MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/star-hero-setup-is-not-normalc9c05a2a-ace8-4919-8b36-7b8cbba70c72-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/star-hero-setup-is-not-normalc9c05a2a-ace8-4919-8b36-7b8cbba70c72-415x250-IndiaHerald.jpgతెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో విజయ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తమిళ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో విజయ్. ఇక త‌మిళ‌నాడులో త‌ల‌పతి అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే విజ‌య్ కి తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉంది.vijay;dilip kumar;kumaar;pooja hegde;dileep;dileep kumar;dilip;maharshi;sethu;vamsi;vamsi paidipally;vijay;vijay sethupathi;tollywood;2019;cinema;telugu;rajani kanth;tamil;maharshi 1;car;blockbuster hit;director;husband;hero;joseph vijay;dil;mass;master;chitramస్టార్ హీరో సెటప్ మాములుగా లేదుగా..!స్టార్ హీరో సెటప్ మాములుగా లేదుగా..!vijay;dilip kumar;kumaar;pooja hegde;dileep;dileep kumar;dilip;maharshi;sethu;vamsi;vamsi paidipally;vijay;vijay sethupathi;tollywood;2019;cinema;telugu;rajani kanth;tamil;maharshi 1;car;blockbuster hit;director;husband;hero;joseph vijay;dil;mass;master;chitramThu, 06 May 2021 09:45:33 GMTతెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో విజయ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తమిళ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో విజయ్. ఇక త‌మిళ‌నాడులో త‌ల‌పతి అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే విజ‌య్ కి తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉంది. ఇక ఈ ఏడాదిని మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ప్రారంభించాడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ రోల్ పోషించిన మాస్టర్ మూవీ విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసింది.

ఇక స్టార్ హీరో సినిమా అంటే యాక్షన్ డోస్ కొద్దిగా ఎక్కువ ఉండాల్సిందే అంటుంటారు అభిమానులు. తమ అభిమాన హీరో స్క్రీన్ మీద హీరోయిజం పండిస్తుంటే చెప్పలేనంత థ్రిల్ పొందుతుంటారు. అందుకే మన స్టార్ హీరోలు తమ సినిమాల్లో కథ కొంచెం అటుఇటుగా ఉన్నా హీరోయిక్ ఎలివేషన్స్ మీద మాత్రం గట్టిగా దృష్టి పెడుతుంటారు. అదిరిపోయే ఫైట్లు, ఈలలు వేసే డైలాగ్స్, వీలైతే కొత్త తరహా స్టంట్స్ ట్రై చేయాలని చూస్తుంటారు. తమిళ హీరో విజయ్ తన తర్వాతి సినిమాలో ఇవన్నీ మెండుగా ఉండేలా జాగ్రత్తపడుతున్నారు.

విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో గన్ ఫైట్స్, కార్ చేజింగ్స్, హార్స్ రైడింగ్స్ లాంటి ఎన్నో విశేషాలు ఉండనున్నాయి. ఇవన్నీ అభిమానుల కోసమే ప్రత్యేకంగా చేస్తున్న సెటప్. అందుకే ఫాన్స్ సైతం సినిమా పట్ల బాగా ఎగ్జైట్ అవుతున్నారు. సన్ పిక్చర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటించనుంది. ఈ ఏడాదిలోనే సినిమాను పూర్తిచేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర బృందం.

అయితే గత ఏడాదిన్నర కాలంగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఏ హీరోతో కూడా సినిమా ఓకే చేసుకోలేదు. 2019 మహర్షి తర్వాత వంశీ నుండి ఒక సినిమా కూడా రాలేదు. మరి మొత్తానికి టాలీవుడ్ విడిచి తమిళ స్టార్ హీరోని బాగానే లైన్ లో పెట్టాడంటూ ఇండస్ట్రీలో టాక్. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడని సినీవర్గాలు చెబుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారత్ లో క‌రోనా మ‌హోగ్ర‌రూపం..!!

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>