MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjund7fa1c22-c871-439d-8d52-caf68a890189-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjund7fa1c22-c871-439d-8d52-caf68a890189-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన పాటలు ఏ స్థాయిలో హిట్టవుతాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సన్నాఫ్ సత్యమూర్తి, ఆర్య, ఆర్య 2, దువ్వాడ జగన్నాథం, జులాయి సినిమాల్లోని దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్స్ అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పాటలు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు భారత దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. దేవిశ్రీప్రసాద్ అల్లు అర్జున్ సినిమాలోని ఓ పాటను రీమిక్స్ చేసి సల్మాన్ హీరోగా నటిస్తున్న రాధే సినిమాలో పెట్టిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన allu arjun;pooja hegde;prabhu deva;salman khan;allu arjun;arya;devi sri prasad;prasad;bollywood;cinema;youtube;you tube;audience;interview;duvvada jagannadham;arjun 1;julayi;s/o satyamurthy;arya 2;aryaa;fidaaరాధేలో బన్నీ..?రాధేలో బన్నీ..?allu arjun;pooja hegde;prabhu deva;salman khan;allu arjun;arya;devi sri prasad;prasad;bollywood;cinema;youtube;you tube;audience;interview;duvvada jagannadham;arjun 1;julayi;s/o satyamurthy;arya 2;aryaa;fidaaThu, 06 May 2021 12:00:00 GMTఅల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన పాటలు ఏ స్థాయిలో హిట్టవుతాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సన్నాఫ్ సత్యమూర్తి, ఆర్య, ఆర్య 2, దువ్వాడ జగన్నాథం, జులాయి సినిమాల్లోని దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్స్ అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పాటలు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు భారత దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి.



దేవిశ్రీప్రసాద్ అల్లు అర్జున్ సినిమాలోని ఓ పాటను రీమిక్స్ చేసి సల్మాన్ హీరోగా నటిస్తున్న రాధే సినిమాలో పెట్టిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే సినిమాలోని "సీటీమార్" పాట బాగా ప్రజాదరణ పొందగా.. దీనినే రీమిక్స్ చేసి సల్మాన్ ఖాన్ సినిమాలో దేవిశ్రీ యూస్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వారం రోజుల క్రితం విడుదలయింది. ఐతే అల్లు అర్జున్ సీటీమార్ పాటకు బ్రహ్మాండంగా డాన్స్ వేశారని కానీ సల్మాన్ ఖాన్ చాలా చండాలంగా డాన్స్ వేసి నిరాశపరిచారని బాలీవుడ్ ఆడియన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.



దీనిపై దేవిశ్రీప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పెదవి విప్పారు. ఆయన మాట్లాడుతూ.. "యూట్యూబ్ లో విడుదలైన సీటీమార్ రీమిక్స్ పాట 3 నిమిషాలే ఉంది కానీ సినిమాలో ఆ పాట 4 నిమిషాల 30 సెకన్లు ఉంటుంది. మిగిలిన ఆ 1 నిమిషం 30 సెకండ్ల పాటలో సల్మాన్ ఖాన్ చాలా అద్భుతంగా డాన్స్ స్టెప్పులు వేశారు. సినిమాలో ఒక హూడీ స్టెప్ ఉంటుంది.. ఆ స్టెప్ ని దిశ, సల్మాన్ కలిసి అదరగొట్టేసారు. అది బెస్ట్ డాన్స్ స్టెప్ ఆఫ్ ది ఇయర్ అవుతుందని నేను కచ్చితంగా చెప్పగలను.... "



"టెర్రిఫిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. దానికి తగ్గ డాన్స్ స్టెప్పులు ప్రేక్షకులను ఫిదా చేయడం ఖాయం. నేను చిత్రం షూటింగ్ ని ప్రత్యక్షంగా చూశాను. సల్మాన్ హూడీ స్టెప్ కి సంబంధించిన పోర్షన్ వెండితెరపై చూసేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని సల్మాన్ ఖాన్ అద్భుతమైన డాన్స్ స్టెప్స్ ని కావాలనే చిత్ర యూనిట్ దాచిపెట్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ స్టెప్స్ తో రాధే సినిమాలో బన్నీ కి పోటాపోటీగా సల్మాన్ డాన్స్ వేశారని ప్రేక్షకులు కచ్చితంగా ఒప్పుకుంటారు" అని ఆయన చెప్పుకొచ్చారు.



ఇకపోతే ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే తారాగణంలో వస్తున్న రాధే సినిమా మే 13వ తేదీన విడుదల కావలసి ఉండగా.. కరోనా నేపథ్యంలో రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ నంబర్ కు కాల్ చేస్తే భోజనం, మాస్క్ ఫ్రీ.. ఎక్కడంటే?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>