్ కేసులు లక్షల్లో తేలగా, మరోవైపు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి ఇండియాలో రోజురోజుకు మరణాల సంఖ్య ఎక్కువవుతోంది.. ఇంతలా రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతుందని ఎవరూ ఊహించలేదు.. గత వారం నుంచి మూడు వేలకు పైగా కరోనా మరణాలు నమోదవడంతో అందరిలోనూ భయం మరింతగా పెరిగిపోతోంది.


ఇక మరీ ముఖ్యంగా కొన్ని గ్రామాలలో అంత్యక్రియలకు ఇబ్బందిగా మారడంతో, ఒకేసారి క్రేన్స్ తో గుంతలు తవ్వి మరీ కుప్పలు కుప్పలుగా శవాలను పూడ్చి పెడుతున్నారు. చరిత్రలో మునుపెన్నడూ జరగని విధంగా, ఎవరూ చూడని రీతిలో స్మశాన వాటికలకు డెడ్ బాడీ లు కూడా క్యూ కట్టడం అందరిని కలచివేస్తోంది. ఇక ఇప్పటి వరకు కేవలం సినిమా  థియేటర్ లకు మాత్రమే హౌస్ఫుల్ బోర్డ్ లను చూసాము.. కానీ ఇప్పుడు ఏకంగా స్మశాన వాటికల్లో కూడా హౌస్ఫుల్ బోర్డులు తగిలిస్తున్నట్లు సమాచారం..


ఇక అంతే కాకుండా ఇటీవల బెంగళూరులోని ఒక స్మశానవాటిక గేటు కు కూడా హౌస్ఫుల్ బోర్డ్ లు తగిలించడం చూస్తుంటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది . ఇక రోజు రోజుకు ఎక్కువ సంఖ్యలో కోవిడ్ మరణాలు సంభవించడం తో ఈ కోవిడ్ కారణంగా చనిపోయిన అనాధ శవాలు, స్మశాన వాటికకు వస్తున్నట్లు కాటికాపర్లు చెబుతున్నారు. ఇప్పుడు అనాధ శవాలు ఎక్కువ సంఖ్యలో ఎందుకు వస్తున్నాయంటే, చాలామంది కరోనాకు భయపడి, మృతదేహాల   బంధువులు సైతం చనిపోయిన వారిని ముట్టుకోవడానికి కూడా సాహసం చేయడం లేదు. ఇక అందుకే చాలా మంది అనాధ శవాలుగా మారిపోతున్నారు.


ఇక రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అలాగే మృతదేహాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇక దీనితో శవాలను పూడ్చడానికి స్థలం కూడా లేకపోవడంతో, అక్కడ కూడా హౌస్ఫుల్ బోర్డు లను పెడుతున్నారు. ఇది చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోయే సంఘటనగా మారిపోతుందని అందరూ వాపోతున్నారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ నంబర్ కు కాల్ చేస్తే భోజనం, మాస్క్ ఫ్రీ.. ఎక్కడంటే?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>