India Corona Updates: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాల సంఖ్య

India Corona Updates: దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా పరిస్థితులు భయంకరంగా మారుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్(Corona Second Wave)విరుచుకుపడుతోంది. దేశంలో వినాశకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.కేసుల సంఖ్య పెరిగే కొద్దీ పరిస్థితులు వికటిస్తున్నాయి. ఓ వైపు ఆక్సిజన్ కొరత రెండోవైపు అత్యవసర మందులు, బెడ్స్ కొరత వేటాడుతోంది.దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్(Oxygen Shortage) అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇదే పరిస్థితి నెలకొంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నిన్నటితో పోలిస్తే ఇండియాలో కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో దేశంలో 3 లక్షల 82 వేల 315 కేసులు నమోదు కాగా..3 వేల 780 మంది మరణించారు. 

దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 6 లక్షల 65 వేలకు ( India Corona Updates)చేరుకుంది. మరణాల సంఖ్య. 2 లక్షల 26 వేల 188కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 34 లక్షల 87 వేల యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 15 లక్షల 41 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు ( Covid19 Tests) నిర్వహించగా..ఇప్పటివరకూ దేశంలో 29 కోట్ల 48 లక్షల 52 వేల పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకూ 16 కోట్ల 49 లక్షల మంది వ్యాక్సిన్( Vaccination) తీసుకున్నారు. దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మరికొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ పాటిస్తున్నాయి. ఏపీలో నేటి నుంచి కర్ఫ్యూ(Ap Curfew)అమలవుతోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్(Lockdown) ప్రకటించడం ఒక్కటే కరోనా వైరస్ సంక్రమణ ఛైన్‌ను అడ్జుకుంటుందని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెబుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link – https://bit.ly/3hDyh4G

Apple Link – https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More | https://zeenews.india.com/telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *