PoliticsSpydereditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mutthi-reddyf5b50a54-1192-4ac9-a536-471e54aa15e1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mutthi-reddyf5b50a54-1192-4ac9-a536-471e54aa15e1-415x250-IndiaHerald.jpgటీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టాపిక్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చలకు దారితీస్తోంది. భూ ఆక్రమణల ఆరోపణలతో ఆయన్ను మంత్రి పదవి నుండి తొలగించడం, పార్టీ నుండి తొలగించడంతో రాజకీయ నేతలు పలు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలు కేసీఆర్ పతనం మొదలైందని కామెంట్ చేస్తుంటే, మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణల గురించి తెరాస ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పంmutthi reddy;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;kamma;telangana;రాజీనామా;mla;minister;local language;reddy;etela rajender;janagama;party;mantraక‌బ్జాలు చేసిన‌ట్లు నిరూపిస్తే ముక్కు నేల‌కు రాస్తా.... బండికి ముత్తిరెడ్డి స‌వాల్‌..క‌బ్జాలు చేసిన‌ట్లు నిరూపిస్తే ముక్కు నేల‌కు రాస్తా.... బండికి ముత్తిరెడ్డి స‌వాల్‌..mutthi reddy;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;kamma;telangana;రాజీనామా;mla;minister;local language;reddy;etela rajender;janagama;party;mantraWed, 05 May 2021 08:38:00 GMTటీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టాపిక్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చలకు దారితీస్తోంది. భూ ఆక్రమణల ఆరోపణలతో ఆయన్ను మంత్రి పదవి నుండి తొలగించడం, పార్టీ నుండి తొలగించడంతో రాజకీయ నేతలు పలు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలు కేసీఆర్ పతనం మొదలైందని కామెంట్ చేస్తుంటే, మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణల గురించి తెరాస ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, తాను కబ్జా చేశానని అంటున్న 60 ఎకరాల్లో గుంట భూమిని చూపించినా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ముత్తిరెడ్డి సవాల్ విసిరారు.


తాను భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే జనగామ చౌరస్తాలో అంబేద్కర్ పాదాల వద్ద ముక్కు నేలకు రాసి రాజీనామా పత్రం అంబేద్కర్ పాదాల వద్ద ఉంచి, కేసీఆర్‌కు అందజేస్తానని ఆయన అన్నారు. జనగామలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానికంగా బతుకమ్మ కుంట, కుమ్మరికుంటలను కబ్జా చేసినట్లు, హన్మంతాపూర్‌లో 60 ఎకరాలు ఆక్రమించినట్లు సంజయ్‌ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. బండి సంజయ్‌ తన భాషను మార్చుకోవాలని హితవు పలికారు. ఆయన భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటారన్నారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేనిపక్షంలో జనగామ చౌరస్తాలో అంబేద్కర్‌ పాదాలకు ముక్కు రాసి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.


 ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితేనే నాగార్జునసాగర్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని బండకేసి కొట్టారని విమర్శించారు. ఈటెల రాజేందర్ వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారగా, తాజాగా ముత్తిరెడ్డి సవాల్ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. మరి ముత్తిరెడ్డి సవాల్‌కు బండి సంజయ్ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి. ఇప్పుడు ముత్తిరెడ్డి వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. గ‌తంలో ప‌లు సంద‌ర్భాల్లో ముత్తిరెడ్డిపై ఆరోప‌ణ‌లు రాగా.. ఇప్పుడు ఆయ‌నే స‌వాల్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో నేటి నుంచి కొత్త రూల్స్.... ఇవే...!

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ

విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో బీజేపీ కొంపముంచిన కారణం తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>