PoliticsSpydereditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gwmcb5c3c7b5-af07-4b0d-b6aa-82feadf1a155-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gwmcb5c3c7b5-af07-4b0d-b6aa-82feadf1a155-415x250-IndiaHerald.jpgగ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. మొత్తం 66డివిజ‌న్ల‌తో ఉన్న గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లో 48సీట్ల‌ను టీఆర్ ఎస్ పార్టీ ద‌క్కించుకుంది. కాంగ్రెస్ 4, బీజేపీ 10 స్థానాల‌ను, ఇత‌రులు నాలుగు స్థానాల్లో విజ‌యం సాధించారు. మేయ‌ర్ ఎన్నిక టీఆర్ ఎస్ పార్టీకి లాంఛ‌న‌మేన‌ని చెప్పాలి. రేసులో చాలామంది నేత‌ల పేర్లే వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే మాజీ ఎంపీ గుండు సుధారాణి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుండ‌గా.. తాజాగా, వేముల శ్రీనివాస్‌, చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు దిడ్డి కుమార‌స్వామి, ఇtrs;view;sudharani;bharatiya janata party;vaishno devi;dargah sharif;padmasali;padmashali;congress;rajya sabha;mp;backward classes;government;population;kavuru srinivas;partyవ‌రంగ‌ల్ మేయ‌ర్ ప‌ద‌వికి తీవ్ర పోటీ... రేసులో ఎంత‌మందంటే..?!వ‌రంగ‌ల్ మేయ‌ర్ ప‌ద‌వికి తీవ్ర పోటీ... రేసులో ఎంత‌మందంటే..?!trs;view;sudharani;bharatiya janata party;vaishno devi;dargah sharif;padmasali;padmashali;congress;rajya sabha;mp;backward classes;government;population;kavuru srinivas;partyWed, 05 May 2021 08:53:00 GMTగ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. మొత్తం 66డివిజ‌న్ల‌తో ఉన్న గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లో 48సీట్ల‌ను టీఆర్ ఎస్ పార్టీ ద‌క్కించుకుంది. కాంగ్రెస్ 4, బీజేపీ 10 స్థానాల‌ను, ఇత‌రులు నాలుగు స్థానాల్లో విజ‌యం సాధించారు. మేయ‌ర్ ఎన్నిక టీఆర్ ఎస్ పార్టీకి లాంఛ‌న‌మేన‌ని చెప్పాలి. రేసులో చాలామంది నేత‌ల పేర్లే వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే మాజీ ఎంపీ గుండు సుధారాణి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుండ‌గా.. తాజాగా, వేముల శ్రీనివాస్‌, చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు దిడ్డి కుమార‌స్వామి, ఇండ్ల నాగేశ్వ‌ర్‌రావు, బ‌స్వ‌రాజు శిరీష‌, దాస్యం అభిన‌వ్య భాస్క‌ర్ పేర్లు కొత్త‌గా తెర‌పైకి రావ‌డం గ‌మ‌నార్హం.ఈ సారి మేయ‌ర్ స్థానం బీసీ జ‌న‌ర‌ల్‌గా రిజ‌ర్వు అయిన విష‌యం తెలిసిందే.


దీంతో ఆయా సామాజిక వ‌ర్గాల నుంచి టీఆర్ ఎస్ అధిష్ఠానానికి పెద్ద ఎత్తున దర‌ఖాస్తులు దాఖ‌ల‌వుతున్నాయి. ఆశావ‌హులు త‌మ గాడ్ ఫాద‌ర్ల‌తో అధిష్ఠానంలోని పెద్ద‌ల‌కు ట‌చ్‌లో ఉంటున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అనుహ్య నిర్ణ‌యాల‌తో పార్టీ సీనియ‌ర్ల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ ఉంటారు. మ‌రి వ‌రంగ‌ల్ మేయ‌ర్ అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలోనూ అదే పంథా కొన‌సాగుతుంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌హిళ‌ను ఎంపిక చేసే అవ‌కాశం ఉంద‌ని, ప‌ద్మ‌శాలీ వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది.ఇదిలా ఉండ‌గా వరంగల్‌ మహానగర పాలక సంస్థ మేయర్‌ రేసులో రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి పేరు టీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రముఖంగా వినిపిస్తోంది.


 గ్రేటర్‌ వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీ సాధించినందున మేయర్‌ స్థానం ఆ పార్టీకే ఖరారైంది. గ్రేటర్‌ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే టీఆర్‌ఎస్‌ అధికారిక మేయర్‌ అభ్యర్థిగా సుధారాణి పేరు పార్టీ శ్రేణుల్లో బలంగా ప్రచారం జరిగింది. దీనిని ధ్రువపరుస్తూ ఆమె కార్పొరేటర్‌గా నిలబడి విజయం సాధించారు. మేయర్‌ స్ధానానికి మరొకరు పోటీ పడకుండా పార్టీ అధిష్ఠానం అన్ని దారులను ముందే వ్యూహాత్మంగా మూసివేసింది. పద్మశాలి సామాజిక వర్గానికి ప్రభుత్వంలో ఇప్పటివరకు తగిన ప్రాతినిథ్యం లభించలేదు. అన్ని సామాజిక వర్గాలకు పార్టీలోనూ, ప్రభుత్వ పరంగా ఏదో ఒక పదవి లభించింది.  పైగా గ్రేటర్‌ వరంగల్‌లో పద్మశాలీల జనాభా అధికంగా ఉండ‌టంతో ఆమె ఎంపిక లాంఛ‌న‌మేన‌ని తెలుస్తోంది.








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో ఇప్ప‌ట్లో క‌రోనాకు బ్రేక్ లేదా... ఇన్ని వేల కేసులా..

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ

విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో బీజేపీ కొంపముంచిన కారణం తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>