PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviruscd1e822f-e0b5-468c-b644-a53d3ac9c984-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviruscd1e822f-e0b5-468c-b644-a53d3ac9c984-415x250-IndiaHerald.jpgఅనుకున్న విధంగానే కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను అమలులోకి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతుండడం, రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతుండడం అలాగే మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కారు. CORONAVIRUS;amala akkineni;nithya new;andhra pradesh;letter;narasaraopet;pettaఏపీలో త్వరలోనే పూర్తి స్థాయి లాక్ డౌన్ ?ఏపీలో త్వరలోనే పూర్తి స్థాయి లాక్ డౌన్ ?CORONAVIRUS;amala akkineni;nithya new;andhra pradesh;letter;narasaraopet;pettaWed, 05 May 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతుండడం, రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతుండడం అలాగే మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కారు. నేటి నుండి కిరాణా షాపులకు, ప్రజల నిత్య అవసరాల కోసం, ప్రజల రోజువారీ కార్యక్రమాల నిమిత్తం మధ్యాహ్నం 12 వరకు అనుమతిని ఇచ్చింది. అనంతరం 12 తర్వాత కర్ఫ్యూ కొనసాగుతుందని ఆదేశాలు జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రజలు 12 తర్వాత రోడ్లపైకి రాకూడదని నిబంధనలు విధించారు. మరో వైపు పోలీసు అధికారులు సైతం ప్రజా రక్షణ కొరకు 12 తర్వాత కర్ఫ్యూ సక్రమంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
 
అయితే నరసరావుపేట ,రొంపిచర్ల మండలాలలో మాత్రం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకే ప్రజల నిత్య అవసరాల కోసం, వ్యాపారాలు, ఇతర పనులకు అనుమతిస్తున్నారు. అనంతరం ఉదయం 8 నుండి రోజంతా పూర్తిగా  కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.  రొంపిచర్ల, నరసరావుపేట మండలాలలోని పలు గ్రామాల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదువుతుండడం, కరోనా మరణాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి అధికారులు ఇలా కర్ఫ్యూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎస్‌ఐ పి.హజరత్తయ్య ఆధ్వర్యంలో ఈ కర్ఫ్యూ సరిగ్గా జరిగేలా 8 తర్వాత ఎవరూ రోడ్లపై కనపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా రానున్న రోజుల్లో రాష్ట్రమంతా ఇదే తరహాలో కర్ఫ్యూ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న కరోనా విజృంభణకు కళ్లెం వేసే దిశలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా లాక్ డౌన్ అంటే ప్రజలు ఇబ్బంది, కంగారు పడతారని కొద్ది రోజులు కర్ఫ్యూ విధించి ఆ తర్వాత పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలులోకి తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా తీవ్రత తగ్గించి  ప్రజల్ని  కాపాడాలంటే లాక్ డౌన్ తప్పనిసరి అని  ఆరోగ్యనిపుణులు సూచిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రభుత్వం త్వరలో తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏమౌతుందో చూడాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మ‌న వాళ్ల‌ను ఇలా ఎలా చంపుకుంటాం : హైకోర్టు ఆగ్రహం

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>