PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andhrapradesh9f5787c4-8739-4932-b223-c36191282bdf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andhrapradesh9f5787c4-8739-4932-b223-c36191282bdf-415x250-IndiaHerald.jpgవైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజాకు ఇటీవల రెండు శస్త్ర చికిత్సలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే మామూలు రోజుల్లో నిత్యం అధికారిక కార్యక్రమాలు, రాజకీయాలతో పాటు జబర్దస్త్ షో హోస్ట్ చేస్తూ బిజీగా ఉండే ఆమె.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో కరోనా కేసులు కూడా విజృంభిస్తున్న సమయంలో నియోజకవర్గ సమస్యలపై దృష్టిపెట్టిన ఆమె.. సరికొత్త సాంప్రదాయానికి తెరతీశారు. తన నియోజకవర్గ సమస్యలు, కరోనా కట్టడి కోసం ఇంటి andhrapradesh;nithya new;roja;jabardasth;police;mla;ayurveda;house;nagariసర్జరీ ఎఫెక్ట్ : స్టైల్ మార్చిన రోజాసర్జరీ ఎఫెక్ట్ : స్టైల్ మార్చిన రోజాandhrapradesh;nithya new;roja;jabardasth;police;mla;ayurveda;house;nagariWed, 05 May 2021 16:00:00 GMTవైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజాకు ఇటీవల రెండు శస్త్ర చికిత్సలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే మామూలు రోజుల్లో నిత్యం అధికారిక కార్యక్రమాలు, రాజకీయాలతో పాటు జబర్దస్త్ షో హోస్ట్ చేస్తూ బిజీగా ఉండే ఆమె.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారు. 


ఈ క్రమంలో కరోనా కేసులు కూడా విజృంభిస్తున్న సమయంలో నియోజకవర్గ సమస్యలపై దృష్టిపెట్టిన ఆమె.. సరికొత్త సాంప్రదాయానికి తెరతీశారు. తన నియోజకవర్గ సమస్యలు, కరోనా కట్టడి కోసం ఇంటి నుంచి ఆన్ లైన్లో ఆమె పనిచేస్తున్నారు. 10 రోజుల క్రితం వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలుపెట్టిన ఆమె.. ఆన్ లైన్ ద్వారా అధికారులు, నేతలతో టచ్ లో ఉంటున్నారు. నగరి నియోజకవర్గంలో ముఖ్యమైన పట్టణమైన పుత్తూరు మున్సిపాలిటీ అధికారులు, నేతలతో ఆమె తాజాగా జూమ్ మీటింగ్ ద్వారా సమావేశమయ్యారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 


అంతే కాక రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న కోవిడ్ టీకాలను వేసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని రోజా తన నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా సోకిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టెస్ట్ చేసుకోకుండా హోమియోపతి, ఆయుర్వేదం, నాటు వైద్యం తదితర చికిత్సలు చేసుకోవడం మంచిది కాదని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎక్కువ యువత కూడా ప్రాణాలు కోల్పోతున్నారని, వారి వల్ల కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై అనవసరంగా తిరిగే వారిపై, మాస్కులు ధరించని వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె కోరారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కమల్ ని ఓడించిన ఆ మహిళ నేపథ్యం ఇదే..!

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>