MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/senior-ntr-act-with-the-direction-of-balayya6ecdf006-16f5-4370-b97d-70e13507b765-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/senior-ntr-act-with-the-direction-of-balayya6ecdf006-16f5-4370-b97d-70e13507b765-415x250-IndiaHerald.jpgచిత్ర సీమలో ఎన్నో విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. తెర వెనక ఎవరి పాత్రలు ఎలా ఉన్నా కెమెరా ముందు మాత్రం ఎన్నో వింతలూ విడ్డూరాలే జరుగుతాయి. ఎన్టీయార్ నట వారసుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బాలయ్యకు తండ్రి లాగానే చాలా విషయాల్లో ఆసక్తి ఉంది. తండ్రి మాదిరిగా గుర్తుండిపోయే పాత్రలు చేయాలన్న ఆసక్తి కూడా ఉంది. ntr balayya;ntr;balakrishna;soundarya;arjuna;rani;tara;tollywood;cinema;father;vఎన్టీయార్ నే డైరెక్ట్ చేసిన బాలయ్య ... ?ఎన్టీయార్ నే డైరెక్ట్ చేసిన బాలయ్య ... ?ntr balayya;ntr;balakrishna;soundarya;arjuna;rani;tara;tollywood;cinema;father;vThu, 06 May 2021 19:00:00 GMTచిత్ర సీమలో ఎన్నో విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. తెర వెనక ఎవరి పాత్రలు ఎలా ఉన్నా కెమెరా ముందు మాత్రం ఎన్నో వింతలూ విడ్డూరాలే జరుగుతాయి. ఎన్టీయార్ నట వారసుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బాలయ్యకు తండ్రి లాగానే చాలా విషయాల్లో ఆసక్తి ఉంది. తండ్రి మాదిరిగా గుర్తుండిపోయే పాత్రలు చేయాలన్న ఆసక్తి కూడా ఉంది.

దాంతో బాలయ్య తన కెరీర్ లో పౌరాణికాలు జానపదాలు కూడా చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక బాలయ్యకు డైరెక్షన్ చేయాలని కూడా ఉంది. అందుకోసమే ఆయన సౌందర్యను ద్రౌపది పాత్రలో పెట్టి తాను అర్జునుడిగా నర్తన శాల మూవీని 2004లో స్టార్ట్ చేశారు. సౌందర్య మరణంతో అది అప్పట్లో  ఆగిపోయింది.

అయితే బాలయ్యలో డైరెక్షన్ చేయాలన్న కోరిక మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. అది పక్కన పెడితే బాలయ్య  డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేశారు. అది కూడా తన తండ్రి వద్ద శిష్యరికం చేసి మరీ మెలకువలు నేర్చుకున్నారు. ఎన్టీయార్ అప్పట్లో బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీని తీశారు. దానికి డైరెక్షన్ ఎన్టీయారే. అయితే ఆ సినిమాలో రెండు పాత్రలు పోషించిన బాలయ్య దర్శకత్వ విభాగంలో కూడా తండ్రికి సహాయంగా ఉంటూ చాలా సీన్లు తీశారట.

అంతే కాదు ఎన్టీయార్ నే కొన్ని సీన్లలో డైరెక్ట్ చేశారని కూడా చెబుతారు. ఆ మూవీలో స్క్రిప్ట్ నుంచి మొత్తం నిర్మాణం వరకూ అన్ని బాధ్యతలను బాలయ్య దగ్గరుండి చూసుకున్నారు. అంతే కాదు ఆ సినిమాలో డైలాగులు కూడా ఎన్టీయార్ తో పాటు ఇతర నటీనటులకు చెబుతూ బాలయ్య డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో గొప్పగా రాణించారని కూడా చెబుతారు. సరే బాలయ్యకు డైరెక్షన్ ఎంత ఇష్టమైనా కూడా ఆయన మాత్రం సొంతంగా ఇప్పటికీ  ఒక్క సినిమా చేయలేదు అన్న వెలితి మాత్రం ఫ్యాన్స్ కి ఉంది. బహుశా అది తొందరలో తీరే అవకాశం ఉందేమో.











Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

‘ఆదిపురుష్‌’ కోసం సంవత్సరాలుగా కష్టపడుతున్నాడా..?

మెగాస్టార్ ఎప్పటికీ పోషించని పాత్ర అదే.... ?

కరెంట్ టాపిక్స్ ఓకే... కంటెంట్ కూడా కావాలి బాబూ... ?

కరోనా రోగుల ఆహారపు నియమాలు.. !

కరోనా కాటుకు మరో క్రికెటర్ బలి..!!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>