PoliticsSpydereditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/critical-polling-stationsbe4799da-c563-4023-a74c-a3c961b2d0ae-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/critical-polling-stationsbe4799da-c563-4023-a74c-a3c961b2d0ae-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కరోనా అదుపులోకి వచ్చి, పరిస్థితులు అనుకూలించేవరకు ఉప ఎన్నికలు నిర్వహించడం సముచితం కాదని నిర్ణ‌యించింది. బెంగాల్‌ సహా ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల కారణంగా వైరస్‌ సంక్రమణ ఎక్కువగా జరిగిందన్న విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాస్త‌వానికి దేశంలో మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు, ఎనిమిది అసెంబ్లelections;amala akkineni;scheduled caste;court;murder;assembly;mla;tamilnadu;murder.;central government;marchకేంద్రం ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఆ ఎన్నిక‌లు వాయిదా..కేంద్రం ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఆ ఎన్నిక‌లు వాయిదా..elections;amala akkineni;scheduled caste;court;murder;assembly;mla;tamilnadu;murder.;central government;marchThu, 06 May 2021 09:00:00 GMTదేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కరోనా అదుపులోకి వచ్చి, పరిస్థితులు అనుకూలించేవరకు ఉప ఎన్నికలు నిర్వహించడం సముచితం కాదని నిర్ణ‌యించింది. బెంగాల్‌ సహా ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల కారణంగా వైరస్‌ సంక్రమణ ఎక్కువగా జరిగిందన్న విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాస్త‌వానికి దేశంలో మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జ‌ర‌గాల్సి ఉంది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా దేశంలో అల్ల‌క‌ల్లొలం సృష్టించ‌డంతో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అసాధ్య‌మ‌ని ఎన్నిక‌ల సంఘం భావిస్తోంది. ఇటీవ‌ల ముగిసిన ప‌లు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పైనే కోర్టులు చాలా సీరియ‌స్సాయి.



తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తికి ఎలక్షన్ కమిషనే కారణమని మద్రాసు హైకోర్టు ఘాటుగా విమర్శించింది.
కరోనా సమయంలో ఎన్నికల ర్యాలీలకు అనుమతిని ఇవ్వడంపై మండిపడింది. కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న తరుణంలో ఇలా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించింది. కరోనా నిబంధనలను అమలు చేయడంలో సీఈసీ పూర్తిగా విఫలమైందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మండిపడ్డారు. ర్యాలీలు, సభలు ఎందుకు ఆపలేకపోయారని ఎలక్షన్ కమిషన్‌‌ను హైకోర్టు ప్రశ్నించింది. కేసుల పెరుగుదలకు అధికారులను బాధ్యులను చేస్తూ వారిపై మర్డర్ కేసు పెట్టాలంటూ సీరియస్ అయ్యింది. కౌంటింగ్‌‌కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో బ్లూ ప్రింట్ ఇవ్వాలని ఆదేశించిన విష‌యం తెలిసిందే. కోర్టు వ్యాఖ్య‌ల‌ను దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించింది.


 దాద్రా – నగర్‌ హవేలి, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా, హిమాచల్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గాలతో పాటు, హరియాణాలోని కల్కా, ఎల్లెనాబాద్, రాజస్తాన్‌లోని వల్లభనగర్, కర్ణాటకలోని సింగ్డి, మేఘాలయలోని రాజబాలా, మావరింగ్‌కెంగ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. మరికొన్ని ఖాళీ స్థానాలకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది. బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య మార్చి 28న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ టీకా జీవితకాలం యాంటీబాడీలు.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>