MoviesThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akkda-vaddannaru-ikkada-swagatham-palikaru0ecf7841-4359-46ea-8561-b4b03ca8e2a8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akkda-vaddannaru-ikkada-swagatham-palikaru0ecf7841-4359-46ea-8561-b4b03ca8e2a8-415x250-IndiaHerald.jpgకంగ‌నా మ‌రో వివాదాస్ప‌ద ట్వీట్ చేశారు. వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని కంగ‌నా ఓ రాక్ష‌సిగా అభివ‌ర్ణించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో వెంట‌నే రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని, అస్సాం, పుదుచ్చేరిల్లో బీజేపీ గెలిచినా అక్క‌డ హింస చెల‌రేగ‌లేద‌ని అన్నారు. ప‌శ్చిమ బెంగాల్‌లో మాత్రం టీఎంసీ హింస‌కు దిగుతోంద‌ని కంగ‌నా ట్వీట్ చేసింది. బెంగాల్ మంట‌ల్లో కాలిపోతుందంటూ కంగ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కంగ‌నా వ్యాఖ్య‌ల‌పై ట్విట్ట‌ర్ అభ్యంత‌రం తెలిపింది. కంగ‌నాను ట్విట్ట‌ర్ నుండి స‌స్పెండ్ చేస్తkangana ranaut;nithya new;tara;bharatiya janata party;pakistan;west bengal - kolkata;bollywood;shiv sena partyఅక్క‌డ వ‌ద్ద‌న్నారు.. ఇక్క‌డ స్వాగ‌తం ప‌లుకుతున్నారు..అక్క‌డ వ‌ద్ద‌న్నారు.. ఇక్క‌డ స్వాగ‌తం ప‌లుకుతున్నారు..kangana ranaut;nithya new;tara;bharatiya janata party;pakistan;west bengal - kolkata;bollywood;shiv sena partyWed, 05 May 2021 15:57:26 GMTబాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ అంటే అభిమానుల‌కు పండుగ‌, ప‌లువురు హీరోల‌కు, రాజ‌కీయ పార్టీల‌కు ద‌డ‌. ఆమె నిత్యం సోష‌ల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతారు. ఇటీవ‌లి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంపై కంగ‌నా తీవ్ర‌స్థాయిలో ట్విట్ట‌ర్ వేదిక‌గా కామెంట్లు చేశారు. ముంబైని పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌తో పోల్చిన కంగ‌నాపై మ‌హారాష్ట్ర నేత‌లు మండిప‌డ్డారు. ముంబ‌యిలో అడుగుపెట్ట‌నివ్వ‌మ‌ని శివ‌సేన శ్రేణులు ప్ర‌క‌ట‌న‌లు చేశారు. భారీ భ‌ద్ర‌త న‌డుమ కంగ‌నా ముంబ‌యి చేరుకోవాల్సి వ‌చ్చింది. ఈ విష‌యం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. ప‌లుసార్లు ట్విట్ట‌ర్ వేదిక‌గా వివాదాస్ప‌ద కామెంట్ల‌తో కంగ‌నా వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్నారు.

తాజాగా కంగ‌నా మ‌రో వివాదాస్ప‌ద ట్వీట్ చేశారు. వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని కంగ‌నా ఓ రాక్ష‌సిగా అభివ‌ర్ణించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో వెంట‌నే రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని, అస్సాం, పుదుచ్చేరిల్లో బీజేపీ గెలిచినా అక్క‌డ హింస చెల‌రేగ‌లేద‌ని అన్నారు. ప‌శ్చిమ బెంగాల్‌లో మాత్రం టీఎంసీ హింస‌కు దిగుతోంద‌ని కంగ‌నా ట్వీట్ చేసింది. బెంగాల్ మంట‌ల్లో కాలిపోతుందంటూ కంగ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కంగ‌నా వ్యాఖ్య‌ల‌పై ట్విట్ట‌ర్ అభ్యంత‌రం తెలిపింది. కంగ‌నాను ట్విట్ట‌ర్ నుండి స‌స్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల ఫ‌లితాల సంద‌ర్భంగా కంగ‌నా అభ్యంత‌ర‌క‌ర ట్వీట్లు చేయ‌డంతో ఆమె అకౌంట్‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు ట్విట్ట‌ర్ యాజ‌మాన్యం తెలిపింది.

ఈ క్ర‌మంలో ట్విట్ట‌ర్‌కు పోటీగా వ‌చ్చిన దేశీ యాప్ కూ కంగ‌నాను త‌మ యాప్‌లో అకౌంట్ ఓపెన్ చేయాల్సిందిగా ఆహహ్వానించింది. కంగ‌న త‌న అభిప్రాయాల‌ను స‌గ‌ర్వంగా కూ లో పంచుకోవ‌చ్చున‌ని ఆ యాప్ కోఫౌండ‌ర్ రాధాకృష్ణ‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కంగ‌నా జీ ఇది మీ ఇల్లు , మీ అభిప్రాయాల‌ను అంద‌రికీ స‌గ‌ర్వంగా తెలియ‌జేయండి అని రాధాకృష్ణ‌న్ పేర్కొన్నారు. దీంతో కంగ‌నా కూ యాప్ ద్వారా మ‌రెన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒక్కమాట వల్ల రూ.1.2 కోట్లు నష్టం..?

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>