PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kolukunna-kcr-keelaka-nirnayalu-untaya0a1ae68e-d844-4500-8c4c-3e3081da473c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kolukunna-kcr-keelaka-nirnayalu-untaya0a1ae68e-d844-4500-8c4c-3e3081da473c-415x250-IndiaHerald.jpgగ‌త ప‌దిహేను రోజులుగా సీఎం కేసీఆర్ క‌రోనాతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. ఎర్ర‌వ‌ల్లిలోని ఫామ్ హౌస్ నుంచే పాల‌నాప‌ర‌మైన వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెడుతున్నారు. అక్క‌డి నుండే ప‌లు విష‌యాల‌పై అధికారులను ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. తెలంగాణ‌లో క‌రోనా ఉధృతి పెరుగుతున్న క్ర‌మంలో కోవిడ్ క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సీఎస్‌, వైద్య ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారుల‌కు సూచ‌న‌లు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డంతో ఆ శాఖ‌ను కేసీఆరే ప‌ర్య‌వేక్షిస్తున్KCR;kcr;ganga;ganges;cabinet;house;party;mantraకోలుకున్న కేసీఆర్‌.. కీల‌క నిర్ణ‌యాలుంటాయా?కోలుకున్న కేసీఆర్‌.. కీల‌క నిర్ణ‌యాలుంటాయా?KCR;kcr;ganga;ganges;cabinet;house;party;mantraWed, 05 May 2021 06:51:35 GMTసీఎం కేసీఆర్ క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన విష‌యం విధిత‌మే. గ‌త‌నెల 19న సీఎం కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. అప్ప‌టి నుంచి కేసీఆర్ ఎర్ర‌వ‌ల్లిలోని త‌న ఫామ్ హౌస్‌లో వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స పొందుతున్నారు. గ‌త‌వారం మ‌రోసారి ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష నిర్వ‌హించ‌గా క‌చ్చిత‌మైన ఫ‌లితం రాలేదు. తాజాగా మ‌రోసారి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్, ర‌క్త ప‌రీక్ష‌ల నివేదిక‌లు కూడా సాధార‌ణంగా ఉన్నాయ‌ని తేలింది. దీంతో కేసీఆర్ క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్న‌ట్లు వైద్యులు తెలిపారు.

గ‌త ప‌దిహేను రోజులుగా సీఎం కేసీఆర్ క‌రోనాతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. ఎర్ర‌వ‌ల్లిలోని ఫామ్ హౌస్ నుంచే పాల‌నాప‌ర‌మైన వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెడుతున్నారు. అక్క‌డి నుండే ప‌లు విష‌యాల‌పై అధికారులను ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. తెలంగాణ‌లో క‌రోనా ఉధృతి పెరుగుతున్న క్ర‌మంలో కోవిడ్ క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సీఎస్‌, వైద్య ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారుల‌కు సూచ‌న‌లు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డంతో ఆ శాఖ‌ను కేసీఆరే ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ప్ర‌స్తుతం కేసీఆర్ కోలుకోవ‌డంతో వైద్య ఆరోగ్య శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మీక్షించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డికి నైట్ క‌ర్ప్యూ కొన‌సాగుతుంది. దీనివ‌ల్ల కొవిడ్ కేసులు త‌గ్గే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో మ‌ధ్యాహ్నం స‌మ‌యంలోనూ క‌ర్ఫ్యూ విధించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈట‌ల రాజేంద‌ర్‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. దీనిపై తెరాస‌లోనూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నా.. ఎవ‌రూ బ‌హిరంగంగా త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డించే ప‌రిస్థితి లేదు. దీనికితోడు కేసీఆర్‌కు కొవిడ్ సోక‌డంతో అంద‌రికీ దూరంగా ఉంటున్నారు. ప్ర‌స్తుతం కోలుకోవ‌టంతో ముఖ్య నేత‌లు, ప‌లువురు మంత్రుల‌తో కేసీఆర్ భేటీ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఈట‌ల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేద్దామా..?  అలానే ఉండ‌నిద్దామా అనే విష‌యాల‌పై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు సీఎం కేసీఆర్‌పై ఈట‌ల తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. వీటిని ఖండిస్తూ ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్‌లు పెడుతున్నారు. అయినా ప్ర‌జ‌ల్లో ఈట‌ల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌న్న భావ‌న ఉంది. దీనిని గ‌మ‌నించిన కేసీఆర్‌.. తానే స్వ‌యంగా ప్రెస్‌మీట్ పెట్టి ప్ర‌జ‌ల‌కు వివ‌రాల‌ను వెల్ల‌డిస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లికి ముందే తల్లితండ్రులైన సెలబ్రిటీలు వీళ్లే..!

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ

విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో బీజేపీ కొంపముంచిన కారణం తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>