PoliticsSpydereditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrlo-marpu-theesukuvachina-vaiphalyalu0b7629e7-d2f6-477f-9154-7e7180b831d4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrlo-marpu-theesukuvachina-vaiphalyalu0b7629e7-d2f6-477f-9154-7e7180b831d4-415x250-IndiaHerald.jpgప్రత్యక్ష రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు రాబోతున్నారు? ఈ ప్రశ్నలు ఆయ‌న అభిమానులు, టీడీపీ నేత‌ల నుంచి చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కానీ స‌మాధానం దొర‌క‌డం లేద‌నే చెప్పాలి. ఏపీలో టీడీపీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ కష్టాల్లో ఉందని.. ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకంగా మారితే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఎన్నికల ప్రచారంలjr-ntr;cbn;ntr;jr ntr;telangana rashtra samithi trs;telugu desam party;telugu;television;kuppam;tdp;nandamuri taraka rama rao;coffee;partyటీడీపీని నిల‌బెట్ట‌గ‌ల నేత అత‌నొక్క‌డే... మరి రామ‌య్య ఎప్పుడొస్తాడు..?టీడీపీని నిల‌బెట్ట‌గ‌ల నేత అత‌నొక్క‌డే... మరి రామ‌య్య ఎప్పుడొస్తాడు..?jr-ntr;cbn;ntr;jr ntr;telangana rashtra samithi trs;telugu desam party;telugu;television;kuppam;tdp;nandamuri taraka rama rao;coffee;partyWed, 05 May 2021 07:00:00 GMTప్రత్యక్ష రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు రాబోతున్నారు? ఈ ప్రశ్నలు ఆయ‌న అభిమానులు, టీడీపీ నేత‌ల నుంచి చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కానీ స‌మాధానం దొర‌క‌డం లేద‌నే చెప్పాలి. ఏపీలో టీడీపీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ కష్టాల్లో ఉందని.. ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకంగా మారితే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగాలతో అదరగొట్టారు. తాత వారసత్వం పుణికి పుచ్చుకున్న నాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు పొందారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మార్మోగుతోంది. అభిమానులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయనను పదేపదే కోరుతున్నారు.


ఇటీవల పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు చంద్రబాబు ముందే ఎన్టీఆర్ గురించి ప్రస్తావన తెచ్చారు. శాంతిపురం రోడ్ షోలో చంద్రబాబును సార్ సార్ అంటూ పిలిచి మరీ జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకురావాలంటూ అక్కడి కార్యకర్తలు కోరిన విషయం తెలిసిందే.పార్టీకి మళ్లీ కొత్త ఉత్తేజం, ఉత్సాహం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రాక తప్పదనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట ఈ ప్రస్తావన వస్తూనే ఉంది. అయితే అధినేత చంద్రబాబు మనోగతం తెలిసిన నాయకులు మాత్రం ఈ వాదనకు దూరంగా ఉంటున్నారు. కానీ ఇటీవ‌ల వ‌రుస‌గా పంచాయ‌తీ, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ ఏకంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పార్టీ గ‌ల్లంతైంది. దీంతో పార్టీలోకి జూనియ‌ర్ ఎన్టీఆర్ రావాల‌నే డిమాండ్ పెరుగుతోంది.


అయితే రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై జూనియ‌ర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వ‌డం లేదు. కొద్దిరోజుల క్రితంఓ టీవీ షో కార్య‌క్ర‌మంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారంటూ ఎన్టీఆర్‌ను ప్ర‌శ్నించ‌గా  'ఈ ప్రశ్నను మీరు చాలా సందర్భాల్లో నన్ను అడిగారు. నేను చెప్పే సమాధానం ఏమిటో మీకు బాగా తెలుసు. '‘ఇది సమయం కాదు.. సందర్భమూ కాదు’'. తర్వాత తీరిగ్గా ఓరోజు కాఫీ తాగుతూ మనమే సరదాగా కబుర్లు చెప్పుకుందాం' అని స్ప‌ష్ట‌త ఇవ్వ‌కుండా విష‌యాన్ని దాటేశారు.  పొలిటిక‌ల్ ఎంట్రీపై స‌స్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెలతో రాహుల్ గాంధీ చర్చలు...?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ

విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో బీజేపీ కొంపముంచిన కారణం తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>