PoliticsSpydereditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr0d40b66a-a513-4347-a4bd-65ae8bed13b2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr0d40b66a-a513-4347-a4bd-65ae8bed13b2-415x250-IndiaHerald.jpgఏపీలో 18గంట‌ల పాటు క‌ర్ఫ్యూ విధిస్తూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలోనే తెలంగాణ‌లోనూ భారీగా కేసులు న‌మోదవుతున్న నేప‌థ్యంలో ఇక్క‌డ కూడా లాక్డౌన్ విధించ‌డం లేదంటే... క‌ర్ఫ్యూ స‌మ‌యాన్ని పెంచాల‌నే డిమాండ్ వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే హైకోర్టు దీనిపై స్ప‌ష్ట‌త ఇవ్వాలంటూ కూడా ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఏ నిర్ణ‌యం తీసుకోవాలో తేల్చుకోలేక రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. అయితే ఏపీలో క‌ర్ష్యూ గంట‌ను పెంచిన‌ట్లుగానే ఇక్క‌డ కూడా అమ‌లుkcr;mandula;andhra pradesh;paruguఏపీలో క‌ర్ఫ్యూ ప‌రిణామాల‌పై సీఎం కేసీఆర్‌ ఆరా..!ఏపీలో క‌ర్ఫ్యూ ప‌రిణామాల‌పై సీఎం కేసీఆర్‌ ఆరా..!kcr;mandula;andhra pradesh;paruguThu, 06 May 2021 07:00:00 GMTఏపీలో 18గంట‌ల పాటు క‌ర్ఫ్యూ విధిస్తూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలోనే తెలంగాణ‌లోనూ భారీగా కేసులు న‌మోదవుతున్న నేప‌థ్యంలో ఇక్క‌డ కూడా లాక్డౌన్ విధించ‌డం లేదంటే... క‌ర్ఫ్యూ స‌మ‌యాన్ని పెంచాల‌నే డిమాండ్ వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే హైకోర్టు దీనిపై స్ప‌ష్ట‌త ఇవ్వాలంటూ కూడా ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఏ నిర్ణ‌యం తీసుకోవాలో తేల్చుకోలేక రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. అయితే ఏపీలో క‌ర్ష్యూ గంట‌ను పెంచిన‌ట్లుగానే ఇక్క‌డ కూడా అమ‌లు చేస్తే బాగుంటుంద‌నే అభిప్రాయ‌న్ని ఉన్న‌తాధికారులు సీఎం కేసీఆర్‌కు సూచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. నేడో రేపో దీనిపై స్ప‌ష్టత వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.


కరోనా సెకండ్ వేవ్‌తో యావత్ దేశం అల్లకల్లోలంగా మారుతుండటం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌లోకి వెళ్లినా, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేవలం రాత్రి కర్ఫ్యూ విధించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ఇక్కడి నాయకులు అన్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈనేప‌థ్యంలో క్ర‌మంగా ఒక్కో రాష్ట్రం లాక్‌డౌన్ అమ‌ల్లోకి తేవ‌డం లేదంటే.. క‌ర్ఫ్యూ గంట‌ల గ‌డువును పెంచ‌డం చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని అక్క‌డి ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నారు.  మే 5 నుండి రెండు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 18 గంటల కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించిన విష‌యం తెలిసిందే.


 
దీంతో ఈ 18 గంటల కర్ఫ్యూ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈరోజు నుండే ఈ 18 గంటల కర్ఫ్యూ అమల్లోకి రానుంది. అన్ని రకాల దుకాణాలు, వ్యాపార సముదాయాలు కేవలం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసరాలు మొదలుకొని మందుల వరకు ఈ సమయంలోనే తెచ్చిపెట్టుకునేందుకు పరుగులు తీస్తున్నారు. అయితే ఈ కర్ఫ్యూ నుండి అత్యవసర సేవలకు మినహాయింపును ఇచ్చారు. ఈ కర్ఫ్యూ సమయంలో ప్రజలు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ మీడియా లేకపోతే చంద్రబాబు ఏమైపోయేవాడో ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీని వాయించేస్తున్న ప్రాంతీయపార్టీలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>