PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajenderc2083cc1-54a7-4e88-8dae-5755e829a4e0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajenderc2083cc1-54a7-4e88-8dae-5755e829a4e0-415x250-IndiaHerald.jpgఈట‌ల రాజేంద‌ర్ కొత్త‌పార్టీపై జోరుగా ప్ర‌చారం సాగుతుంది. తొలుత తెలంగాణ అనే ప‌దం వ‌చ్చేలా ఆయ‌న పార్టీ పేరును ప్ర‌క‌టించ‌బోతున్నార‌న్న చ‌ర్చ‌సాగుతుంది. గ‌త రెండు రోజులుగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని తెరాస కార్య‌క‌ర్త‌లు, త‌న అభిమానుల‌తో ఈట‌ల స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. వారి అభిప్రాయాల‌ను సేక‌రిస్తున్నారు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కొత్త పార్టీ అనేది అంత భావ్యం కాద‌ని కొంద‌రు ఈట‌ల‌కు సూచిస్తున్నార‌ట‌. ముందుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్దామ‌ని, ఆ త‌రువాత ప్ర‌జ‌ల‌నుంచి వ‌చ్చే స్పంద‌న‌ను బ‌ట్టి పార్టీ పెడితేetela rajender;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;telangana;telugu;cabinet;mla;central government;petta;partyఈట‌ల‌కు తెలుగు త‌మ్ముళ్ల ఆహ్వానం.. సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్‌ఈట‌ల‌కు తెలుగు త‌మ్ముళ్ల ఆహ్వానం.. సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్‌etela rajender;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;telangana;telugu;cabinet;mla;central government;petta;partyWed, 05 May 2021 14:26:01 GMTతెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు తెరాస ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌. మెద‌క్ జిల్లాలోని అచ్చంపేట వ‌ద్ద భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డంతో సీఎం కేసీఆర్ విచార‌ణ‌కు ఆదేశించారు. ముందే ప్లాన్ చేసుకున్న‌ట్లుగా విచార‌ణ జ‌రుగుతున్నక్ర‌మంలోనే ఈట‌ల నిర్వ‌హిస్తున్న వైద్య ఆరోగ్య‌శాఖ‌ను త‌న‌కు బ‌ద‌లాయించుకున్న కేసీఆర్‌.. మ‌రుస‌టిరోజే ఈట‌ల‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశాడు. ఈ ప‌రిణామాల‌తో తెరాస శ్రేణుల్లో అయోమ‌యం నెల‌కొంది. ఈట‌ల‌ను కావాల‌నే సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారంటూ సొంత‌పార్టీలోని ప‌లువురి నుంచి, ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే కేసీఆర్ తీరుతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన ఈట‌ల‌.. తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కొత్త పార్టీ పెట్టేందుకు అడుగులు వేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.
 
ఈట‌ల రాజేంద‌ర్ కొత్త‌పార్టీపై జోరుగా ప్ర‌చారం సాగుతుంది. తొలుత తెలంగాణ అనే ప‌దం వ‌చ్చేలా ఆయ‌న పార్టీ పేరును ప్ర‌క‌టించ‌బోతున్నార‌న్న చ‌ర్చ‌సాగుతుంది. గ‌త రెండు రోజులుగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని తెరాస కార్య‌క‌ర్త‌లు, త‌న అభిమానుల‌తో ఈట‌ల స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. వారి అభిప్రాయాల‌ను సేక‌రిస్తున్నారు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కొత్త పార్టీ అనేది అంత భావ్యం కాద‌ని కొంద‌రు ఈట‌ల‌కు సూచిస్తున్నార‌ట‌. ముందుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్దామ‌ని, ఆ త‌రువాత ప్ర‌జ‌ల‌నుంచి వ‌చ్చే స్పంద‌న‌ను బ‌ట్టి పార్టీ పెడితే బాగుంటుంద‌ని ఈట‌ల వ‌ద్ద ప్ర‌స్తావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న బీజేపీలోకి వెళ్తార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా ఈట‌ల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని ఇప్ప‌టికే కేంద్ర పార్టీ పెద్ద‌ల నుంచి ఆహ్వానం అందిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.

ఈట‌ల పార్టీ పెడుతార‌న్న ఊహాగానాల నేప‌థ్యంలో తెలుగు త‌మ్ముళ్లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. ఈట‌లను తెలుగుదేశంలోకి రావాల‌ని, తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని కోరుతున్నార‌ట‌. ఇందుకు సంబంధించి చంద్ర‌బాబు, ఈట‌ల క‌లిసి ఉన్న ఫొటోల‌ను సోష‌ల్‌మీడియాలో తెలుగు త‌మ్ముళ్లు పోస్టు చేస్తున్నారు. మ‌రోవైపు బీసీల‌కు పెద్ద‌పీట వేసేది తెదేపానేన‌ని, తెదేపావ‌ల్ల‌నే బీసీల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని, అందుకే తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ప‌గ్గాలు అందిపుచ్చుకుంటే తామంతా నీవెంటా న‌డుస్తామంటూ తెలంగాణ తెలుగు త‌మ్ముళ్లు కోరుతున్నారు. మొత్తానికి ఈట‌ల వ్య‌వ‌హారంతో తెలంగాణ రాజ‌కీయాల్లో కొత్త ప‌రిణామాలు చోటు చేసుకోబోతున్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణలో వారాంతపు లాక్‌డౌన్‌ పెట్టడండి : హైకోర్టు కీలక సూచనలు

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>