EditorialSpydereditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modi32284b3e-0006-48a4-bc5b-45af20d207b8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modi32284b3e-0006-48a4-bc5b-45af20d207b8-415x250-IndiaHerald.jpgమొద‌టి ద‌శ క‌రోనాను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న భార‌త్‌.. రెండో ద‌శ‌లో మాత్రం చావుల‌ను చ‌విచూస్తోంది. క‌రోనా ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మందిని కాటేసి కాటికి పంపింది. అత్య‌ధిక జ‌నాభా క‌లిగి ఉన్న భార‌త్‌.. లాక్డ్‌న్ విధించ‌కుండా క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం అన్న‌ది అసాధ్య‌మ‌ని ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ మీడియా, శాస్త్ర‌వేత్త‌లు, భార‌తీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. అయినా కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం మొండి ప‌ట్టుద‌ల‌కు వెళ్తోంది. వ్యాక్సిన్ పంపిణీని వేగ‌వంతం చేస్తామ‌ని చెబుతోంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా modhi;vijay;india;narendra modi;media;doctor;joseph vijay;central government;butterదేశం ఏ గ‌తికి చేరేనో..?! క‌రోనాపై మోదీ మొండిప‌ట్టుద‌ల ఎందుకు..?దేశం ఏ గ‌తికి చేరేనో..?! క‌రోనాపై మోదీ మొండిప‌ట్టుద‌ల ఎందుకు..?modhi;vijay;india;narendra modi;media;doctor;joseph vijay;central government;butterThu, 06 May 2021 07:30:00 GMTమొద‌టి ద‌శ క‌రోనాను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న భార‌త్‌.. రెండో ద‌శ‌లో మాత్రం చావుల‌ను చ‌విచూస్తోంది. క‌రోనా ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మందిని కాటేసి కాటికి పంపింది. అత్య‌ధిక జ‌నాభా క‌లిగి ఉన్న భార‌త్‌.. లాక్డ్‌న్ విధించ‌కుండా క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం అన్న‌ది అసాధ్య‌మ‌ని ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ మీడియా, శాస్త్ర‌వేత్త‌లు, భార‌తీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. అయినా కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం మొండి ప‌ట్టుద‌ల‌కు వెళ్తోంది. వ్యాక్సిన్ పంపిణీని వేగ‌వంతం చేస్తామ‌ని చెబుతోంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా క‌రోనా వ‌స్తోంది..? ఈ ప‌రిణామాల‌కు స‌మాధానాలు కేంద్రం నుంచి క‌రువ‌వుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణిస్తున్నారు.


వ్యాక్సిన్ పంపిణీ చేయ‌డం ద్వారా క‌రోనా బారిన ప‌డ‌కుండా ర‌క్షించాల‌నే ఉద్దేశంతో ఉన్న కేంద్రాన్ని అంద‌రూ అభినందిస్తారు.. కానీ వ్యాప్తిని అడ్డుకోకుండా ఉన్న చ‌ర్య‌ల‌ను మాత్రం ప్ర‌శంస‌నీయ‌మైన విష‌యం కాదు. లాక్డౌన్ అంశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌కు వ‌దిలేయ‌కుండా దేశం మొత్తం క‌రోనా నియంత్ర‌ణ‌లోకి రావాలంటే మూకుమ్మ‌డిగా లాక్‌డౌన్ విధించాల‌ని కోరుతున్నారు. ప్ర‌ధాన‌మంత్రి మోదీ మొండి ప‌ట్టుద‌ల వీడాల‌ని కోరుతున్నారు. భార‌త్‌లో క‌రోనా గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే వెన్నులో వ‌ణుకు పుడుతోంది. ప్రపంచంలో నమోదైన ప్రతి నాలుగు కొవిడ్‌ మరణాల్లో ఒకటి భారత్‌లోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆసియాలో మొత్తం కేసుల్లో 90శాతం కేవలం భారత్‌లోనే ఉన్నాయని పేర్కొంది.


 ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల్లో భారత్ లోనే 46శాతం ఉన్నాయని , ఇక ప్రపంచ వ్యాప్త మరణాల్లో 25శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి వెల్లడించింది. ఈ మేరకు గడచిన వారం రోజుల నివేదికను వెల్లడించింది.ప్రపంచంతో పాటు భారత్ లో కూడా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని. దేశంలో కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌ తయారు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత వ్యాక్సిన్లు బాగానే పని చేస్తున్నాయని , కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. త్వరలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉందని, మూడో దశ ఎప్పుడు,ఎలా వస్తుందో చెప్పలేమని కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు డాక్టర్ కె విజయ్ రాఘవన్ హెచ్చరించిన విష‌యం తెలిసిందే.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వాట్సాప్ పెళ్లి.. అందరి నోటా ఇదే లొల్లి?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ మీడియా లేకపోతే చంద్రబాబు ఏమైపోయేవాడో ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీని వాయించేస్తున్న ప్రాంతీయపార్టీలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>