MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dasari-birthday-specialcce293bc-c4fa-42c7-bdf9-6ba1c0638204-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dasari-birthday-specialcce293bc-c4fa-42c7-bdf9-6ba1c0638204-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు. నట భీముడు నందమూరి తారక రామారావు వీరి కాంబినేషన్ అప్పట్లో ఒక ప్రభంజనం. వీరిద్దరూ కాంబోలో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. DASARI-BIRTHDAY-SPECIAL;ntr;dasari narayana rao;jeevitha rajaseskhar;manu;ramu;tollywood;cinema;blockbuster hit;tiger;nandamuri taraka rama rao;leader;bobbili puli;bobbiliవీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !వీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !DASARI-BIRTHDAY-SPECIAL;ntr;dasari narayana rao;jeevitha rajaseskhar;manu;ramu;tollywood;cinema;blockbuster hit;tiger;nandamuri taraka rama rao;leader;bobbili puli;bobbiliTue, 04 May 2021 14:00:00 GMTతెలుగు సినిమా దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు. నట భీముడు నందమూరి తారక రామారావు వీరి కాంబినేషన్ అప్పట్లో ఒక ప్రభంజనం. వీరిద్దరూ కాంబోలో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు తో ఎన్టీఆర్ చేసిన సినిమాలు ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశానికి ఎంతగానో దోహదపడ్డాయి అని, ఆయన రాజకీయాల్లో నిలబడడానికి కీలక పాత్ర పోషించాయని చెబుతుంటారు. అంతగా ఆయన సినిమాలు ఎన్టీఆర్ ను ప్రజల మనసుల్లో ఒక లీడర్ గా నిలబెట్టాయి అంటుంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో మొత్తం ఐదు చిత్రాలు తెరకెక్కాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం .
వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘మనుషులంతా ఒక్కటే’ .

ఈ సినిమాలో రామారావు గారి పాత్రతో మానవత్వ విలువలను చాటి చెప్పి అందరి హృదయాలను కదిలించాడు దాసరి నారాయణ రావు. వీరి కాంబోలో వచ్చిన రెండో చిత్రం ‘సర్కస్ రాముడు’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. వీరి కలయికలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం  ‘సర్ధార్ పాపారాయుడు’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.  ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం 'సర్దార్ పాపారాయుడు'.
స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ పాపన్న గౌడ్ జీవిత చరిత్రను ఆధారం చేసుకుని దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత వీరి నుండి 'విశ్వరూపం' చిత్రం వచ్చింది.. కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది.

నందమూరి తారక రామారావు దాసరితో చేసిన బొబ్బిలి పులి సినిమా ఒక సంచలనం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ జీవితంలో మరో చాప్టర్ మొదలైందని చెప్పాలి. ఈ చిత్రం తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి నాయకుడిగా ప్రజలకు మరింత చేరువయ్యారు. ప్రజల అండతో ముఖ్యమంత్రిగా ఎన్నికై  ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈ విధంగా దివంగత నటుడు దర్శకుడు దాసరి నారాయణరావు స్వర్గీయ నందమూరి తారకరామారావుతో చేసిన సినిమాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ రోజు దాసరి పుట్టినరోజు కారణంగా ఈ విషయాలను మరో సారి మనము గుర్తు చేసుకోవడం మన అదృష్టంగా భావించాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'నో చాన్స్.. లాక్ డౌన్ పెట్టాల్సిందే.. '

ఈటెల సొంత పార్టీ పెడితే ఏం జరుగుతుంది...?

వాక్సిన్ ఎక్కడ మోడీ...? కంపెనీలకు డబ్బులు ఇవ్వలేదా...?

2021ని టాలీవుడ్ మర్చిపోవాల్సిందేనా..?

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>