EditorialMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpgటీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు రాజ‌కీయ వ్యూహాలు కొట్టిన పిండి. భ‌విష్యత్తులో త‌న‌కు ఎదురొస్తార‌ని అనుమానం వ‌చ్చిన నాయ‌కులు సొంత పార్టీలో ఉన్నాఆయ‌న వారిని శంక‌ర‌గిరి మాన్యాలు ప‌ట్టించేదాకా వ‌దిలిపెట్ట‌ర‌ని ఆయ‌న‌తో స‌న్నిహితంగా ఉన్న‌వారు చెపుతారు. గ‌తంలో ఉద్య‌మ కాలంలో కేసీఆర్‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న ప‌లువురు కీల‌క నేత‌లు ఆ త‌రువాత పార్టీకి దూరం కావ‌డం వెనుక ఆయ‌న వ్యూహ‌ర‌చ‌నే కార‌ణ‌మ‌ని అంటారు. RevanthandEtela;view;kcr;revanth;soumya;sowmya;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;government;media;minister;letter;central government;sara shrawan;etela rajender;party;youth;tangirala sowmyaరేవంత్, ఈటెల క‌లిస్తే కేసీఆర్‌కు గండ‌మేనా..?రేవంత్, ఈటెల క‌లిస్తే కేసీఆర్‌కు గండ‌మేనా..?RevanthandEtela;view;kcr;revanth;soumya;sowmya;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;government;media;minister;letter;central government;sara shrawan;etela rajender;party;youth;tangirala sowmyaWed, 05 May 2021 21:56:00 GMTటీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు రాజ‌కీయ వ్యూహాలు కొట్టిన పిండి. భ‌విష్యత్తులో త‌న‌కు ఎదురొస్తార‌ని అనుమానం వ‌చ్చిన నాయ‌కులు సొంత పార్టీలో ఉన్నాఆయ‌న వారిని శంక‌ర‌గిరి మాన్యాలు ప‌ట్టించేదాకా వ‌దిలిపెట్ట‌ర‌ని ఆయ‌న‌తో స‌న్నిహితంగా ఉన్న‌వారు చెపుతారు. గ‌తంలో ఉద్య‌మ కాలంలో కేసీఆర్‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న ప‌లువురు కీల‌క నేత‌లు ఆ త‌రువాత పార్టీకి దూరం కావ‌డం వెనుక ఆయ‌న వ్యూహ‌ర‌చ‌నే కార‌ణ‌మ‌ని అంటారు. ఆలె న‌రేంద్ర మొద‌లుకుని నాయ‌ని న‌ర‌సింహారెడ్డి దాకా, విజ‌య‌శాంతి మొద‌లు తాజాగా ఈటెల రాజేంద‌ర్ వ‌ర‌కు జ‌రిగింది ఇదే. ఇప్ప‌టిదాకా కేసీఆర్ త‌న వ్యూహాలు గురి త‌ప్ప‌కుండా, రాజ‌కీయంగా త‌న‌కు ఎదురుదెబ్బ‌లు త‌గ‌ల‌కుండా చ‌తురత చూపించ‌గ‌లిగారు. అయితే ఈటెల రాజేంద‌ర్ ఉదంతం మాత్రం అంత తేలిగ్గా స‌మ‌సిపోయే వ్య‌వ‌హారంలా క‌నిపించ‌డంలేదు. సమీప భ‌విష్య‌త్తులో ప‌లు రాజ‌కీయ ప‌రిణామాల‌కు ఇది బీజం వేసే దిశ‌గా సాగుతోంది. తెలంగాణ కోసం ఉద్య‌మం చేసిన‌ వ‌ర్గాల్లో కేసీఆర్ ప్రభుత్వంపై దాగి ఉన్న అసంతృప్తికి తోడు, ఇప్పుడు బీసీల‌తో స‌హా అన్ని వ‌ర్గాల నుంచి ఈటెల‌కు ల‌భిస్తున్న మ‌ద్ద‌తు దీనినే సూచిస్తున్న‌ట్టు రాజకీయ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కేసీఆర్ ప్ర‌భుత్వం త‌న‌ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరు త‌న‌నెంత ఆవేద‌న‌కు గురి చేసిందీ బుధ‌వారం మీడియా సమావేశం లో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అప్ప‌ట్లో ఉద్యమంలో పాల్గొన్న ప‌లువురు కార్య‌క‌ర్త‌లు, నాయకులు త‌న‌వెంట ఉన్నార‌ని, నాటి ఉద్యమ ఘట్టాలను వారు త‌న‌కు గుర్తు చేశార‌ని ఆయ‌న అన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే ఉంటామని వారు భరోసా ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు. తొలినాళ్లలో ఉద్యమానికి ఊపిరినిచ్చిన ప్రాంతం హుజూరాబాద్ అని రాజేంద‌ర్ అన్నారు. ఇదిలా ఉండ‌గా ఇత‌ర పార్టీలు ఈటెల ఎపిసోడ్‌ని ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రాజేంద‌ర్ ను త‌మ పార్టీలో చేర‌మ‌ని ఆహ్వానిస్తున్నట్టుగా కూడా వార్త‌లు వ‌స్తున్నా ఈటెల ఈ అంశాన్ని ఇప్ప‌టిదాకా ధ్రువీక‌రించ‌లేదు.
 
ఇక రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇదే అంశంపై మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. నిబ‌ద్ధ‌త క‌లిగిన నాయ‌కుడిగా సౌమ్యుడిగా పేరున్న రాజేంద‌ర్‌, కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా కొన్నేళ్లుగా మ‌డ‌మ తిప్ప‌ని పోరాటం సాగిస్తున్న రేవంత్‌రెడ్డి క‌లిసి పోరాటం సాగిస్తే కేసీఆర్ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయ‌మేన‌న్న‌ది ఈ చ‌ర్చ‌ల సారాంశం. తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి- కేసీఆర్ కుటుంబం మ‌ధ్య సాగుతున్న రాజ‌కీయ పోరాటం ఎన్న‌డో వ్య‌క్తిగ‌త స్థాయికి చేరుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. రేవంత్‌ని టార్గెట్ చేసిన కేసీఆర్ ఆయ‌న‌ను రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కేందుకు త‌న‌కున్న అధికార బ‌లాన్నిఅన్నిర‌కాలుగానూ వినియోగించారు. అయితే దూకుడు స్వ‌భావ‌మున్న రేవంత్‌రెడ్డి త‌న పార్టీ నాయ‌కుల నుంచి ప‌రిమిత‌మైన మ‌ద్ద‌తు మాత్ర‌మే ఉన్నా.. వాటిని దీటుగా ఎదుర్కొంటూనే కేసీఆర్ పాల‌నను తూర్పార‌బ‌ట్టే ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోకుండా ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెడుతున్నారు. ఇక ఇటీవ‌లే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెలంగాణ యువ‌త ఉద్య‌మ పోరాటం స‌త్తా ఏంటో కేసీఆర్‌కు చ‌వి చూపించిన తీన్మార్ మ‌ల్ల‌న్న వంటివారు రాజేంద‌ర్ వెనుక తాము అండ‌గా నిలుస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో రేవంత్‌రెడ్డి, ఈటెల రాజేంద‌ర్ టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా మ‌రో ప్రాంతీయ పార్టీ గ‌నుక ప్రారంభిస్తే కుటుంబ పాల‌న సాగిస్తున్న‌ పార్టీ పేక‌మేడ‌లా కూలిపోవ‌డం ఖాయ‌మ‌ని సోష‌ల్ మీడియా కేంద్రంగా ప‌లువురు త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రభాస్ డెసిషన్‌తో తండ్రి షాక్.. ఆనందంతో..!

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>