PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-c5bbea5d-46f7-483a-8de4-0869b659591f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-c5bbea5d-46f7-483a-8de4-0869b659591f-415x250-IndiaHerald.jpgతిరుపతి ఫలితం వైసీపీకి అనుకూలంగా వచ్చింది. మెజారిటీ కూడా గతం కంటే చాలా ఎక్కువగానే వచ్చింది. అయితే జగన్ కోరుకున్నట్లుగా అయిదు లక్షల మెజారిటీ సాధ్యపడలేదు. అయినా వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత కూడా ఇంత మంచి మెజారిటీ రావడం అంటే అది చాలా గొప్ప విషయంగానే చెప్పాలి. jagan;tiru;jagan;mp;district;tirupati;assembly;husband;ycp;partyవైసీపీ నేతలకు జగన్ మార్క్ వార్నింగ్... ?వైసీపీ నేతలకు జగన్ మార్క్ వార్నింగ్... ?jagan;tiru;jagan;mp;district;tirupati;assembly;husband;ycp;partyWed, 05 May 2021 20:00:00 GMTతిరుపతి ఫలితం వైసీపీకి అనుకూలంగా వచ్చింది. మెజారిటీ కూడా గతం కంటే చాలా ఎక్కువగానే వచ్చింది. అయితే జగన్ కోరుకున్నట్లుగా అయిదు లక్షల మెజారిటీ సాధ్యపడలేదు. అయినా వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత కూడా ఇంత మంచి మెజారిటీ రావడం అంటే అది చాలా గొప్ప విషయంగానే చెప్పాలి.

ఇదిలా ఉంటే తిరుపతి కొత్త ఎంపీ గురుమూర్తి సహా చిత్తూరు జిల్లా నేతలు జగన్ని తాజాగా కలసిన నేపధ్యంలో  జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. గతంలో ఒక ఎంపీ తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను కలుపుకుని పోకుండా ప్రజలతో కనెక్ట్ కాకుండా ఒంటెద్దు పోకడలు పోయారని జగన్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఎంపీ ఎవరో కానీ ఆయన్ని చూపించి గురుమూర్తికి జగన్ ఎన్నో సూచనలు ఇచ్చారట. అందరితో కలసి ఉండాలని, కలసికట్టుగా పార్టీని అభివృద్ధి చేయాలని కూడా జగన్ ఆదేశించారుట.

ప్రజలతో ఉంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్ళే వారికే అవకాశాలు అని జగన్ అన్నట్లుగా వార్తలు వచ్చాయి. మరి దీని బట్టి చూస్తూంటే ఎమ్మెల్యేల‌, ఎంపీల చిట్టా జగన్ వద్ద భద్రంగా ఉందని అంటున్నారు. అదే టైమ్ లో ఎవరి పనిచేయలేదో వారి విషయంలో తాను సీరియస్ గానే ఉంటాను అని జగన్ తన మాటల ద్వారా చెబుతున్నారు అంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది. ఇప్పటికైనా నాయకులు రూట్లోకి వచ్చి జనంలో ఉండకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవన్నదే జగన్ మార్క్ హెచ్చరిక అంటున్నారు. చూడాలి మరి నేతలు ఎలా సర్దుకుంటారో. ఏది ఏమైనా తిరుపతి మెజారిటీ పట్ల జగన్ అంత సంతృప్తిగా లేరు అన్న మాట అయితే వినిపిస్తోంది. కొన్ని అసెంబ్లీ సెగ్మంట్లలో మెజారిటీ తగ్గడం పట్ల కూడా ఆయన ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. రానున్న రోజుల్లో  ఇవన్నీ కొలమానాలుగానే ఉంటాయని అంటున్నారు.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాష్ట్ర ప్రభుత్వాలకు నమ్రత సలహా.!

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>