MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna9d6cb455-7553-4e22-bfc0-d4b0f1be46fd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna9d6cb455-7553-4e22-bfc0-d4b0f1be46fd-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ఈ పేరు తెలియని వారుండరు. బాలయ్య ఫైట్స్, డైలాగ్‌లకు అభిమానులు కాదు భక్తులున్నారనడంలో అతిశయోక్తి ఏమీలేదు. తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బిగ్ స్క్రీన్‌పై బాలయ్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే బాలయ్య సినిమా రిలీజ్ అంటే థియేటర్ల దగ్గర అభిమానులు..balakrishna;balakrishna;boyapati srinu;tara;cinema;nandamuri balakrishna;director;nandamuri taraka rama rao;racchaఆ ట్రాక్ తగ్గించమన్న బాలయ్య.. ఒప్పించిన దర్శకుడు..?ఆ ట్రాక్ తగ్గించమన్న బాలయ్య.. ఒప్పించిన దర్శకుడు..?balakrishna;balakrishna;boyapati srinu;tara;cinema;nandamuri balakrishna;director;nandamuri taraka rama rao;racchaThu, 06 May 2021 10:30:15 GMTనందమూరి బాలకృష్ణ ఈ పేరు తెలియని వారుండరు. బాలయ్య ఫైట్స్, డైలాగ్‌లకు అభిమానులు కాదు భక్తులున్నారనడంలో అతిశయోక్తి ఏమీలేదు. తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బిగ్ స్క్రీన్‌పై బాలయ్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే బాలయ్య సినిమా రిలీజ్ అంటే థియేటర్ల దగ్గర అభిమానులు హోరెత్తుతారు. ఎలాగైన బాలయ్య సినిమాను ఫస్ట్‌ డే ఫస్ట్ షో చూడాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్నారు.

సినిమా ప్రారంభం నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడన్న వార్త ప్రేక్షుల్లో ఆసక్తిని మరింత అధికం చేసింది. ఇక బాలయ్య చేయనున్న రెండు పాత్రల్లో ఒకటి అఘోరా అని తెలియడంతో అభిమానులకు పూనకాలు వచ్చినంత పనైంది. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురుచూడసాగారు. అదే సమయంలో  ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.  ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సినీ సర్కిల్స్‌లో షికార్లు కొడుతుంది.

అసలు విషయానికొస్తే అఖండ సీనిమాలో బాలయ్య చేసిన అఘోరా పాత్ర అద్భుతంగా రూపొందిందట. కానీ ఆ పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉందని బాలయ్య అభిప్రాయపడ్డారట. దాంతో సినిమాలో అఘోరా ట్రాక్‌ను కాస్త తగ్గించమని దర్శకుడు బోయపాటికి సలహా ఇచ్చారంట. కానీ బోయపాటి బాలయ్యకు నో చెప్పాడంట. అంతేకాకుండా సినిమాలో అఘోరా పాత్ర చాలా కీలకమని, ఆ పాత్ర సన్నివేశాలు కూడా అద్భుతంగా వచ్చాయని వాటిని తీస్తే సినిమా కళ పోతుందని చెప్పి బాలయ్యను కన్విన్స్ చేశాడంట.

ఇదిలా ఉంటే అఖండ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తోనే సినిమా దాదాపు పూర్తవుతుందని టాక్. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఈ నెల 28న బాలయ్య అభిమానులకు నిరాశే మిగులుతుంది. మరి ఈ సినిమా విడుదల విషయంలో ఏమి జరుగుతుందో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ స్వీట్ కపుల్ సంపాదన ఎంతో తెలుసా.!

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>