PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china93ba902a-61fc-4855-9c58-23a727431455-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china93ba902a-61fc-4855-9c58-23a727431455-415x250-IndiaHerald.jpgచైనా నిర్లక్ష్యం మరోసారి ప్రపంచానికి పెను ముప్పుగా మారింది. ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడు చైనా నిర్వాకంతో మరోసారి ప్రపంచం హడలెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. అసలేమైందంటే చైనా ఇటీవల ప్రయోగించిన 21 టన్నుల భారీ రాకెట్‌ లాంగ్‌ మార్చ్‌ 5బీ గతి తప్పింది. ఆ రాకెట్ పై చైనా పట్టు కోల్పోయింది. ఈ రాకెట్ ప్రయోగంలో జరిగిన పొరపాట్లతో అది కక్ష తప్పింది. వేరే కక్ష్యలోకి వెళ్లింది.. ఇది క్రమంగా భూమివైపు వస్తోంది. ఈ రాకెట్ ఇప్పుడు భూమిపై పడటం ఖాయమని అమెరికా సంస్థ పెంటగాన్china;american samoaప్రపంచం నెత్తిన బాంబు.. ఆ చైనా రాకెట్.. ?ప్రపంచం నెత్తిన బాంబు.. ఆ చైనా రాకెట్.. ?china;american samoaThu, 06 May 2021 09:23:19 GMTచైనా నిర్లక్ష్యం మరోసారి ప్రపంచానికి పెను ముప్పుగా మారింది. ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడు చైనా నిర్వాకంతో మరోసారి ప్రపంచం హడలెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. అసలేమైందంటే చైనా ఇటీవల ప్రయోగించిన 21 టన్నుల భారీ రాకెట్‌ లాంగ్‌ మార్చ్‌ 5బీ గతి తప్పింది. ఆ రాకెట్ పై చైనా పట్టు కోల్పోయింది. ఈ రాకెట్ ప్రయోగంలో జరిగిన పొరపాట్లతో అది కక్ష తప్పింది. వేరే కక్ష్యలోకి వెళ్లింది.. ఇది క్రమంగా భూమివైపు వస్తోంది.


ఈ రాకెట్ ఇప్పుడు భూమిపై పడటం ఖాయమని అమెరికా సంస్థ పెంటగాన్ తేల్చేసింది. ఇప్పుడు ఈ రాకెట్ శకలాలు భూమిపై పడతాయట. ఈ వారాంతంలో భూమి వాతావరణంలోకి  లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌ ప్రవేశిస్తుందట. అమెరికా స్పేస్‌ కమాండ్‌ రాకెట్‌పై కన్నేసి ఉంచిది. అయితే ఈ రాకెట్ శకలాలు ఎక్కడ పడతాయన్నది మాత్రం కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. సాధారణంగా అంతరిక్ష శకలాలు సముద్రతలాలపై పడుతుంటాయి.


కానీ చైనా రాకెట్‌ శకలాలు మాత్రం జనావాసాలపైనే  పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయట. న్యూయార్క్‌, మ్యాడ్రిడ్‌, బీజింగ్‌, న్యూజిలాండ్‌ దేశాల్లో పడేందుకు అవకాశం ఉందట. మరోసారి ఈ రాకెట్ కారణంగా చైనా పై విమర్శలు వస్తున్న సమయంలో తన పనిని చైనా సమర్థించుకుంటోంది. ఈ రాకెట్‌ జనావాసాలు లేని ప్రాంతంలోనే పడుతుందని చెబుతోంది. అంతే కాదు.. ఈ రాకెట్ ప్రయోగం విఫలమైనా చైనా మున్ముందు మరిన్ని రాకెట్‌లను లాంచ్‌ చేస్తుందట.  తమ స్పేస్‌ స్టేషన్‌ను పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉందట.


చైనా కొన్నాళ్లుగా అంతరిక్షంలో టియాన్హీ పేరిట ఒక స్పేస్‌ స్టేషన్‌ను నిర్మిస్తోంది. దాన్ని పూర్తి చేసే క్రమంలోనే లాంగ్‌ మార్చ్‌ 5బీని గత నెల 29న నింగిలోకి పంపించింది. మరో విషయం ఏంటంటే.. ఈ లాంగ్‌ మార్చ్‌ 5బీ తొలి భాగాన్ని లాంచ్‌ చేసినప్పుడు కూడా ఐవరీ కోస్ట్‌ ప్రాంతంలో  కొన్ని శకలాలు పడిన పలు భవనాలను ధ్వంసం అయ్యాయట.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా కాటుకు మరో ప్రముఖుడు బలి..!!

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>