MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-to-romance-with-two-heroinesfd5b053a-3cf3-43cd-876d-c1409057793c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-to-romance-with-two-heroinesfd5b053a-3cf3-43cd-876d-c1409057793c-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ఈ పేరు తెలియని వారుండరు. బాలయ్య ఫైట్స్, డైలాగ్‌లకు అభిమానులు కాదు భక్తులున్నారనడంలో అతిశయోక్తి ఏమీలేదు. తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బిగ్ స్క్రీన్‌పై బాలయ్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే బాలయ్య సినిమా రిలీజ్ అంటే థియేటర్ల దగ్గర అభిమానులు హోరెత్తుతారు. ఎలాగైన బాలయ్య సినిమాను ఫస్ట్‌ డే ఫస్ట్ షో చూడాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా..akhanda;balakrishna;gopichand;boyapati srinu;tara;korcha;cinema;nandamuri balakrishna;director;letter;heroine;mythri movie makers;nandamuri taraka rama rao;raccha;krackబాలయ్య పక్కన ఆ ఇద్దరు భామలు.. ఇక రచ్చ రచ్చే..బాలయ్య పక్కన ఆ ఇద్దరు భామలు.. ఇక రచ్చ రచ్చే..akhanda;balakrishna;gopichand;boyapati srinu;tara;korcha;cinema;nandamuri balakrishna;director;letter;heroine;mythri movie makers;nandamuri taraka rama rao;raccha;krackWed, 05 May 2021 13:06:23 GMTఇంటర్నెట్ డెస్క్: నందమూరి బాలకృష్ణ ఈ పేరు తెలియని వారుండరు. బాలయ్య ఫైట్స్, డైలాగ్‌లకు అభిమానులు కాదు భక్తులున్నారనడంలో అతిశయోక్తి ఏమీలేదు. తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బిగ్ స్క్రీన్‌పై బాలయ్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే బాలయ్య సినిమా రిలీజ్ అంటే థియేటర్ల దగ్గర అభిమానులు హోరెత్తుతారు. ఎలాగైన బాలయ్య సినిమాను ఫస్ట్‌ డే ఫస్ట్ షో చూడాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తూనే మరో సినిమాను బాలయ్య ఓకే చేశాడు.

బాలకృష్ణ తన తర్వాతి సినిమాను చేస్తుంది ఎవరితోనో కాదండి.. ఈ ఏడాది క్రాక్ సినిమాతో భారీ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేనితో. వీరి కాంబోలో రానున్న సినిమాను వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నారంట. అందుకోసం దర్శకుడు వేటపాలెంలోని ఓ పాత గ్రంథాలయానికి వెళ్లిన మరీ కొత్త కాన్సెప్టు పట్టుకొచ్చాడని టాక్. దాని ఆధారంగానే తన సినిమా స్క్రిప్ట్‌ను కూడా  గోపీచంద్ మలినేని పూర్తి చేశాడని, సినిమాను ప్రారంభించేందుకు సర్వం సిద్దంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. బాలయ్య ఓకే అనడమే మిగిలుందట. ఆయన ఓకే అనగానే సినిమా ప్రారంభించేయాలని గోపీచంద్ మలినేని కాచుకుని కూర్చున్నాడట. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన చేస్తుంది ఒక్క హీరోయిన్ కాదనీ, బాలయ్య ఇద్దరు భామలతో ఆడిపాడనున్నాడని టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుందని కూడా టాక్ ఉంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి చేసుకున్న వెంటనే గోపీచంద్ మలినేని సినిమా ప్రారంభించనున్నాడంట. అయితే గోపీచంద్, బాలయ్య కాంబో సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా గోపీచంద్ మునుపటి సినిమా తరహాలో పక్కా యాక్షన్ మూవీగా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సోనూ సూద్.. ఆ కోవిడ్ పేషెంట్ ని..!!

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>