EditorialThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/congress-party5bc2788c-724d-4a59-aed1-068ed74a4c53-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/congress-party5bc2788c-724d-4a59-aed1-068ed74a4c53-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్‌లో వ‌ర్గ‌విబేధాలు ఆ పార్టీకి శాపంగా మారాయి. ముఖ్యంగా టీపీసీసీ అధ్య‌క్షుడి ఎన్నిక విష‌యంలో రెండు సంవ‌త్స‌రాలుగా ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేని ప‌రిస్థితి. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పార్టీ ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తు రాజీనామా లేఖ‌ను కేంద్ర పార్టీ అధిష్టానంకు అందించారు. అప్ప‌టి నుండి నేటి వ‌ర‌కు కొత్త అధ్య‌క్షుడి నియామ‌కంపై చ‌ర్చ‌లు సాగుతూనే ఉన్నాయి. congress party;kumaar;nagarjuna akkineni;bharatiya janata party;telangana;revanth reddy;congress;రాజీనామా;tpcc;assembly;local language;central government;reddy;partyకాంగ్రెస్‌కు మంచి అవ‌కాశం.. ఇప్పుడు మేలుకోకుంటే..కాంగ్రెస్‌కు మంచి అవ‌కాశం.. ఇప్పుడు మేలుకోకుంటే..congress party;kumaar;nagarjuna akkineni;bharatiya janata party;telangana;revanth reddy;congress;రాజీనామా;tpcc;assembly;local language;central government;reddy;partyThu, 06 May 2021 11:17:46 GMTతెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు నిర్వీర్యం అవుతుంది. రాష్ట్రంలో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ డిపాజిట్లు ద‌క్కించుకోలేని ప‌రిస్థితికి చేరుతుంది. అయినా కాంగ్రెస్‌లో జ‌వ‌స‌త్వాలు నింపేందుకు కేంద్ర పార్టీ అధిష్టానం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌టం ఆ పార్టీ శ్రేణుల‌ను ఆవేద‌న‌కు గురిచేస్తుంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో రాజ‌కీయాలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ఒక‌ప‌క్క తెరాస‌లో ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం ర‌చ్చ‌చేస్తుండ‌గా, మ‌రోప‌క్క బీజేపీలో అంత‌ర్గ‌త పోరు కొన‌సాగుతుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేయ‌డం ద్వారా పార్టీకి పూర్వ‌వైభ‌వం తీసుకురావ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో వ‌ర్గ‌విబేధాలు ఆ పార్టీకి శాపంగా మారాయి. ముఖ్యంగా టీపీసీసీ అధ్య‌క్షుడి ఎన్నిక విష‌యంలో రెండు సంవ‌త్స‌రాలుగా ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేని ప‌రిస్థితి. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పార్టీ ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తు రాజీనామా లేఖ‌ను కేంద్ర పార్టీ అధిష్టానంకు అందించారు. అప్ప‌టి నుండి నేటి వ‌ర‌కు కొత్త అధ్య‌క్షుడి నియామ‌కంపై చ‌ర్చ‌లు సాగుతూనే ఉన్నాయి. ఆరునెల‌ల క్రితం టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి పేరును అధిష్టానం ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మైంది. దీంతో ఆ పార్టీలోని ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు రేవంత్‌కు టీపీసీసీ అధ్య‌క్షుడి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే తాము పార్టీనిసైతం వీడుతామంటూ పేర్కొన‌డంతో ప్ర‌క‌ట‌న వాయిదా ప‌డింది.

అనంత‌రం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు రావ‌డం, కాంగ్రెస్ పార్టీ ఘోర ఓట‌మి పాల‌వ‌డం జ‌రిగిపోయాయి. రాష్ట్రంలో ఏ ఎన్నిక జ‌రిగిన కాంగ్రెస్ రెండు, మూడు స్థానాల‌కే ప‌రిమితం అవుతుంది. ఇటీవ‌ల నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ముగియ‌డంతో  మ‌ళ్లీల టీపీసీసీ అధ్య‌క్షుడి నియామ‌కం తెర‌పైకి వ‌చ్చినా పార్టీలోని వ‌ర్గ విబేధాల‌తో కేంద్ర పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేక పోతుంది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ శ్రేణులు అధిష్టానం తీరుపై అస‌హ‌నం వ్య‌క్తంచేసే ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో వై.ఎస్‌. ష‌ర్మిల కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతుంది. దీనికితోడు బీజేపీ తెలంగాణ‌లో బ‌లోపేతం అయ్యేలా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌లోని కీల‌క నేత‌ల‌ను త‌మ‌వైపుకు లాక్కొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ క్ర‌మంలో పార్టీ బ‌లోపేతంపై అధిష్టానం దృష్టిసారించ‌కుంటే పార్టీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికైన అధిష్టానం స్పందించి టీపీసీసీ చీఫ్‌ను వెంట‌నే నియ‌మించాల‌ని, త‌ద్వారా పార్టీ శ్రేణుల్లో నూత‌నోత్సాహాన్నినింపి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ‌వైభ‌వం తీసుకురావాల‌ని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ నంబర్ కు కాల్ చేస్తే భోజనం, మాస్క్ ఫ్రీ.. ఎక్కడంటే?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>