EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modiffe34d27-f833-4636-8abd-56ec563ad0e7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modiffe34d27-f833-4636-8abd-56ec563ad0e7-415x250-IndiaHerald.jpgప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ తన పదవీకాలం చివర్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఏ మాట చెప్పారు.. భారత చరిత్ర తనను బాగా గుర్తిస్తుందని.. తన విలువ భవిష్యత్‌లో తెలుస్తుందని అన్నారు. ఇప్పుడు ఆ మాటలు నిజమే అనిపిస్తున్నాయి. ప్రధానిగా మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు సేవలు అందించారు. ఆయన మౌనంగా పని చేసుకుంటూ పోయారు. సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మగా అప్పట్లో మీడియా ఎద్దేవా చేసినా.. ఓ మౌనమునిలా పని చేసుకుంటూ వెళ్లారు. మన్మోహన్ సింగ్ హయాంలో దేశం అనేక రికార్డులు సాధించింది. దేశం గరిష్ట స్థాయిలో జీడీపీ నమోదు చేసింది. modi;view;soniagandhi;manmohan;maya;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;mohandas karamchand gandhi;sonia gandhi;manmohan singh;a p j abdul kalam;media;prime minister;history;interview;minister;central government;paruguఅభివృద్ధి శూన్యం.. విద్వేషమే వ్యూహం.. ఈ మార్పు ఏ తీరానికి..?అభివృద్ధి శూన్యం.. విద్వేషమే వ్యూహం.. ఈ మార్పు ఏ తీరానికి..?modi;view;soniagandhi;manmohan;maya;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;mohandas karamchand gandhi;sonia gandhi;manmohan singh;a p j abdul kalam;media;prime minister;history;interview;minister;central government;paruguThu, 06 May 2021 10:00:00 GMTప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ తన పదవీకాలం చివర్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఏ మాట చెప్పారు.. భారత చరిత్ర తనను బాగా గుర్తిస్తుందని.. తన విలువ భవిష్యత్‌లో తెలుస్తుందని అన్నారు. ఇప్పుడు ఆ మాటలు నిజమే అనిపిస్తున్నాయి. ప్రధానిగా మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు సేవలు అందించారు. ఆయన మౌనంగా  పని చేసుకుంటూ పోయారు. సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మగా అప్పట్లో మీడియా ఎద్దేవా చేసినా.. ఓ మౌనమునిలా  పని చేసుకుంటూ  వెళ్లారు.

మన్మోహన్ సింగ్ హయాంలో దేశం అనేక రికార్డులు సాధించింది. దేశం గరిష్ట స్థాయిలో జీడీపీ నమోదు చేసింది. ఆర్థిక వృద్ధి రేటు పరుగులు  పెట్టింది. దేశ చరిత్రలోనే అత్యధికంగా  రెండు అంకెల వృద్ధి రేటు నమోదైంది. దాదాపు 12 శాతం వరకూ ఈ వృద్ధి రేటు ఉంది. సైన్స్, టెక్నాలజీ రంగాల్లోనూ చెప్పుకోదగిన అభివృద్ధి నమోదైంది. వ్యవస్థలు వాటంతట అవి నడిచే అవకాశం కల్పించారు. అనవసర జోక్యం.. అధికార దర్పం అన్నవి ఆయన కాలంలో లేవు.

అంతే కాదు.. అభివృద్ధి సంగతి అటుంచి.. సమాజంలో అన్ని వర్గాల మధ్య విద్వేషాలు లేవు.. మన్మోహన్ సింగ్ ఓ ఆర్థిక మేధావి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన కాలంలో మరో మేధావి అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా కొంతకాలం ఉన్నారు. ఇలాంటి మేధావుల సారథ్యంలో దేశం నడిచింది. ఆ తర్వాత కాలంలో పరిస్థితి మారుతూ వచ్చింది.  

కేంద్రంలో అధికారం మారింది. సోషల్ మీడియా రాకతో దుష్ప్రచారం.. వ్యక్తి పూజకు ఆస్కారం ఏర్పడింది. వాస్తవం గడప దాటే లోపల అబద్దం ప్రపంచాన్ని చుట్టి వస్తోంది. సమాజాన్ని విభజించి భావోద్వేగాలు రెచ్చగొట్టే కొత్త రాజకీయ వ్యూహం పకడ్బందీగా అమలవుతోంది. చైనాను చూపించి.. పాకిస్తాన్‌ ను చూపించి.. ప్రజలను మాయ చేసే రాజకీయాలు ఊపందుకున్నాయి. ఉపందుకోవడమే కాదు.. అవి విజయవంతం అవుతున్నాయి. ఫలితంగా దేశ అభివృద్ధి సూచీలు నేలకు చూస్తున్నాయి. మరి ఈ మార్పు ఏ తీరానికి.. జనం ఆలోచించాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారత్ లో క‌రోనా మ‌హోగ్ర‌రూపం..!!

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>