PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ys-jagan-cm-jagan-ap-covid-b4c1f290-6640-4df8-8fb5-27a218c408f4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ys-jagan-cm-jagan-ap-covid-b4c1f290-6640-4df8-8fb5-27a218c408f4-415x250-IndiaHerald.jpgఏపీలో పరిస్థితి అంతా బాగానే ఉంది. చంద్రబాబు, లోకేష్ బాబు ఆలోచనలు పిశాచాలకంటే క్రూరాతి క్రూరంగా ఉన్నాయంటూ.. వైసీపీ నేతలు విరుచుకు పడుతున్నారు. వారు చెబుతున్న లెక్కల ప్రకారం ఏపీలో కరోనా నియంత్రణలో ఉన్నదనే నమ్మాలి. అయితే కేంద్రం తాజాగా విడుదల చేసిన గణాంకాలు మాత్రం ఏపీ తాజా దుస్థితికి అద్దం పడుతున్నాయి. మరి వైసీపీ నేతలు దీనికి ఏమని సమాధానం చెబుతారో చూడాలి. కనీసం సీఎం జగన్ ఇప్పటికయినా కొవిడ్ నియంత్రణపై స్థిరమైన, కఠినమైన కార్యాచరణకు సిద్ధం కాకపోతే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తునys jagan, cm jagan, ap covid,;amala akkineni;godavari river;jagan;andhra pradesh;east;east godavari;central government;ycp;lokesh kanagaraj;oxygen;coronavirusప్రతిపక్షాలకు కాదు.. ప్రజలకు జగన్ సమాధానం చెప్పాల్సిందే..ప్రతిపక్షాలకు కాదు.. ప్రజలకు జగన్ సమాధానం చెప్పాల్సిందే..ys jagan, cm jagan, ap covid,;amala akkineni;godavari river;jagan;andhra pradesh;east;east godavari;central government;ycp;lokesh kanagaraj;oxygen;coronavirusThu, 06 May 2021 07:00:00 GMTఏపీలో పరిస్థితి అంతా బాగానే ఉంది. చంద్రబాబు, లోకేష్ బాబు ఆలోచనలు పిశాచాలకంటే క్రూరాతి క్రూరంగా ఉన్నాయంటూ.. వైసీపీ నేతలు విరుచుకు పడుతున్నారు. వారు చెబుతున్న లెక్కల ప్రకారం ఏపీలో కరోనా నియంత్రణలో ఉన్నదనే నమ్మాలి. అయితే కేంద్రం తాజాగా విడుదల చేసిన గణాంకాలు మాత్రం ఏపీ తాజా దుస్థితికి అద్దం పడుతున్నాయి. మరి వైసీపీ నేతలు దీనికి ఏమని సమాధానం చెబుతారో చూడాలి. కనీసం సీఎం జగన్ ఇప్పటికయినా కొవిడ్ నియంత్రణపై స్థిరమైన, కఠినమైన కార్యాచరణకు సిద్ధం కాకపోతే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏపీలో కరోనా ఉధృతి ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పరీక్షలు పెడతామంటూ.. చివరి నిముషంలో వెనక్కి తగ్గింది. అటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ల కొరత వేధిస్తోంది. ఆక్సిజన్ సరఫరా అంతంతమాత్రంగానే ఉందంటూ నివేదికలు చెబుతున్నాయి. ఈ దశలో ఏపీలో కరోనా పరిస్థితిపై కేంద్రం చెప్పిన లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో గత రెండు వారాల వ్యవధిలో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తున్న 30 జిల్లాల్లో ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి ఏడు జిల్లాలు ఉన్నాయని తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పరిస్థితిపై ఆయన సమగ్ర నివేదిక బయటపెట్టారు. దీని ప్రకారం దేశంలో అత్యధిక క్రియాశీల కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్‌ 6వ స్థానంలో నిలిచింది. 20 శాతానికి పైగా పాజిటివిటీ రేటు నమోదైన 16 రాష్ట్రాల్లో ఏపీ స్థానం 13.

తెలంగాణలో రోజువారి కేసుల సంఖ్యలో మరీ ఎక్కువ తేడా కనిపించడంలేదు కానీ, ఏపీలో మాత్రం కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా ఉంటోంది. అత్యథిక కేసులు నమోదవుతున్న జిల్లాలు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 4వ స్థానంలో ఉంది. 9 రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఈ జాబితాలో ఏపీలోని జిల్లాలు చివరి వరుసలో ఉన్నా కూడా.. ఏకంగా 7 జిల్లాలు మన రాష్ట్రంనుంచే ఉండటం గమనార్హం. చిత్తూరు 11వ స్థానంలో ఉండగా, శ్రీకాకుళం 16, తూర్పుగోదావరి 17, గుంటూరు 19, విశాఖపట్నం 27, అనంతపురం 29, కర్నూలు 30వ స్థానంలో ఉన్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితులు మరింత దారుణంగా మారకముందే ఏపీ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టాలి.

ప్రస్తుతం అమలులోకి వచ్చిన పగటి పూట కర్ఫ్యూతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలంటున్నాయి. ప్రజల కదలికలపై నియంత్రణ ఉండటంతో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ మీడియా లేకపోతే చంద్రబాబు ఏమైపోయేవాడో ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీని వాయించేస్తున్న ప్రాంతీయపార్టీలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>