HealthMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-kasta-kalamlo-raithanna-pedda-manasu-kuthuru-pelli-kosam-dhachukunna-dabbuff1c7bd0-3ca8-4ecc-abd2-96562aebaeb8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-kasta-kalamlo-raithanna-pedda-manasu-kuthuru-pelli-kosam-dhachukunna-dabbuff1c7bd0-3ca8-4ecc-abd2-96562aebaeb8-415x250-IndiaHerald.jpgకరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కేసుల సంఖ్య తక్కువగా ఉండటం తో ఆస్పత్రుల్లో ఆక్సిజన్, కరోనా మందుల కొరత ఏర్పడలేదు. కానీ సెకండ్ వేవ్ ఉధృతితో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆస్పత్రులకు వెళితే బెడ్స్ దొరకడం లేదు. బెడ్స్ దొరికినా వెంటిలేటర్ బెడ్స్ దొరకడం కష్టంగా మారింది. ముఖ్యంగా కరోనా రోగులకు అత్యవసరమైన రెమిడివిర్, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. హైదరాబాద్ దుమ్మాయి గూడ కు చెంoxygen;anil music;deva;goa;kerala;hyderabad;mandula;smart phone;school;vegetable market;oxygen;houseఆక్సిజన్ కొరతతో ఆగుతున్న ఊపిరి.. !ఆక్సిజన్ కొరతతో ఆగుతున్న ఊపిరి.. !oxygen;anil music;deva;goa;kerala;hyderabad;mandula;smart phone;school;vegetable market;oxygen;houseThu, 06 May 2021 09:00:55 GMTకరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కేసుల సంఖ్య తక్కువగా ఉండటం తో ఆస్పత్రుల్లో ఆక్సిజన్, కరోనా మందుల కొరత ఏర్పడలేదు. కానీ సెకండ్ వేవ్ ఉధృతితో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆస్పత్రులకు వెళితే బెడ్స్ దొరకడం లేదు. బెడ్స్ దొరికినా వెంటిలేటర్ బెడ్స్ దొరకడం కష్టంగా మారింది. ముఖ్యంగా కరోనా రోగులకు అత్యవసరమైన రెమిడివిర్, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. హైదరాబాద్ దుమ్మాయి గూడ కు చెందిన అనిల్ అనే ప్రైవేట్ స్కూల్ యజమాని కరోనా రావడం తో ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే ఒక్కసారిగా అనిల్ కు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో కుటుంబసభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ ఆక్సీజన్ లేదని సిబ్బంది చెప్పడంతో వెంటనే మరో 20 ముప్పై ప్రైవేట్ ఆస్పత్రులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. కానీ ఎక్కడా ఆక్సిజన్ లభించలేదు. 

చివరికి ఒక ఆస్పత్రిలో లభించగా వెళ్లారు. అయితే చికిత్స తీసుకుంటూనే అనిల్ ప్రాణాలు కోల్పోయారు. అనిల్ మరణంతో కుటుంబం లో విషాదం నిండుకుంది. ఇది కేవలం అనిల్ ఒక్కడికి జరిగిందే కాదు రాష్ట్రంలో ఎంతోమంది ఇలా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఆక్సిజన్, రెమిడెసివిర్ ఔషధాలు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. ఒక్కో ఇంజెక్షన్ 30 నుండి 40 వేలకు అమ్ముకుంటున్నారు. బ్లాక్ మార్కెట్ కారణంగా కూడా ఆక్సిజన్ కొరత నెలకొంది. హైదరాబాద్ లోని ఆస్పత్రులు రోజురోజుకు ఆక్సిజన్ సప్లై చేసుకుంటున్నాయి. అయితే ఒక్కోసారి ఆక్సిజన్ సమయానికి అందుతుందా లేదా అన్నది కూడా డౌటే. దాంతో ఆస్పత్రికి వెళ్లినా ప్రజల ప్రాణాలు దక్కుతాయా లేదా అంటే దేవుడికే తెలియాలి. ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కూడా ఉంది. కరోనా ఫస్ట్ వేవ్ వచ్చి ఏడాది అవుతుంది. అప్పటి నుండి కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ వచ్చింది. కానీ కేరళ, గోవా లాంటి రాష్ట్రాలు మాత్రం ఆక్సిజన్ ను కావాల్సినంత సమకూర్చుకుని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ టీకా జీవితకాలం యాంటీబాడీలు.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>