PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaishankar-covid-1936725070-73a2-40c6-89c2-9d2b14f989bb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaishankar-covid-1936725070-73a2-40c6-89c2-9d2b14f989bb-415x250-IndiaHerald.jpgభారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెళ్లిన బ్రిటన్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఆయనతో పాటు మరికొందరు కూడా బ్రిటన్ పర్యటనలో పాలుపంచుకున్నారు. జైశంకర్, అతడి బృందం నాలుగు రోజుల పర్యటన కోసం సోమవారం బ్రిటన్ చేరుకున్నారు. అయితే జైశంకర్ నేతృత్వంలోని బృందంలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని నిర్ధరణ అయింది. దాంతో కరోనా ఇతరులకు సోకకుండా..jaishankar covid-19;subrahmanyam jaishankar;london;minister;jaishankar;mantraబ్రిటన్‌లో భారత మంత్రి.. ఏదైనా ఆన్‌లైన్‌లోనే..బ్రిటన్‌లో భారత మంత్రి.. ఏదైనా ఆన్‌లైన్‌లోనే..jaishankar covid-19;subrahmanyam jaishankar;london;minister;jaishankar;mantraWed, 05 May 2021 20:27:45 GMTలండన్ : భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెళ్లిన బ్రిటన్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఆయనతో పాటు మరికొందరు కూడా బ్రిటన్ పర్యటనలో పాలుపంచుకున్నారు. జైశంకర్, అతడి బృందం నాలుగు రోజుల పర్యటన కోసం సోమవారం బ్రిటన్ చేరుకున్నారు. అయితే జైశంకర్ నేతృత్వంలోని బృందంలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని నిర్ధరణ అయింది. దాంతో కరోనా ఇతరులకు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జైశంకర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తాను హాజరు కానున్న అన్ని సమావేశాలను ఇకనుంచి వర్చువల్ పద్దతిలోనే నిర్వహించాలని తెలిపారు.

తన బృందంలో వారికి కోవిడ్-19 పాజిటివ్ అన్న విషయం తనకు తెలిసిన వెంటనే ముందస్తు చర్యలు తీసుకున్నామని, అందులో భాగంగా తాను హాజరుకానున్న అన్ని సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుపుతానని తెలిపారు. ఆఖరి జీ7 సదస్సు అయినా తాను వర్చువల్‌గానే హాజరు అవుతానని జైశంకర్ చెప్పారు. జైశంకర్ బృందానికి సంబంధించిన మరికొన్ని పరీక్షల ఫలితాలు రావాలసి ఉన్నాయని సమాచారం.

అయితే జీ7, విదేశాంగ అభివృద్దికి సంబంధించిన సమావేశంలో అతిథిగా పాల్గొనాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ ఆహ్వానించారు. డొమినిక్ ఆహ్వానం మేరకు జైశంకర్, అతని బృందం సోమవారం బ్రిటన్ చేరుకుంది. ఈ పర్యటన నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా గురువారం జైశంకర్, డొమినిక్‌తో భేటి కానున్నారు. కానీ ఇంతలోనే బృందంలోని వారికి కరోనా సోకడంతో వీరి సమావేశం వర్చువల్‌గా జరిగేందుకు అవకాశం ఉంది.

అయితే నేడు జైశంకర్ జీ7లోని దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశం కావలసి ఉంది. కానీ జైశంకర్ బృందంలోని వారికి కరోనా రావడంతో జైశంకర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫారిన్ కామన్‌వెల్త్ అండ్ డవలప్‌మెంట్ ఆఫీస్ (ఎఫ్‌సీడీఓ) సమావేశంలో యూకే అధికారి స్పందించారు. జైశంకర్ బృందంలో వారికి కరోనా సోకడం చాలా బాధాకర విషయం. ఆ కారణంగా ఆయన మనతో కలిసి సమావేశంలో పాల్గొనలేకపోతున్నారు, ఇక నుంచి అన్ని సమావేశాల్లోనూ జైశంకర్ వర్చువల్‌గా పాల్గొంటారని అన్నారు. అంతేకాకుండా కరోనాను కట్టడి చేసేందుకే మనం ఇటువంటి కఠిన చర్యలు తీసుకున్నామని అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అందులో ఎవరైనా ఎన్టీఆర్ తరువాతే.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>