EditorialThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/etela-rajender45686bae-31d7-45f2-bbf5-0fcd04625354-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/etela-rajender45686bae-31d7-45f2-bbf5-0fcd04625354-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఈట‌ల రాజేంద‌ర్ ఎపిషోడ్ చూస్తుంటే ఇదే విష‌యం అర్థ‌మ‌వుతుంది. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ప్ర‌తీనిర్ణ‌యం ఈట‌లకు ప్ర‌జ‌ల్లో సానుభూతిని పెంచుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. తాజా ప‌రిణామాల‌న్నీ చూస్తున్న ప్ర‌జ‌లు ఈట‌ల‌పై సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నారు. అయ్యో.. కేసీఆర్ ఇంత మూర్ఖంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడా.. 20యేళ్లు త‌న‌వెంట తిప్పుకొని ఇప్పుడు పార్టీ నుంచి ఈట‌ల‌ను బ‌య‌ట‌కు పంపేందుకు కుట్ర చేస్తున్నాడా అన్న భావ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోయింది.etela rajender;view;kcr;bharatiya janata party;2019;tdp;partyసానుభూతే ఈట‌ల అస్త్రం.. కేసీఆర్ ప‌త‌నానికి కార‌ణ‌మ‌వుతుందా?సానుభూతే ఈట‌ల అస్త్రం.. కేసీఆర్ ప‌త‌నానికి కార‌ణ‌మ‌వుతుందా?etela rajender;view;kcr;bharatiya janata party;2019;tdp;partyWed, 05 May 2021 02:40:48 GMTసానుభూతి..! దేశ రాజ‌కీయాల్లో ఇప్పుడు ఈ ప‌దం ఓ ట్రెడ్‌గా మారింది.. సానుభూతితో ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకోవ‌డం ద్వారా ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తుచేసి అనేక పార్టీలు అధికార పీఠాల‌ను ద‌క్కించుకున్న ఘ‌ట‌న‌లు దేశంలో ఎన్నో ఉన్నాయి. రాజ‌కీయ వ్యూహ క‌ర్త‌ ప్ర‌శాంత్ కిషోర్‌లాంటి వారుసైతం ఇదే అస్త్రాన్ని ఆయుధంగా తీసుకొని త‌మ‌ను న‌మ్ముకున్న పార్టీల‌ను విజ‌య తీరాల‌కు చేర్చుతున్నారు. అయ్యే పాపం.. ఇలా జ‌రిగిందా..? ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారా? అన్న భావ‌న‌ను  ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి వారి ఓట్ల‌ను ఆటోమెటిక్‌గా ఈవీఎంల‌లోని త‌మ పార్టీ గుర్తుల‌పై ప‌డేలా చేస్తున్నారు. భార‌త్‌లో సానుభూతికి అంత‌టి ప‌వ‌ర్ ఉంది. తాజాగా ఈట‌ల‌సైతం ఇదే అస్త్రాన్ని కేసీఆర్‌పై ప్ర‌యోగిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

భార‌త్‌లో అనేక ఎన్నిక‌ల్లో సానుభూతితో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి అధికార పీఠాల‌ను ద‌క్కించుకున్న పార్టీలు అనేకం ఉన్నాయి. ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి గెల‌వ‌డానికి కూడా ప్ర‌జ‌ల్లో సానుభూతే కార‌ణమ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటుంటారు. 2014 ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన జ‌గ‌న్‌.. 2019 ఎన్నిక‌ల్లో ఊహించ‌ని రీతిలో అత్య‌ధిక స్థానాల‌తో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. దీనికి ప్ర‌ధాన కార‌ణం అప్ప‌టి అధికార టీడీపీ చేసిన త‌ప్పిదాల‌కంటే జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి సానుభూతి అనే అస్త్రంతో వెళ్ల‌ట‌మే. తాజాగా ప‌శ్చిమ బెంగాల్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌మ‌త బెన‌ర్జీ ఇదే అస్త్రాన్ని ప్ర‌యోగించారు. త‌న‌పై బీజేపీ కార్య‌క‌ర్త‌లు దాడిచేశారంటూ.. కాలుకు క‌ట్టుక‌ట్టుకొని వీల్‌చైర్‌పైనే రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం నిర్వ‌హించింది. దాడి సంగ‌తి అలా ఉంచితే ప్ర‌జ‌ల్లో మాత్రం మ‌మ‌త‌పై ఒక్క‌సారిగా సానుభూతి ఏర్ప‌డింది. ఓ మ‌హిళ‌ను బీజేపీ ఇంత‌లా హింసిస్తుందా అన్న భావ‌న అక్కడి ప్ర‌జ‌ల్లో నాటుకుంది. దీంతో టీఎంసీ గెలుపులో సానుభూతి అస్త్రం ఓ కార‌ణంగా మారింది.

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఈట‌ల రాజేంద‌ర్ ఎపిషోడ్ చూస్తుంటే ఇదే విష‌యం అర్థ‌మ‌వుతుంది. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ప్ర‌తీనిర్ణ‌యం ఈట‌లకు ప్ర‌జ‌ల్లో సానుభూతిని పెంచుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. తాజా ప‌రిణామాల‌న్నీ చూస్తున్న ప్ర‌జ‌లు ఈట‌ల‌పై సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నారు. అయ్యో.. కేసీఆర్ ఇంత మూర్ఖంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడా.. 20యేళ్లు త‌న‌వెంట తిప్పుకొని ఇప్పుడు పార్టీ నుంచి ఈట‌ల‌ను బ‌య‌ట‌కు పంపేందుకు కుట్ర చేస్తున్నాడా అన్న భావ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు ఈట‌ల పేరు ఎవ‌రి నోట విన్నా అయ్యో ఈట‌ల అంటున్న ప‌రిస్థితి. ప్ర‌జ‌ల్లో ఉన్న ఇదే సానుభూతిని ఈట‌ల క్యాష్ చేసుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌జ‌ల్లో మ‌రింత సానుభూతిని ర‌గిల్చేలా మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తుంది. దీంతో కేసీఆర్ ప‌త‌నానికి సానుభూతి అనే అస్త్రం కార‌ణ‌మ‌వుతుందా అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సబ్బం హరి విషయంలో విమర్శలపాలవుతున్న వైసీపీ కార్యకర్తలు..

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>