EditorialThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu-and-jagana281ec0c-350c-4d41-a64b-45d7c02de2a8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu-and-jagana281ec0c-350c-4d41-a64b-45d7c02de2a8-415x250-IndiaHerald.jpgఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌స్తుతానికి బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు. ఆయ‌న‌ దేశ‌వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో పెద్ద‌గా స‌త్సంబంధాలు క‌లిగిఉన్న‌ట్లుకూడా లేదు. అయితే అధికారంలో ఉండ‌టం, దేశంలో అత్య‌ధిక పార్ల‌మెంట్ స్థానాలు క‌లిగిఉన్న పార్టీల్లో ఒక‌టిగా వైసీపీ ఉండ‌టంతో ప్రాంతీయ పార్టీల కూట‌మి అనేది తెర‌పైకి వ‌స్తే వైసీపీ కూడా కీల‌కం కానుంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్‌పై ఉన్న కేసులు, రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయింపులు త‌దిత‌ర అంశాల‌ను బేరీజు వేసుకొని జ‌గ‌న్ బీజేపీని కాద‌నే ప‌రిస్థితి లేదు. ప్ర‌chandrababu and jagan;tiru;bharatiya janata party;andhra pradesh;west bengal - kolkata;narendra modi;tdp;ycp;partyబీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?chandrababu and jagan;tiru;bharatiya janata party;andhra pradesh;west bengal - kolkata;narendra modi;tdp;ycp;partyThu, 06 May 2021 07:26:08 GMTదేశంలో మోదీ, అమిత్‌షా ద్వ‌యానికి తిరుగులేకుండా పోతుంది. ప్రాంతీయ పార్టీల‌ను క‌ట్ట‌డి చేస్తూ అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ నేత‌లు ప‌నిచేస్తున్నారు. ఇప్ప‌టికే ఒక్కో రాష్ట్రాన్ని త‌మ ఖాతాలోకి వేసుకుంటూ వ‌స్తున్న బీజేపీకి ప‌శ్చిమ బెంగాల్ రూపంలో గ‌ట్టి ఎదురు దెబ్బ‌త‌గిలింది. గ‌తంలో కంటే బీజేపీ ఆ రాష్ట్రంలో బ‌లోపేతం అయిన‌ప్ప‌టికీ అధికారాన్ని చేజిక్కించుకోలేక పోయింది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లుసైతం బెంగాల్ దంగ‌ల్ వైపు దృష్టిసారించ‌డం, బీజేపీ ఓట‌మి పాలుకావ‌డంతో ఆ పార్టీ ప‌త‌నం ప్రారంభ‌మ‌వుతుందా అనేచ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది.

బెంగాల్లో మ‌మ‌తా బెన‌ర్జీ, త‌మిళ‌నాడులో స్టాలిన్‌, కేర‌ళ‌లో విజ‌య‌న్ విజ‌యం సాధించ‌డంతో ప్రాంతీయ పార్టీల ఐక్య‌త మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. గ‌తంలో జ్యోతిబ‌సు, చంద్ర‌బాబు లాంటివారు అన్ని ప్రాంతీయ పార్టీలను ఏక‌తాటిపైకి తెచ్చి తృతీయ కూట‌మికోసం ప్ర‌య‌త్నాలు సాగించారు. ప్ర‌స్తుతం ప్రాంతీయ పార్టీల‌కూట‌మి తెర‌పైకి వ‌స్తుంది. అయితే దీనికి నాయ‌క‌త్వం ఎవ‌రు వ‌హిస్తారు..? మ‌మ‌త బెన‌ర్జీ ఏమేర‌కు ముందుకొచ్చి ప్రాంతీయ పార్టీల‌ను ఏకం చేస్తుంది అనేఅంశం ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌వేళ ప్రాంతీయ పార్టీల కూట‌మి అనేది తెర‌పైకి వ‌స్తే ఏపీలో అధికారంలో ఉన్నవైసీపీ, ప్ర‌తిప‌క్షంలో ఉన్న టీడీపీల స్టాండ్ ఏమిట‌న్న ప్ర‌శ్న త‌లెత్తుతుంది.

ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌స్తుతానికి బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు. ఆయ‌న‌ దేశ‌వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో పెద్ద‌గా స‌త్సంబంధాలు క‌లిగిఉన్న‌ట్లుకూడా లేదు. అయితే అధికారంలో ఉండ‌టం, దేశంలో అత్య‌ధిక పార్ల‌మెంట్ స్థానాలు క‌లిగిఉన్న పార్టీల్లో ఒక‌టిగా వైసీపీ ఉండ‌టంతో ప్రాంతీయ పార్టీల కూట‌మి అనేది తెర‌పైకి వ‌స్తే వైసీపీ కూడా కీల‌కం కానుంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్‌పై ఉన్న కేసులు, రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయింపులు త‌దిత‌ర అంశాల‌ను బేరీజు వేసుకొని జ‌గ‌న్ బీజేపీని కాద‌నే ప‌రిస్థితి లేదు. ప్ర‌స్తుతం ఉన్న సంఖ్య‌త‌నే కొన‌సాగిస్తూ వెళ్లే అవ‌కాశం ఉంది.

మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీది కూడా అదే ప‌రిస్థితి. ఇప్ప‌టికిప్పుడు బీజేపీని ఢీకొట్టేందుకు ఆ పార్టీ సిద్ధంగా లేదు. గ‌తంలో దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల‌ను ఏక‌తాటిపైకి తెచ్చిన ఘ‌న‌త చంద్ర‌బాబుకు ఉంది. ప్ర‌స్తుత త‌రుణంలో చంద్ర‌బాబు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండ‌టం, బీజేపీతో డిఫ‌రెన్స్ పెంచుకుంటే ఇబ్బంది త‌ప్ప‌ద‌నే భావ‌న క‌లిగి ఉండంతో టీడీపీ ప్రాంతీయ పార్టీల కూట‌మికి జై కొట్టే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే బీజేపీపై ఖ‌య్యానికి కాలుదువ్వి దెబ్బ‌తిన్న టీడీపీ.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బీజేపీకి మ‌రోసారి ఎదురెళ్లే సాహ‌సం చేయ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ఏపీ నుంచి ప్రాంతీయ పార్టీల కూట‌మికి రెండు ప్ర‌ధాన పార్టీలు దూరంగా ఉంటాయ‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. మ‌రోవైపు జ‌న‌సేన ఎలాగూ బీజేపీతోనే ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వాట్సాప్ పెళ్లి.. అందరి నోటా ఇదే లొల్లి?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ మీడియా లేకపోతే చంద్రబాబు ఏమైపోయేవాడో ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీని వాయించేస్తున్న ప్రాంతీయపార్టీలు

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>