PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bala-krishna-ntr-jr-ntr-2a9d0c34-cdc5-4f0c-883f-031871285ea3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bala-krishna-ntr-jr-ntr-2a9d0c34-cdc5-4f0c-883f-031871285ea3-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడూ ఆసక్తి కలిగించే వార్తే. తాజాగా జూనియర్ పెళ్లిరోజు సందర్భంగా మరోసారి ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ పుంజుకోకపోవడం.. సార్వత్రిక ఎన్నికల తర్వాత, స్థానిక ఎన్నికల వరకు పార్టీ ప్రాభవం తగ్గిపోతూ ఉండటంతో టీడీపీకి మెరుగైన నాయకత్వం కావాలని ఆశిస్తున్నారు కార్యకర్తలు. ఆమధ్య కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు రావడం గమనార్హం. అయితే కార్యకర్తల డిమాండ్లను చంద్రబాబు వినీ విననట్టుగా bala krishna, ntr, jr ntr,;cbn;ntr;lokesh;balakrishna;jr ntr;tiru;telangana;cinema;tirupati;kuppam;husband;tdp;local language;lokesh kanagaraj;nandamuri taraka rama rao;partyఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ బాలయ్యకు ఇష్టమా..? కష్టమా..?ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ బాలయ్యకు ఇష్టమా..? కష్టమా..?bala krishna, ntr, jr ntr,;cbn;ntr;lokesh;balakrishna;jr ntr;tiru;telangana;cinema;tirupati;kuppam;husband;tdp;local language;lokesh kanagaraj;nandamuri taraka rama rao;partyWed, 05 May 2021 08:00:00 GMTజూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడూ ఆసక్తి కలిగించే వార్తే. తాజాగా జూనియర్ పెళ్లిరోజు సందర్భంగా మరోసారి ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ పుంజుకోకపోవడం.. సార్వత్రిక ఎన్నికల తర్వాత, స్థానిక ఎన్నికల వరకు పార్టీ ప్రాభవం తగ్గిపోతూ ఉండటంతో టీడీపీకి మెరుగైన నాయకత్వం కావాలని ఆశిస్తున్నారు కార్యకర్తలు. ఆమధ్య కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు రావడం గమనార్హం. అయితే కార్యకర్తల డిమాండ్లను చంద్రబాబు వినీ విననట్టుగా ఉన్నా.. ఆ తర్వాత పార్టీలో పెద్ద చర్చ జరిగిందని అంటారు.

ఎన్టీఆర్ రీఎంట్రీ ఎంతమందికి ఇష్టం..?
నారావారి చేతుల్లోనుంచి నందమూరి వారి చేతుల్లో టీడీపీని పెట్టడం చంద్రబాబుకి సుతరామూ ఇష్టం లేదు. అందుకే ఆయన లోకేష్ ఒక్కరే పార్టీకి భావి నాయకుడు అనేలా సీన్ క్రియేట్ చేశారు. బాలకృష్ణ సహా నందమూరి వారసులెవరూ పార్టీపై చంద్రబాబుకి ఎదురు చెప్పకుండా చేసుకున్నారు. బాలకృష్ణ కూడా తన అల్లుడికే టీడీపీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని అనుకుంటారు. ఎన్టీఆర్ టీడీపీలో క్రియాశీలకంగా మారితే కచ్చితంగా అది లోకేష్ కి ఇబ్బందికరంగా ఉంటుందనేది చంద్రబాబు, బాలకృష్ణ ఆలోచన. అందుకే వారెప్పుడూ ఎన్టీఆర్ ని టీడీపీ కార్యక్రమాలకు ఆహ్వానించలేదు. తమకి తాముగా జూనియర్ ని హైలెట్ చేయాలనుకోలేదు.

ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. సొంత సోదరి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లలేదంటే.. రాజకీయాలకు ఆయన ఎంత దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారో అర్థమవుతుంది. అయితే అదే సమయంలో తాత పెట్టిన పార్టీకి పునర్వైభవం తేవడం కూడా ఎన్టీఆర్ బాధ్యత అనేవారు కూడా ఉన్నారు. ఇది జరగాలంటే.. ఎన్టీఆర్ కి టీడీపీలో బలమైన మద్దతు కావాలి. ఆ మద్దతు చంద్రబాబునుంచి ఊహించలేం. బాలకృష్ణ, ఎన్టీఆర్ కి మద్దతుగా నిలిచి, పార్టీ పునర్వైభవం కోసం కృషిచేస్తే.. ఎన్టీఆర్ రీఎంట్రీ సాధ్యమవుతుందనేది కొంతమంది వాదన. అయితే ఇది ఇప్పుడప్పుడే జరిగేలా లేదు. సాఫీగా సాగిపోతున్న సినిమా కెరీర్ ని పణంగా పెట్టి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని అనుకోవడం కష్టం. సినీ, పొలిటికల్ కెరీర్ రెండిటినీ బ్యాలెన్స్ చేయాల్సినంత అవసరం ఇప్పుడు ఎన్టీఆర్ కి లేదు. మొత్తమ్మీద ఎన్టీఆర్ పొలిటికల్ రీఎంట్రీ ఎప్పుడనేది పార్టీ డిమాండ్ పైనే ఆధారపడి ఉంటుంది, బాలకృష్ణ మద్దతు కూడా దానికి బాగానే అవసరం ఉంటుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌బ్జాలు చేసిన‌ట్లు నిరూపిస్తే ముక్కు నేల‌కు రాస్తా.... బండికి ముత్తిరెడ్డి స‌వాల్‌..

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ

విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో బీజేపీ కొంపముంచిన కారణం తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>