MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-syamsingha-royc76f4a3d-59ed-4b0a-a1ee-e64ecffdbfbb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-syamsingha-royc76f4a3d-59ed-4b0a-a1ee-e64ecffdbfbb-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా సినిమా శ్యామ్ సింగరాయ్. కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. నాచురల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవితో పాటు ఉప్పెన అప్సరస కృతిశెట్టి హీరోయిన్లుగా..nani syamsingha roy;beauty;nani;shiva;shyam;siva nirvana;cinema;lord siva;thriller;kusuma jagadish;shiva nirvana;tuck jagdish;tuck jagadish;chitramదూసుకెళ్తున్న నాని.. తగ్గేదే లేదు..?దూసుకెళ్తున్న నాని.. తగ్గేదే లేదు..?nani syamsingha roy;beauty;nani;shiva;shyam;siva nirvana;cinema;lord siva;thriller;kusuma jagadish;shiva nirvana;tuck jagdish;tuck jagadish;chitramThu, 06 May 2021 09:55:56 GMTఇంటర్నెట్‌డెస్క్‌: నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా సినిమా శ్యామ్ సింగరాయ్. కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. నాచురల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవితో పాటు ఉప్పెన అప్సరస కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో మడోన్నా సెబాస్టియిన్‌ కీలక పాత్రలో చేస్తున్నారు. ఈ సినిమాను దర్శకనిర్మాతలు శరవేగంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు.

 అందులో భాగంగా ఈ సినిమా ఆఖరి  షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుపుతున్నారు. ఈ షెడ్యూల్ కోసం కోల్‌కతాను తలపించేలా భారీ సెట్‌ను హైదరాబాద్‌లో రూపొందించారు. ఈ సెట్ పది ఎకరాల విస్తీర్ణంలో వేశారు. దీనికోసం దాదాపు రూ.6.5కోట్ల ఖర్చు చేశారని టాక్ నడుస్తోంది. ఈ సెట్‌లో సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఇటీవల రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో అన్ని సినిమా చిత్రీకరణలు నిలిచిపోయాయి. కరోనా దెబ్బకు బడా చిత్రాలు సైతం షూటింగ్ ఆపినా శ్యామ్ సింగరాయ్ మాత్రం ముందుకు దూసుకెళుతున్నాడు.

 కరోనా నివారణకు కావలసిన అన్ని జాగ్రత్తలను పాటిస్తూ ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం దాదాపు పూర్తయిందని, మరికొన్ని కీలక సన్నివేశాలను చేస్తే సినిమా కంప్లీట్ అవుతుందట. అందుకనే దర్శకనిర్మాతలు కరోనా సమయంలోనూ చిత్రీకరణ కొనసాగిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేయనున్నారట.

ఇదిలా ఉంటే ‘వీ’‌ సినిమా పరాభవం తరువాత నాని తన స్పీడు పెంచాడు. ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో టక్ జగదీష్ సినిమా పూర్తయి రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి టక్ జగదీష్ గత నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా దెబ్బకు సినిమా విడుదల వాయిదా పడింది. అయితే త్వరలోనే టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు వస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారత్ లో క‌రోనా మ‌హోగ్ర‌రూపం..!!

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>